Jump to content

ఒంగోలు

అక్షాంశ రేఖాంశాలు: 15°30′22″N 80°02′56″E / 15.506°N 80.049°E / 15.506; 80.049
వికీపీడియా నుండి
(Ongole నుండి దారిమార్పు చెందింది)
ఒంగోలు
City
ఒంగోలు
ఒంగోలు
ఒంగోలు is located in ఆంధ్రప్రదేశ్
ఒంగోలు
ఒంగోలు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానం
Coordinates: 15°30′22″N 80°02′56″E / 15.506°N 80.049°E / 15.506; 80.049
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
పురపాలకసంఘం1876
నగరపాలకసంస్థ2012 జనవరి 25
వార్డులు50
Government
 • Typeస్థానిక స్వపరిపాలన
 • Bodyఒంగోలు నగరపాలక సంస్థ
 • శాసనసభ్యుడు(రాలు)బాలినేని శ్రీనివాస‌రెడ్డి, YSRCP
 • పార్లమెంటు సభ్యుడు(రాలు)మాగుంట శ్రీనివాసులురెడ్డి YSRCP
విస్తీర్ణం
 • Total132.45 కి.మీ2 (51.14 చ. మై)
జనాభా
 (2011)[3][4]
 • Total2,08,344
 • జనసాంద్రత1,600/కి.మీ2 (4,100/చ. మై.)
 • నివాసగృహాలు
51,768
 నివాసగృహాలు [4]
అక్షరాస్యత వివరాలు
 • అక్షరాస్యులు1,53,628
 • అక్షరాస్యత83.04%
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (IST)
PIN
523001, 523002
ప్రాంతీయ ఫోన్ కోడ్+91–8592

ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా ముఖ్య పట్టణం, ఒంగోలు మండలానికి కేంద్రం. ఒంగోలు గిత్త అనే ఎద్దుల స్థానిక జాతి పేరు ఒంగోలు నుండి వచ్చింది.[6]

చరిత్ర

[మార్చు]

పటంఒంగోలు సమీపంలోని చినగంజాంలో దొరికిన ఆధారాలను అనుసరించి మౌర్య, శాతవాహనుల పాలన కాలంలోనే ఈ పట్టణం రూపుదిద్దుకున్నట్లు ఋజువౌతుంది. శాతవాహనుల తరువాత కాకతీయుల పాలనలో ఈ పట్టణం వెలుగులోకి వచ్చింది. ఆ సమయలో మోటుపల్లి, వాడరేవు ప్రసిద్ధ రేవు పట్టణాలుగా ఉన్నాయి. రెడ్డి రాజులు మొదట ఒంగోలు సమీపములోని అద్దంకిని రాజధానిగా పాలించారు. వంగవోలు రాజులు పరిపాలించారు కాబట్టి ఈ ప్రాంతానికి వంగవోలు అనే పేరు వచ్చింది.[ఆధారం చూపాలి] కాలక్రమేణా వంగవోలు పేరు ఒంగోలుగా స్థిరపడి పోయింది. కడప నవాబుల పాలనలో ఉన్న ఒంగోలు ప్రాంతం కర్ణాటక నవాబు హైదర్ అలీకి దత్తం చేయబడింది. 1801లో టిప్పూ సుల్తాన్ వద్ద నుండి బ్రిటీషు పాలనలోకి వచ్చింది.[7]

ఒంగోలుజాతి ఎద్దులు ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఎద్దులు. ప్రఖ్యాతిచెందిన జేబూ (Zebu) జాతి ఎద్దులలో ఇవి ఒకటి.

ఒంగోలు గిత్త

జనాభా వివరాలు

[మార్చు]

2011 జనగణన ప్రకారం, జనాభా 204,746. ఇందులో 102,835 మగవారు, 101,911 ఆడవారు ఉన్నారు. 0–6 వయసు లోపు వారు 19,744 మంది ఉన్నారు. ఇందులో 10,228 అబ్బాయిలు, 9,516 అమ్మయిలు. అక్షరాస్యత 83.04%.[8] జనాభాపరంగా ఆంధ్రప్రదేశ్ లో 13వ పెద్ద నగరం.[9]

పరిపాలన

[మార్చు]

1876లో ఒంగోలు పురపాలకసంఘం ఏర్పాటుచేశారు.[10] దీని ప్రస్తుత అధికార పరిది 25.00 కి.మీ2 (9.65 చ. మై.).

