Jump to content

పీల్ డిస్ట్రిక్ స్కూలు బోర్డ్

వికీపీడియా నుండి
(Peel District School Board నుండి దారిమార్పు చెందింది)

పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు (Peel District School Board) కెనడా దేశంలోని రీజనల్ మున్సిపాలిటీ ఆఫ్ పీల్ (దీనిని పీల్ రీజియన్ అని పిలుస్తుంటారు) పీల్ డిస్ట్రిక్ బోర్డ్ అనే స్కూలు ఉంది. బ్రాంప్టన్, కలెడాన్, మిసిసౌగ మున్సిపాలిటీలలో పీల్ డిస్ట్రిక్ బోర్డ్కు చెందిన 230 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో 15,000 మంది పూర్తిసమయ ఉద్యోగులు పనిచేస్తున్నారు. పీల్ రీజియన్ మొత్తంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న సంస్థగా ఈ పాఠశాల ప్రాధాన్యత ఉంది.

వ్యూహాత్మక ప్రణాళిక

[మార్చు]

పీల్ బోర్డ్ కార్యక్రమాలన్నింటిని వ్యూహాత్మక ప్రణాళికగా చేస్తుంది. ఇందులో భాగంగా రిపోర్త్ కార్డ్ ఫర్ స్టూడెంట్ సక్సెస్ ప్రణాళిక రూపొందించింది. ఈ పరిశోధనాత్మక పద్ధతి విద్యార్థుల లక్ష్యసాధనకు కావలసిన ప్రేరణ కలిగించడమే కాక దానిని కార్యరూపంలోకి తీసుకురావడానికి సహకరిస్తుంది. అంతాకాక వనరుల మీద దృష్టి సారించి వారు ప్రతిభావంతులు కావడానికి సహకరిస్తుంది.

చరిత్ర

[మార్చు]

1969లో 10 ప్రాంతీయ కమిటీలు కలసికట్టుగా పీల్ కౌటీ బోర్డ్ ఎడ్యుకేషన్ వద్దకు వచ్చారు. 1969లో ఈ బోర్డ్ ఈ ప్రాంతంలో నివసిస్తున్న 20% ప్రజల పిల్లలకు విద్యా సేవలు అందించింది. 1969లో ఇక్కడ విద్యనభ్యసించిన విద్యార్థుల సంఖ్య 2,50,000 మంది. కొత్తగా రూపొందిన పీల్ కౌంటీ బోర్డ్ విద్యార్థుల సంఖ్య 50,000. పీల్ బోర్డ్ పాఠశాలల సంఖ్య 114. 2009 సంవత్సర ఆర్థిక ప్రణాళికా వ్యయయం (బడ్జెట్)41 మిలియన్ల అమెరికన్ డాలర్లు. 1973లో పీల్ కౌటీ బోర్డ్ పేరును పీల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. ప్రస్తుత పేరైన పీల్ డిస్ట్రిక్ స్కూల్ బోర్డ్ 1998లో ప్రభుత్వ అనుమతిని పొందింది.

పీల్ బోర్డ్ చిహ్నం

[మార్చు]

2005లో పీల్ బోర్డ్ తనకు ఒక ప్రత్యేక చిహ్నం ఏర్పరచుకున్నది. 2003 నవంబరున బోర్డ్ ఫ్యూచర్ కమిటీ- ఉద్యోగులలో ఎన్నిక చేయబడిన కొంత మందిని, యాజమన్యం పర్వవేక్షణలో సరికొత్త చిహ్నం చిత్రాన్ని తయారు చెయ్యడానికి అనుమతించింది. ఈ చిహ్నం తయారు చెయ్యడానికి కమిటీ హంబ్లీ, వూలీలతో కలసి పనిచేసింది. ఈ చిహ్నం వెనుక సిబ్బంది, విద్యార్థులు, తల్లితండ్రులు, ప్రతినిధులు మొత్తం 500 మంది విశ్వాసం, సంస్కృతి ఉన్నాయి.

సమానత్వం

[మార్చు]

2009లో పీల్ బోర్డ్ బ్రాంప్టన్, మాల్‌టన్, మిస్సిసౌగ అనే మూడు ప్రదేశాలలో అంతర్జాతీయ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాలు కొత్తగా వచ్చే కుంటుంబాలకు వారి పిల్లలను స్కూలులో చేర్చడానికి కెనడాలో స్థిరపడడానికి సహకరిస్తుంటాయి. ఈ కేంద్రాల సిబ్బంది కావలసిన సమాచారం అనేక భాషలలో ఉచితంగా అందించడానికి సహకరిస్తుంది.

