Jump to content

సిరిపుల్ల

వికీపీడియా నుండి
(సిరిచాప నుండి దారిమార్పు చెందింది)
బజారులో సిరి చాపలను అమ్ముతున్న సిరిచాపల వర్తకుడు

సిరిపుల్ల గడ్డి జాతికి సంబంధించింది. ఇది వాగులలో పెరుగుతుంది. ఇది నీటిలో పెరిగే మొక్క. ఈ సిరిపుల్లతో తయారు చేసే చాపలను సిరి చాపలు అంటారు. ఇది సుమారు 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది.


సిరిచాపల కొరకు సిరిపుల్లను కొన్ని ప్రాంతాలలో పండిస్తారు. సిరిపుల్ల మూడు నెలల పంట. ఇది ఎత్తుగా ఏపుగా పెరగడానికి యూరియాని తగిన మోతాదులో చల్లుతారు. ఒకసారి కోయబడిన సిరిపుల్ల దగ్గర భూమిలోపల ఉన్న సిరి గడ్డ ద్వారా మళ్ళీ చిగురిస్తుంది.

సిరిచాప

[మార్చు]

సిరిచాపను ఎక్కువగా నాలుగు అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవుతో తయారు చేస్తారు. సిరిచాప ఒకటి నుంచి మూడు సంవత్సరముల వరకు చెడి పోకుండా ఉంటుంది. సిరిచాప చల్లగా, మెత్తగా ఉంటుంది.

మామూలుగా పెన్ను మందం గల దీనిని సన్నగా నాలుగు వైపులా చీల్చి రీఫిల్ మందంలో ఉండే నాలుగు పక్షాలు గల పుల్లను తయారు చేసి దానిని ఉడకబెట్టి రంగులు వేసి చాపను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

సిరిపుల్లను చీల్చడానికి ఉపయోగించే ఆయుధాన్ని అంబు అంటారు.

బుట్టలు

[మార్చు]

సిరిపుల్లతో రకరకాల బుట్టలను తయారు చేస్తారు. ప్రస్తుతం ఈ అల్లేవారు తక్కువగా కనిపిస్తున్నారు.

నులక

[మార్చు]

సిరిపుల్లతో మంచాలకు అల్లే నులకను తయారు చేస్తారు. సిరిపుల్లను నార లాగా తయారు చేసి పేడిన నులక చల్లగా, మెత్తగా, గట్టగా ఉండుట వలన దీనిని మంచాలకు ఉపయోగిస్తారు.


నమ్మకం

[మార్చు]

సిరిచాప ఇంటిలో ఉంటే సిరి సంపదలు వెల్లి విరుస్తాయని పెద్దల నమ్మకం.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]