రవాణా సౌకర్యం

[మార్చు]

రహదారి మార్గం

[మార్చు]
ఒంగోలు రైలు స్టేషను

జాతీయ రహదారి 16, జాతీయ రహదారి 216 నగరం గుండా వెళ్ళే జాతీయ రహదార్లు. ఒంగోలు బస్ స్టేషన్ నుండి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు నడుపుతుంది.[11][12]

రైల్వేలు

[మార్చు]

ఒంగోలు రైల్వే స్టేషను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పై ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజను లోని దక్షిణ మధ్య రైల్వే జోన్కు చెందిన A-గ్రేడ్ రైల్వే స్టేషను.[13]

ప్రతిపాదనలు

[మార్చు]

ఒక కొత్త గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాన్ని 2014 ఫిబ్రవరిలో ఆమోదించారు.[14]

విద్యా సౌకర్యాలు

[మార్చు]

ఉన్నత విద్య

[మార్చు]

రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్,,[15] క్యు.ఐ.ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ,[16] ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ,[17] పేస్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ, దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వంటి కళాశాలలు ఒంగోలులో వున్నాయి

పాఠశాల విద్య

[మార్చు]

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒంగోలు ఒక పెద్ద కేంద్రమే. పట్టణం చుట్టూ వున్నా పల్లెల వలన ఒంగోలుకు వచ్చి పాఠశాల చదువు పొందేవారు సంఖ్యా ఎక్కువే.

వేదవిద్య

[మార్చు]

భరద్వాజ మహర్షి వేద విద్యా మండలి (అలూరి సీతారామమ్మ-రామకోటేశ్వరరావు పాఠశాల)

వైద్య సౌకర్యాలు

[మార్చు]

ప్రభుత్వ ఆసుపత్రి రిమ్స్ తో పాటు పలు అల్లోపతి ప్రైవేటు ఆసుపత్రులున్నాయి.

ఆర్ధిక వ్యవస్థ

[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్లో వర్జీనియా రకం పొగాకు పంటకు ఒంగోలు ఒక ప్రధాన ఉత్పత్తి, వాణిజ్య కేంద్రము. గ్రానైటు గనులకు ప్రసిద్ధి చెందినది.

సమావేశ మందిరం, ఒంగోలు

ఒంగోలులోని పెద్ద వ్యాపార సంస్థలు రైతుకుటుంబాలచే స్థాపించబడ్డాయి. పొగాకు కంపెనీలు, పంట, వ్యాపారం బాగా జరుగుతూ వచ్చింది. 1970, 80 దశాబ్దాలలో షూ, పెయింట్, మందులకంపెనీ, పివిసి మొదలైన పరిశ్రమలు ప్రారంభించబడ్డాయి. కానీ వీటిలో చాలావరకు పోటీకి నిలిచి మనుగడ సాగించడంలో విఫలమయ్యాయి. ఎనభై, తొభైయవ దశాబ్దంలో నూతన సెకండరీ, ఇంటర్మీడియట్ కళాశాలలు, ఆసుపత్రుల స్థాపనలు అధికమైనాయి. ఎనభైయ్యవ దశకంలో ఒంగోలు పశ్చిమ దిశలో గ్రానైట్ నిక్షేపాలు వెలుగు చూడటంతో వ్యాపార పరంగా సరికొత్త అధ్యాయం మొదలైంది.

సంస్కృతి

[మార్చు]

పండుగలు

[మార్చు]

ప్రతి దీపావళికి ముందు నరకాసుర వధ ప్రదర్శన సాంప్రదాయం 1902 నుంచి కొనసాగుతుండటం విశేషం. నరక చతుర్దశి రోజు అర్ధరాత్రి ఈ ప్రదర్శన మొదలై తెల్లవారు జామున నాలుగు గంటలకు ముగుస్తుంది. ఒంగోలు శ్రీయువజన మిత్రమండలి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరుగుతాయి. పట్టణంలోని తూర్పుపాలెం నివాసి సింగరాజు సుబ్బయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం మొట్టమొదటి సారిగా ప్రారంభమైంది.[18]