మతపరమైన వసతి గృహాలు

[మార్చు]

పీల్ బోర్డ్ ఫెయిత్ ఫార్వార్డ్ అన్న పేరుతో అనేక విశ్వాసాలు, సంస్కృతులు, మతసంస్థల ఉత్సవాలు జరపడానికి కావలసిన వనరులు అందించి సహకరిస్తుంది. శలవు దినాలు, పవిత్ర దినాలు, కేలండర్లు, పోస్టర్లు, వనరుల వివరణా పుస్తకము (గైడ్), పాఠ్యాంశా ప్రణాళికలు, శిక్షణ అందిస్తుంది. సిబ్బందికి, విద్యార్థులకు ఏవిధమైన విశ్వాస పరమైన ఉత్సవాలకు, సాంస్కృతిక ఉత్సవాలకు మార్గదర్శకం వహిస్తుంది. ఈ ఉత్సవాలలో పాల్గొనడం లేక పాల్గొనకపోవడం వారి వారి హక్కుగా బోర్డ్ భావిస్తుంది. ప్రత్యేక ప్రార్ధాన చేసుకోవడానికి కావలసిన సదుపాయాలను మతపరమైన అలంకరణ చేసుకోవడానికి, ప్రత్యేక పవిత్ర దినాలను జరుపుకోవడానికి, అతిథులకు కావలసిన వసతి సదుపాయాలను, అహారసరఫరఅ వంటి సౌకర్యాలను ఈ బోర్డ్ సహకరిస్తుంది.

పరస్పర ఆర్ధికసహకార విధానం

[మార్చు]

పీల్ బోర్డ్ తమ సిబ్బందికి స్వాగతపూర్వక వాతావరణంలో పనిచేసే అనుభూతి కలిగిస్తుంది. పీల్ బోర్డ్ అనుసరించే వైవిధ్యమైన పరస్పర ఆర్థికసహకార విధానం సిబ్బంది మరింత ఉత్సాహంతో పనిచేసే శక్తిని ఇస్తుంది. వాస్తవంగా విశ్వాసం కేంద్రమైన ఈ ప్రణాళికలో అంతర్భాగంగా లోపలి నుండి వెలుపలి నుండి మనస్ఫూర్తిగా చురుకుగా పనిచేసే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఈ ఆర్గనైనేషన్ అనుసరిస్తున్న వినూతన భాగస్వామ్య విధానం కారణంగా సంస్థ విజయం అందరికీ పంచబడుతుంది.

  • పరస్పర ఆర్థిక సహకార విధానంతో సాధించినవి
  • ప్రత్యేక సందర్భాలు, సభలు మొదలైన వాటికి మార్గదర్శకత్వం వహిస్తుంది. ఈ విధానం విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడానికి కావలసిన సలహా సంప్రదిపులను అందించే బృందాన్ని తయారు చేసి సమాజోన్నతికి సహకరిస్తుంది.
  • ప్రధాన నాయకులకు విశ్వాసాలను గురించిన ప్రాథమిక సూత్రాలను, భావనలు, ప్రవర్తన వంటి శిక్షణ ఇవ్వడము.
  • అంతర్జాల సమావేశాలతో పీల్ బోర్డ్ సిబ్బందికి అందుబాటులో ఉంటూ వారిని అప్రమత్తులను చేయడం.
  • ఈ ప్రణాళిక గురించిన సలహా సంప్రదింపులను దీనిని ముందుకు తీసుకు పోవడం.

ప్రవర్తనా సరళి

[మార్చు]

పీల్ బోర్డ్ తమ సిబ్బంధి, విద్యార్థులకు ఉత్తమప్రవర్తనా సరళి కలిగించడం మీద తమ దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఉత్తమ ప్రవర్తన కలిగించడానికి కావలసిన శిక్షణ, కలసి పనిచేయడానికి స్ఫూర్తి కలిగించడం వంటివి పాఠశాలలో, పనిచేసే ప్రదేశాలలో నేరిస్తారు.

విద్యార్థులు, సిబ్బంది, సమాజ సభ్యులు, విశ్వాస బృందాలతో సంప్రదించి పీల్ బోర్డ్ ఆరు ప్రధాన గుణాలను ఎన్నిక చేసింది. ఆ ఆరు గుణాలు సంరక్షణ, సహకారం, విశ్వాసం, గౌరవం, భాధ్యాతాయుతంగా ఉండడం వంటి వాటితో చేర్చి ప్రణాళికా బద్ధం చేయని ప్రవర్తనా సరళికి కావలసిన లక్షణాలు, విలువల జాబితా ఉంది. అయినా వారు దేనికి అతిముఖ్యత్వం ఇవ్వాలో అన్న విషయంలో పీల్ బోర్డ్‌తో ఒప్పంద పూర్వక అవగాహనతో పనిచేస్తున్నారు.

