Jump to content

డ్రాగన్ బాల్ జి

వికీపీడియా నుండి
(Dragon Ball Z నుండి దారిమార్పు చెందింది)


డ్రాగన్ బాల్ జి
Logo Dragon Ball Z.png
డ్రాగన్ బాల్ జి లోగొ
ドラゴンボールZ
ధారావాహిక రకముయాక్షన్, అడ్వెంట్చర్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్
ఇవి కూడా చూడండి
యానిమే, మాంగా పోర్టల్

డ్రాగన్ బాల్ జి, జపనీస్ ఏనిమి, మాంగా సిరీస్. దీనిని టోయ్ యానిమేషన్ అనే కంపెనీ తయారు చేస్తుంది. ఇది డ్రాగన్ బాల్ కు తరువాయి భాగము. ఇది డ్రాగన్ బాల్ మాంగాలోని 519 అధ్యాయాల్లోని చివరి 325తో ఏర్పడిన కథే అయినా కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.[1]  డ్రాగన్ బాల్ మాంగాను అకైరా టొరియామ రచించారు. డ్రాగన్ బాల్ జి మొట్టమొదటిసారి  1989 ఏప్రిల్ 26 నుంచి  1996 జనవరి 31 వరకు ఫుజి టీ.వి.లో ప్రదర్శించబడింది. తరువాత అవి కార్టూన్ నెట్వర్క్ (ఇండియా)లో హిందీ, తెలుగు, తమిళంలో 2000వ నంవత్సరం నుండి ప్రదర్శింపబడుతున్నవి.[2]

డ్రాగన్ బాల్ జి [[సన్ గోకు (డ్రాగన్ బాల్)|గోకు]] అతని సహచరులతో కలిసి, భూమి, విశ్వాన్ని ఆండ్రోయిడ్స్, ఇతర జీవులు: ఫ్రీజా, సెల్, మాజిన్ బూ వంటి వారి నుండి రక్షిస్తుంటారు. అయితే అసలు డ్రాగన్ బాల్ అనిమే గోకు బాల్యం నుండి యవ్వనాన్ని చిత్రీకరిస్తే, డ్రాగన్ బాల్ జి మాత్రం తన పిల్లలు, గోహాన్, గోటన్, తన ప్రత్యర్థులు పికలో and వెజిటాలతో కలిసి శత్రువులతో పోరాడటాన్ని చిత్రీకరిస్తుంది.[3]

డ్రాగన్ బాల్ జి అమెరికాలో బాగా ప్రజాదరణ పొందడం వలన, విజ్ మీడియా మాంగా అధ్యాయాలను అక్కడ విడుదల చేసింది.[4] డ్రాగన్ బాల్ జి సంపాదించిన అశేష ప్రజాదరణ వలన డ్రాగన్ బాల్ విశ్వంలోని చాలా విషయాన్ని విడుదల చేసారు: వాటిలో 17 సినిమాలు,[5] 148 వీడియో గేమ్స్ ఉన్నవి, వాటిలో చాలా జపాన్ లో మాత్రమే విడుదల అయ్యాయి. డ్రాగన్ బాల్ జి ఒక సాంస్కృతిక గుర్తుగా మిగిలింది.[6] దానిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి, వాటిలో భాగమే డ్రాగన్ బాల్ కై.' డ్రాగన్ బాల్ జికి రెండు సీక్వెల్ సిరీస్ ఉన్నవి అవి; [[Dragon Ball GT|డ్రాగన్ బాల్ జిటి]] (1996-1997), [[Dragon Ball Super|డ్రాగన్ బాల్ సూపర్]] (2015-2018).[7]

కథా సారాంశం

[మార్చు]

