సహాయం:మూస గురించి క్లుప్తంగా
ఇది మూసల గురించిన స్థూల వివరణ. పూర్తి వివరాలు సహాయము:మూస లో చూడవచ్చు.
మూస అంటే మూస నేంస్పేసులో ఉండే పేజీలు. అంటే [[మూస:మూసపేరు]] లాగా "మూస:" తో మొదలయ్యే ప్రతీ పేజీ కూడా మూస అన్నమాట. మూస లోని విషయాన్ని ఏ పేజీలోనైనా పెట్టవచ్చు. అలా పెట్టేందుకు గమ్యం పేజీలో ఇలా రాయాలి: {{మూసపేరు}}.
ఒకే విశేషాన్ని అనేక పేజీల్లో రాయాలంటే మూసలను వాడుతాము. అలాగే బాయిలరుప్లేటు సందేశాలు, అనేక సంబంధిత పేజీల మధ్య ప్రయాణం మొదలైన వాటి కోసం మూసలను వాడుతాము. మూసలకు పరామితులు (parameters) కూడా ఇవ్వవచ్చు. ఈ విధంగా ఒకే మూసను వివిధ పేజీల్లో వాడి, ఆయా పేజీలకు తగినట్లుగా టెక్స్టును చూపించవచ్చు.
మూసల సృష్టి, దిద్దుబాటు
[మార్చు]ఏదైనా పేజీని ఎలా సృష్టిస్తారో మూసనూ అలాగే సృష్టించాలి. ఒకటే తేడా ఏంటంటే, పేరు మూస: తో మొదలవ్వాలి.
మూస తయారయ్యాక, ఇక దాన్ని వాడదలచిన పేజీల్లో {{మూసపేరు}} అని రాస్తే సరిపోతుంది. దాన్ని వాడిన ప్రతి పేజీలోను ఎప్పుడూ అదే టెక్స్టు కనిపిస్తుంది. మూసను మార్చినపుడు, మూసను వాడిన అన్ని పేజీల్లో కూడా టెక్స్టు మారిపోతుంది.
అలా కాకుండా, మూసను చేర్చే గమ్యం పేజీలో {{subst:మూసపేరు}} అని కూడా రాయవచ్చు. అలా రాసినపుడు, మూస పేజీలో ఉన్న టెక్స్టును మొదటిసారి తెచ్చుకుని గమ్యం పేజీలో పెట్టేస్తుంది. ఆ తర్వాత మూసను మార్చినప్పటికీ అప్పటికే ఆ మూసను subst: అని వాడిన పేజీల్లోని టెక్స్టు మారిపోదు. కొన్ని సందర్భాల్లో మనకలాంటి సౌకర్యం కావాలి కూడా..
మీరు దిద్దుబాటు చెయ్యాలనుకున్న మూస {{ఫలానా}} అనుకోండి, దానిలో దిద్దుబాటు చేసేందుకు మూస:ఫలానా అనే లింకుకు వెళ్తారు. ఆ పేజీకి వెళ్ళేందుకు మామూలుగానే అన్వేషణ పెట్టెలో రాసి వెతకొచ్చు, లేదా ప్రయోగశాల లో ఆ లింకు రాసి దాన్ని నొక్కి వెళ్ళొచ్చు.
ఆ పేజీకి వెళ్ళాక ఇతర పేజీల్లో దిద్దుబాటు చేసినట్టుగానే, అక్కడ కూడా దిద్దుబాటు చెయ్యండి. కాకపోతే మీరు చేసే మార్పులు అనేక పేజీల్లో చోటుచేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
తరచూ అడిగే ప్రశ్నలు
[మార్చు]- ఓ మూసను ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టుల్లో వాడొచ్చా?
- లేదు, ఏ ప్రాజెక్టు మూసలు ఆ ప్రాజెక్టులో ప్రత్యేకంగా సృష్టించుకోవాలి.
- మూసలో పారామితులను (parameters) చేర్చవచ్చా?
- చేర్చవచ్చు. వివరాలకు సహాయము:మూస చూడండి.
- పేజీలో ఎన్ని మూసలను వాడవచ్చు?
- మీకిష్టమొచ్చినన్నిటిని వాడవచ్చు.
- నేను మూసను మార్చాను, కానీ దాన్ని వాడిన పేజీలో ఆ మార్పు కనబడలేదేంటి?
- కాషెతో కొన్ని ఇబ్బందులున్నాయి. దీనికో పద్ధతుంది: ఏ పేజీలో అయితే మూసలో చేసిన మార్పు కనబడలేదో ఆ పేజీ యొక్క మార్పు లింకును నొక్కండి. ఏ మార్పూ చెయ్యకుండానే భద్రపరచండి. అంటే ఓ డమ్మీ దిద్దుబాటు చేసారన్నమాట. అప్పుడు మార్పులు కనిపిస్తాయి. మరో మార్గం.. Ctrl, F5 కీలను కలిపి నొక్కడం..
- మూసను కొత్త పేరుకు తరలించవచ్చా?
- వచ్చు. మామూలు పేజీలను తరలించినట్టే ఇది కూడా.
- మూసలో మరో మూసను వాడవచ్చా?
- మూసలో మరో మూసను వాడవచ్చు. కానీ మూస ట్యాగులో మరో మూస ట్యాగును వాడరాదు.
- కొత్త మూసను ఎట్లా సృష్టించాలి?
- కొత్త పేజీని ఎలా సృష్టిస్తారో ఇదీ అంతే. తేడా అల్లా, మూస పేజీ పేరు "మూస:" తో మొదలవ్వాలి.
ఉదాహరణలు
[మార్చు]- మూస:అనువాదము: అనువాదం మూస
- మూస:మొలక: మొలక మూస