సంరక్షణ

[మార్చు]

వివరణ: ఇతర్లపట్ల జాలి, దయ కలిగి ఉండడము. మీరు ఎప్పుడు శ్రద్ధ చూపాలంటే:

  • మానవులపట్ల, ఇతర ప్రాణులపట్ల కరూణ చూపుట.
  • ఇతరుల చింతలను శ్రద్ధగా విని తగిన విధంగా స్పందించడం.
  • సహాయము కావలసిన వారికి సహకరించడం.
  • ఇతరుల భావాలను మనఃపూర్వకముగా గుర్తించినట్లు వారికి అనుభూతి కలిగించడం.
  • రసిసరాలను గౌరవించి రక్షించడము.

సహకారం

[మార్చు]

వివరణ: ఒకే లక్ష్యం కొరకు ఈతరులతో కలసి కృషి చేయడం. మీరు ఎప్పుడు సహకారం ప్రదర్శించాలంటే:

  • ప్రయత్నపూర్వకంగా పాలుపంచుకోబ్వడం.
  • ఇతరులకు అనుకూలమైన విశ్వాసం కలిగించడం.
  • బృందందం నిర్ణయించిన చట్టాలను ఆచరించడం.
  • ఇతరుల భాలను సూచనలను గౌరవించడం.
  • ఇతరుల కృషికి సమర్పణలకు విలువ ఇవ్వడం.

విశ్వాసం

[మార్చు]

వివరణ: ఋజువర్తన, విశ్వవసీయత, నిజాయితీ కలిగి ఉండడం. మీరు ఎప్పుడు విశ్వాసం చూపాలంటే:

  • నిజం చెప్పండి - నిజాయితీగా, ఉదారస్వభావంతో, విశ్వసనీయంగా ఉండండి.
  • మీ చర్యలకు, మాటలకు బాధ్యత వహించండి.
  • మీ పొరపాట్లను మీరు అంగీకరించండి.
  • చట్టాలను ఆచరించండి.
  • ఇతరులు ఏమి అనుకుంటారో అని చూడకుండా మీరు సరి అనుకున్నది మీరు చెయ్యండి.

అంతర్భాగం

[మార్చు]

వివరణ: అందరితో సమానంగా, అభిమానంగా ప్రవర్తించడం.

మీరు అంతర్గతంగా ప్రవర్తించవలసిన తీరు :
  • అందరీనీ స్వాగతిస్తూ ఆదరంగా మెలగాలి.
  • ప్రతి ఒక్కరినీ గౌరవాభిమానలతో చూడడము.
  • సందర్భాలను సరిగా విచారించి సరి అయిన నిర్ణయాలు తీసుకోవడం.
  • ఇతరులకు తగిన సమయంలో అందుబాటులో ఉండడం.
  • వైవిధ్యాలను గౌరవించడం.

గౌరవం

[మార్చు]

వివరణ : ఇతరులపట్ల, మీపట్ల, పరిసరాల పట్ల ఊన్నతంగా పరిగణించి వులువను ఇవ్వాలి.

మీరు ఎప్పుడు గౌరవం చూపాలి :
  • అందరిపట్ల సున్నితంగా వ్యవహరించండము.
  • మీ పట్ల అలాగే ఇతరులపట్ల శ్రద్ధ వహించి ప్రవర్తించడం.
  • మీ సమాజము, మీ ఇల్లు, మీ పాఠశాల, మీ కార్యాలయము మర్యాద చూపడం .
  • మీకు మీరు, మీ శరీరం, మీ హక్కుల విలువతో ప్రవర్తించడం.
  • ఇతరుల ఆస్తులను, వస్తువులను సంరక్షించడం.

బాధ్యత

[మార్చు]

వివరణ: మీ కార్యక్రమాలు, మీ నిర్ణయాల బాధ్యతాయుతంగానూ నిజాయితీతోనూ మెలగండి.