డ్రాగన్ బాల్ జి కథ డ్రాగన్ బాల్ ఎనిమి ముగింపు తర్వాత ఐదు సంవత్సరాలకు చోటు చేసుకుంటుంది. [[సన్ గోకు (డ్రాగన్ బాల్)|గోకు]] తండ్రి అవుతాడు, తన కుమారుడు పేరు గోహాన్. రాడిట్జ్ అనే ఒక మానవరూప గ్రహాంతరవాసి భూమి మీదకు వచ్చి గోకుని కనిపెడతాడు. అతను గోకు తన సుదీర్ఘకాలములో కోల్పోయిన తమ్ముడిగా, వారు దాదాపు అంతరించిపోయిన గ్రహాంతరజాతి అయిన సెయన్స్. సెయన్స్ గోకును భూమిని ఆక్రమించడానికి పంపారని, తన అసలు పేరు "కాకరాట్" అని, చిన్నప్పుడు మెదడుకు తగిలిన గాయం వలన గతాన్ని మరిచిపొయాడని వివరిస్తాడు. రాడిట్జ్ కు సహాయం చేసి మిషన్ కొనసాగించడానికి గోకు నిరాకరిస్తాడు, అందువలన రాడిట్జ్ గోహాన్ ను అపహరిస్తాడు. గోకు తన మాజీ శత్రువు అయిన పికలో కలిసి రాడిట్జ్ ను ఓడించే  క్రమంలో గోకు తన ప్రాణాలు కోల్పోతాడు.. మరణానంతరం, గోకు కింగ్ కై వద్ద శిక్షణ పొందుతాడు, తరువాత డ్రాగన్ బాల్స్ సాయంతో ఒక సంవత్సరం తరువాత రాడిట్జ్ యొక్క స్నేహితులు అయిన నప్పా, సెయన్స్ కు రారాజు అయిన వెజిట నుండి భూమిని కాపాడడానికి గోకును బ్రతికిస్తారు. యుద్ధసమయంలో పికలోతో పాటు, గోకు యొక్క మిత్రులు అయిన యాంఛా, టిఎన్ షింహా, చాఒట్సు చనిపోతారు, పికలో మరణం వలన డ్రాగన్ బాల్స్ పనికిరాకుండా పోతాయి. గోకు ఆలస్యంగా యుద్ధరంగంలోకి వచ్చినా తన కొత్త శక్తులతో పడిపోయిన తన స్నేహితులను కాపాడి నప్పాను ఓడిస్తాడు, వెజిటతో భీకరంగా పోరాడి గెలుస్తారు, కానీ వెజిటను ప్రాణాలతో భూమి నుండి పారిపోనిస్తారు.[8] యుద్ధ సమయంలో, వెజిట అసలైన డ్రాగన్ బాల్స్ పికలో యొక్క గ్రహం అయిన నామిక్ లో ఉన్నయి అని చెప్పడం క్రిల్లిన్ వింటాడు. అయితే గోకు గాయాలకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఉండగా, గోహాన్, క్రిల్లిన్, గోకు యొక్క స్నేహితురాలు బుల్మ నామిక్ గ్రహానికి బయలుదేరుతారు. అయితే, మధ్యమార్గంలో వెజిట యొక్క పైఅధికారి, గెలాక్సీ లోనే ఎంతో క్రూరుడయిన లార్డ్ ఫ్రీజ డ్రాగన్ బాల్స్ తో అమరత్వం పొందడానికి ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. తనకు పూర్తిగా నయం అయ్యాక వెజిట నామిక్ కు వస్తాడు. ఫ్రీజ యొక్క అనుచరులతో యుద్ధం చేస్తాడు. చివరకు గోహాన్, క్రిల్లిన్ తో కలిసి గిన్యు ఫోర్స్ తో పోరాడుతాడు. చివరకు పికలోని బ్రతికించి, నామిక్ కు రప్పిస్తారు, వెజిటను ఫ్రీజ చంపేస్తాడు. తర్వాత గోకు వచ్చి భయంకరమైన యుద్ధంలో ఫ్రీజని ఓడించడానికి సూపర్ సెయన్ గా మారుతాడు.[9]

తరువాతి సంవత్సరం భూమికి చేరుకున్న గోకును చూడడానికి భవిష్యత్తు నుండి ట్రంక్స్ (బుల్మ, వెజిట యొక్క పుత్రుడు)  వచ్చి, ఆండ్రాయిడ్స్ గురించి హెచ్చరిస్తాడు. ఎన్నో యుద్ధాల తరువాత ఆ రెండు ఆండ్రాయిడ్స్ ను శోషించి సెల్ పర్ఫెక్ట్ సెల్ గా మారుతాడు.[10] అతనితో జరిగిన యుద్ధంలో గోకు ప్రాణత్యాగం చేస్తాడు. ఆ సమయములో గోహాన్ సూపర్ సెయన్ లో రెండో స్థాయికి చేరుకుని సెల్ ని ఓడిస్తాడు. ఏడు సంవత్సరములు తరువాత, గోకును ఒక్కరోజుకు మరణానంతరం భూమి మీదకు పంపినప్పుడు అతను తన రెండవ కొడుకు అయిన గోటన్ ను కలుస్తాడు. ఆ సమయములో గోకు అతని స్నేహితులు సృష్టికర్త దేవుడు అయిన సుప్రీం ఖాయ్ తో కలిసి మాజిన్ బూతో యుద్ధం చేస్తారు. అనేక యుద్ధముల తరువాత, భూమి విధ్వంసం అవుతుంది మళ్ళీ దానిని సృష్టిస్తారు. గోకు సుప్రీం ఖాయ్ యొక్క గ్రహంపై భూమి మీద ఉన్న వారి అందరి శక్తితో స్పిరిట్ బాంబ్ ను తయారు చేసి, దానితో బూని చంపుతారు.[11]

సూచనలు

[మార్చు]
  1. "Dragon Ball Z: 15 Biggest Differences Between The Manga And The Anime". Retrieved 28 May 2018.
  2. "DRAGON BALL SUPER timings-India". Retrieved 27 May 2018.
  3. "Dragon Ball Z IMDB". Retrieved 28 May 2018.
  4. "20 Years Ago, Dragon Ball Z Came to America to Stay". Retrieved 28 May 2018.
  5. "Every Dragon Ball Z movie ranked". Retrieved 28 May 2018.
  6. "'Avengers: Infinity War' Sets up the MCU to Pull a 'Dragon Ball Z'". Retrieved 28 May 2018.
  7. "Is it the end of the road for anime in India?". Retrieved 27 May 2018.
  8. "Dragon Ball Z Saiyan Arc". Retrieved 28 May 2018.
  9. "DRAGON BALL Z: TOP 10 PLOT TWISTS- IGN". Retrieved 28 May 2018.
  10. "'Dragon Ball Super' Just Filled A Big 'Dragon Ball Z' Plot Hole". Retrieved 28 May 2018.
  11. "Dragon ball Z plot-DRagon ball Wikia". Retrieved 27 May 2018.