కళారంగం

[మార్చు]

ప్రతీ యేడు ఇక్కడ ఎన్.టి.ఆర్ కళా పరిషత్, ఒంగోలు ఆధ్వర్యంలో జరిగే నాటకోత్సవాలు జరుగుతాయి. ఒంగోలు నుండి ఎంతో మంది ప్రముఖులు నాటక, చిత్ర రంగమందు ప్రసిద్ధి చెందారు. "కంచు కంఠం"గా పేరొందిన నటుడు కొంగర జగ్గయ్య ఈ ప్రాంతంనుండి భారత లోక్ సభ సభ్యుడిగా, ఎన్నికైన తొలి భారతీయ కళాకారునిగా కూడా చరిత్రకెక్కారు.[ఆధారం చూపాలి]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]
సాయిబాబ మందిరం, ఒంగోలు
  1. శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం, (సంత పేట)
  2. శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయం:- 15వ శతాబ్దానికి చెందిన ఒంగోలు రాజు శ్రీ మందపాటి రామచంద్రరాజు, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ ఆలయ నిర్మాణం జరిపించారు. ఆయన తన గుర్తుగా, ఈ ఆలయానికి ఒక ఖడ్గాన్ని బహూకరించారు, ఆ ఖడ్గం ఇప్పటికీ ఆలయంలో చెక్కుచెదరకుండా భద్రంగా ఉంది.[19]

ప్రముఖులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Ongole Municipal Corporation publishes voter classification list". The Hans India. Ongole. 5 June 2019. Archived from the original on 2 January 2021. Retrieved 8 June 2019.
  2. "Municipality Profile". ongole.cdma.ap.gov.in. Archived from the original on 27 ఏప్రిల్ 2019. Retrieved 27 April 2019.
  3. "Population statistics". Census of India. The Registrar General & Census Commissioner, India. Retrieved 27 April 2019.
  4. 4.0 4.1 "Statistical Abstract of Andhra Pradesh, 2015" (PDF). Directorate of Economics & Statistics. Government of Andhra Pradesh. p. 44. Archived from the original (PDF) on 14 July 2019. Retrieved 27 April 2019.
  5. "District Census Hand Book : Prakasam (Part B)" (PDF). Census of India. Directorate of Census Operations, Andhra Pradesh. 2011. p. 48. Retrieved 1 June 2019.
  6. India, The Hans (2017-12-03). "Ongole Cattle". www.thehansindia.com. Retrieved 2019-04-27.
  7. Edward B. Eastwick (1879). Handbook of the Madras Presidency. John Murray. p. 329.
  8. "Part III, District and Sub-District (Mandals)" (PDF). Census of India. The Registrar General & Census Commissioner, India. pp. 157, 178. Retrieved 27 April 2019.
  9. "Ongole Municipal Corporation". Archived from the original on 2019-08-06. Retrieved 2019-08-04.
  10. Imperial Gazetteer of India. Provincial series - Madras. 1908. p. 338.
  11. "Bus Stations in Districts". Andhra Pradesh State Road Transport Corporation. Archived from the original on 22 మార్చి 2016. Retrieved 8 March 2016.
  12. Krishnamoorthy, Suresh (22 April 2015). "Several bus stations lack CCTV surveillance". The Hindu. Hyderabad. Retrieved 8 March 2016.
  13. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  14. "Ongole Airport Site Approved". Hindu Business Line. Retrieved 19 February 2014.
  15. "RIMS College - ONGOLE". Rimsongole.org. Archived from the original on 2014-03-06. Retrieved 2013-09-29.
  16. "QIS College of Engineering & Technology :: Ongole". Qiscet.edu.in. 2013-07-12. Retrieved 2014-03-04.
  17. "Prakasam Engineering College". Prakasamec.com. 2013-04-06. Retrieved 2014-03-04.
  18. ఒంగోలులో నరకాసుర వధ, ఈనాడు ఆదివారం 27, అక్టోబరు 2013
  19. వైద్య సౌకర్యాలు ప్రకాశం/ఒంగోలు; Archived from ఈనాడు 2019,జూన్-25.

వెలుపలి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఒంగోలు&oldid=4275478" నుండి వెలికితీశారు