మీరు ఎప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటే :
  • లక్ష్యలను నిర్ణయించికోండి దాని మీద దృష్టి నిలిపి దృఢంగా నిలవండి.
  • మీ వంతు కృషి మీరు చేయండి.
  • మీ పొరపాట్లను గుర్తించి వాఠి నుండి పాఠాలు నేర్చుకోండి.
  • మీ నిర్ణయాలను అనుసరిస్తూ ముందుకు సాగండి.
  • సమస్యలను చొరవ పట్టుదల ప్రదర్శించి పరిష్కరించండి.

కార్యక్రమాలు

[మార్చు]

పీల్ బోర్డ్ వయోజన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పగటి వేళలలో, రాత్రివేళలో, వారాంతాలలో తరగతులు జరిపుతారు. వీటిలో వయోజన ప్రయోజనకరమైన మాధ్యమిక స్కూలు డిప్లొమా, వయోజన ఇ ఎస్ ఎల్ కార్యక్రమాలు వయోజనులు వారి ఆంగ్లభాషా నైపుణ్యం, అక్షరాస్యత, అవసరమైన నిపుణత మెరుగుపరుచుకోవడానికి, ప్రత్యేక నైపుణ్యం పెంపొందించుకోవడానికి సహకరిస్తాయి. కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించిన కెనెడియన్లకు ఉపయోగించేలా రూపుదిద్దిన విదేశీ - ఉపాధ్యాయ శిక్షణ కారణంగా 2011లో పీల్ బోర్డ్ మాధ్యమాల ఆకర్షణ కూడా అందుకుంది. పీల్ బోర్డ్ వారాంతాలలో వారి విద్యార్థులకు అంతర్జాతీయ భాషలను నేర్చుకునే అవకాశం కూడా కల్పిస్తుంది. మాధ్యమిక పాఠశాల ముగించే సమయానికి అదనంగా విదేశీభాషా అర్హత కూడా పొందవచ్చు. విద్యార్థులు రాత్రి, వేసవి ప్రత్యేక తరగతులలో ప్రవేశించి భాషానైపుణ్యం, గణితంలో అదనపు నిపుణత, అంతర్జాతీయ పాఠశాలలలో శిక్షణ కూడా పొందవచ్చు.

ప్రత్యామ్నాయ కార్యక్రమాలు

[మార్చు]
  • ఫౌండేషన్ కార్యక్రమాలు :-
  • ఫ్రెష్ స్టార్ట్ సస్పెన్షన్ అండ్ ఎక్ష్పెల్షన్ కార్యక్రమాలు :-
  • సీనియర్ ఎలిమెంటరీ, ఇంటర్ మీడియట్ అండ్ సీనియర్ ఆల్టర్నేటివ్ కార్యక్రమాలు :-
  • సూపర్ వైజ్డ్ ఆల్టర్నేటివ్ లెర్నింగ్ :-
  • టెంపరరీ ఎక్స్‌టర్నల్ లెర్నింగ్ లింక్ :-
  • టీన్ ఎడ్యుకేషన్ అండ్ మదర్‌హుడ్ కార్యక్రమాలు :-

ప్రాంతీయ కార్యక్రమాలు

[మార్చు]

ప్రాంతీయ కార్యక్రమాలు 6,7, 9 తరగతులలో ప్రారంభిస్తారు. ప్రాంతీయ కార్యక్రమాల పాఠ్యాంశాలను ఒంటారియా విద్యార్థులు పూర్తి చేసారు. ప్రాంతీయంగా పెరుగుతున్న ఆసక్తి కారణంగా ఈ కార్యక్రమాల మీద అధికంగా దృష్టిని కేంద్రీకరించారు. ఆకురాలే కాలమంతా విద్యార్థులకు ఈ క్రింది కార్యక్రమాలలో నమోదు చేసుకోవడానికి సమాచారం అందిస్తుంది.

• కళలు • ఫ్లెక్సోగ్రఫీ (ప్రింట్ టెక్నాలజీ ప్యాకేజ్ ) • ఇంటర్నేషనల్ బకల్యూరేట్ • ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ టెక్నాలజీ • స్కిటెక్ • స్ట్రిప్స్ • ట్రక్ అండ్ కోచ్ పీల్ బోర్డ్ వెబ్‌సైట్ లో ప్రతి ఒక్క కార్యక్రమం వివరణ లభిస్తుంది.

స్పెషలిస్ట్ హై స్కిల్స్ హై స్కిల్స్ మేజర్ కార్యక్రమాలు

[మార్చు]

ప్రాంతీయ ప్రత్యేక కార్యక్రమాలు

[మార్చు]

మాద్యమిక పాఠశాల నాణ్యతాశ్రేణి

[మార్చు]

బోర్డ్ అంతర్గత పాఠశాలా విధానం

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]