శ్రీ చైతన్య విద్యాసంస్థలు

వికీపీడియా నుండి
(శ్రీ చైతన్య నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శ్రీ చైతన్య విద్యాసంస్థలు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ విద్యాసంస్థలు. ఇది 1986లో విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల స్థాపనతో ప్రారంభించింది. ఈ సంస్థ స్థాపకులు, మార్గనిర్దేశకులు అయిన డాక్టర్ బి.యస్.రావు గారు, డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు వైద్య వృత్తిలో బాగా రాణించి ఇంటర్మీడియట్ విద్య కొరకు ఒక కొంగ్రొత్త ఒరవడిమీద దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. వీరు ప్రవేశపెట్టిన ప్రణాళికా బద్ధమైన విధానం ఆంధ్రప్రదేశ్ విద్యా ముఖచిత్రాన్నే మార్చివేసింది. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలోని ప్రీయూనివర్సిటీ స్థాయి విద్యలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది.

56మంది విద్యార్థులతో తొలి బ్రాంచ్

[మార్చు]

డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు (బి.యస్.రావు) శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో విజయవాడలో 1986లో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ఆరంభమైంది. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ నేడు 300 బ్రాంచ్‌లతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఆయనకు ఈ సంస్థను ఏర్పాటుచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే.. డాక్టర్ సత్యనారాయణ ఇరాన్ నుంచి ఇండియాకు వచ్చి తన కుమార్తెల (సీమ, సుష్మ) ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతికారు. సరైన కాలేజీ ఒక్కటి కూడా కనిపించలేదు. అలాంటి నిరీక్షణ నుంచే ఆయన ఈ విద్యాసంస్థను ఏర్పాటుచేయటం జరిగింది.

ఇంటర్ నుంచి పునాది..

[మార్చు]

ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటం అనేది శ్రీ చైతన్య విద్యాసంస్థల తన ప్రత్యేకతగా నిలుపుకుంది. పదవ తరగతిలో మంచి మార్కులు స్కోర్ చేసిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుంచి చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యావ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. పదవ తరగతి నుంచి ఇంటర్‌కు వెళ్లటం అనేది విద్యార్థి దశలో కీలక మలుపు. అందుకే ఈ మలుపునే ఆయన వ్యాపార విస్తరణకు అవకాశంగా మలుచుకున్నారు. విద్యార్థులు వెనుకబడినట్లయితే వారిని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

సరిహద్దులు దాటి విస్తరణ

[మార్చు]

శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ సరిహద్దులు దాటి విస్తరించటం అనేది 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలలో దీని బ్రాంచ్‌లు ఏర్పడ్డాయి. 2006 నుంచి ఐఐటి-జెఇఇ, ఎఐఇఇఇ, పిఎంటి కోచింగ్ సెంటర్లు హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు.

మూలాలు

[మార్చు]