డి.పి.కె.జి.

వికీపీడియా నుండి
(Dpkg నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
dpkg
Debian-OpenLogo.svg
మూలకర్త ఇయాన్ ముర్డాక్
అభివృద్ధిచేసినవారు dpkg జట్టు
సరికొత్త విడుదల 1.15.7.2
మునుజూపు విడుదల 1.15.8.4
ప్రోగ్రామింగ్ భాష C
నిర్వహణ వ్యవస్థ యునిక్స్-వంటిది
రకము ప్యాకేజీ నిర్వహణ వ్యవస్థ
లైసెన్సు గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్
వెబ్‌సైట్ www.debian.org/doc/FAQ/ch-pkgtools.en.html

dpkg అనేది డెబియన్ ప్యాకేజీ నిర్వాహక వ్యవస్థలో ఒక సాఫ్టువేరు. dpkg ని .deb ప్యాకేజీలను స్థాపించుటకు, తీసివేయుటకు, సమాచారాన్ని తెలుసుకునేందుకు వాడుతారు.

డిపికెజి ఒక తక్కువ స్థాయి సాధనం; ఆప్ట్ వంటి ఎక్కువ స్థాయి సాధనాలు సుదూర ప్రాంతాల నుండి ప్యాకేజీలను పాందటానికి లేదా క్లిష్టమైన ప్యాకేజీ సంబంధాలను వ్యవహరించుటకు వాడతారు. ఆప్టిట్యూడ్ లేదా సినాప్టిక్ వంటి సాధనాలు డిపికెజి కంటే ఎక్కువగా వినియోగిస్తారు, ఇందుకు కారణం అవి ప్యాకేజీ బాంధవ్యాలతో మరింత ఆధునాతన మార్గాలలో వ్యవహరిస్తాయి అంతేకాకుండా ఆకర్షనీయ అంతరవర్తిని కలిగి డిపికెజి కంటే మరింత సౌలభ్యంగాను ఉంటాయి.

డి.పి,.కె.జి డెబియన్ ఆపరేటింగ్ వ్యవస్థలో భాగం

డెబియన్ ప్యాకేజీ అయిన "dpkg" డిపికెజి ప్రోగ్రామును సమకూరుస్తుంది, అంతేకాకుండా dpkg-statoverride, dpkg-divert, update-alternatives వంటి ప్రోగ్రాములు పనిచేయడానికి ఇది అవసరం. ఇంకా ఇందులో start-stop-daemon, install-info వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి, తరువాత వెనుకటి అనుగుణ్యత కోసం ఉంచబడనవి. డెబియన్ ప్యాకేజీ అయిన "dpkg-dev" కలిగివున్న అనేక నిర్మాణాలకి అవసరమయ్యే ఉపకరణాలను క్రింద వివరించడం జరిగింది.

చరిత్ర

[మార్చు]

డిపికెజి అనేది మాట్ట్ వెల్ష్, కార్ల్ స్ట్రీటర్, ఇయాన్ ముర్డాక్ లచే రూపొందించబడింది, ఇది మొదట్లో ఒక పెర్ల్ ప్రోగ్రాముగాను, తరువాత 1993లో ప్రధాన భాగం అంతా సి భాషలో ఇయాన్ జాక్సన్ చే మరలా వ్రాయబడింది. "డెబియన్ ప్యాకేజీ" కి సంక్షిప్తనామమే డిపికెజి, కానీ ఈ పదబందమే గణనీయంగా పెరిగింది.

ఉదాహరణ

[మార్చు]

ఒక .deb ప్యాకేజీని స్థాపించుటకు ఈ ఆదేశాన్ని వినియోగించండి:

dpkg -i డెబ్ ఫైల్ పేరు 

ఇక్కడ డెబ్ ఫైల్ పేరు అనేది డెబియన్ సాఫ్టువేర్ ప్యాకేజీ పేరు.

స్థాపించబడిన ప్యాకేజీల జాబితాను ఇలా పొందవచ్చు:

dpkg -l [ఐచ్ఛిక క్రమం] 

స్థాపించబడిన ప్యాకేజీని తొలగించుటకు:

dpkg -r ప్యాకేజీపేరు 

అభివృద్ధి సాధనాలు

[మార్చు]

dpkg-dev లో డెబియన్ మూల ప్యాకేజీలను నిర్మించుటకు, విప్పుటకు, ఎక్కించుటకు అవసరమైన అభివృద్ధి పనిముట్ల శ్రేణి ఉంటుంది. అవి:

  • dpkg-source డెబియన్ ప్యాకేజీ యొక్క మూల దస్త్రాలనుు ప్యాక్, అన్ ప్యాక్ చేస్తుంది.
  • dpkg-gencontrol ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి సమాచారాన్ని చదువుతుంది, ఒక బైనరీ ప్యాకేజీ కంట్రోల్ ప్యాకేజీని ఉత్పత్తిచేస్తుంది, ఇందుకోసం డెబియన్/ఫైళ్లలో ఒక ప్రవేశాన్ని సృష్టిస్తుంది.
  • dpkg-shlibdeps లైబ్రరీ అనుగుణంగా నడుచుటకు అవసరమైన ఆధారితత్వాలను లెక్కిస్తుంది.
  • dpkg-genchanges ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి సమాచారాన్ని చదువుతుంది ఒకసారి నిర్మించబడిన తరువాత ఒక నియంత్రణా దస్త్రాన్ని సృష్టిస్తుంది (.changes).
  • dpkg-buildpackage అనేది ఒక కంట్రోల్ స్క్రిప్టు ఇది ప్యాకేజీని స్వయంచాలకంగా నిర్మించుటకు ఉపయోగపడుతుంది.
  • dpkg-distaddfile డెబియన్/ఫైళ్లకు ఒక ఫైలుని ఇన్పుట్ గా జతచేస్తుంది.
  • dpkg-parsechangelog ప్యాక్ చేయని డెబియన్ ట్రీ సోర్సు నుండి మార్పుల దస్త్రాన్ని (మార్పుచిట్టా) చదువుతుంది, ఆ మార్పుల కోసం అవుట్​పుట్ సమాచారాన్ని తయారుచేస్తుంది.

బాహ్య లింకులు

[మార్చు]