Jump to content

కేశవ శంకర్ పిళ్ళై

వికీపీడియా నుండి
(శంకర్ పిళ్ళై నుండి దారిమార్పు చెందింది)
కె.శంకర్ పిళ్ళై
4.38 KB (4,495 bytes)
జననం(1902-07-31)1902 జూలై 31
కాయంకులం, కేరళ
మరణం1989 డిసెంబరు 26(1989-12-26) (వయసు 87)
విద్యాసంస్థయూనివర్శిటీ సైన్స్ కళాశాల, త్రివేండ్రం
వృత్తికార్టూనిస్టు, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1932–1986
సుపరిచితుడు/
సుపరిచితురాలు
శంకర్స్ వీక్లీ
చిల్డ్చన్ బుక్ ట్రస్టు
శంకర్ ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం
పురస్కారాలుపద్మవిభూషణ(1976)

కేశవ శంకర్ పిళ్ళై (మళయాళం: കെ. ശങ്കര്‍ പിള്ള) (1902 జూలై 31 – 1989 డిసెంబరు 26), భారతీయ కార్టూనిష్టు. ఆయన "శంకర్"గా సుపరిచితులు.[1] ఆయన 1948 లో "శంకర్ వీక్లీ", "పంచ్ (పత్రిక) ను స్థాపించారు. ఆయన సృష్టించిన వారపత్రిక అబూ అబ్రహం, రంగ, కుట్తీ వంటి కార్టూనిస్టులను సృష్టించింది. ఆయన జూన్ 25 1975న ఎమర్జెన్సీ కాలంలో పత్రికను ఆపివేసారు. అప్పటి నుండి ఆయన బాలలకు హాస్యాన్నందిస్తూ జీవితాన్ని ఆనందంగా గడిపారు.

ఆయనకు 1976లో పద్మవిభూషణ (భారత ప్రభుత్వ రెండవ అత్యున్నత పురస్కారం) లభించింది.[2] ఆయన 1857లో చిల్డ్రన్స్ బుక్ ట్రస్టును, 1965లో శంకర్ ఇంటర్నేషనల్ డాల్స్ మ్యూజియం స్థాపించి గుర్తింపు పొందారు.

ప్రారంభ జీవితం - విద్య

[మార్చు]

శంకర్ 1902 లో కేరళ లోని కాయంకుళంలో జన్మించారు. ఆయన ప్రారంభ విద్యను కాయంకుళం మైర్యు మాలెలిక్కర ప్రాంతాలలో చేసారు. ఆయన వేసిన మొదటి కార్టూన్ పాఠశాలలో ఉపాధ్యాయుడు నిద్రిస్తున్న భంగిమలో కలది. ఆ చిత్రాన్ని ఆ తరగతి గదిలోనే వేసారు. ఆ సంఘటన ప్రధానోపాధ్యాయుని ఆగ్రహానికి గురిచేసింది. కానీ ఆయన పినతండ్రి ప్రోత్సాహం మేరకు ప్రసిద్ధ కార్టూనిస్టుగా ఎదిగారు [3] పాఠశాల విద్య అనంతరం "మావెలికర"లో రవివర్మ స్కూల్ ఆఫ్ పెయింటింగ్స్ లో చదివారు.

ఆయన నాటకాలు, స్కౌట్స్, రచనా వ్యాసంగాలలో పాల్గొనడానికి ఇష్టపడేవారు. ఆయన వరద బాధితుల కోసం విరాళాల సేకరణ కూడా చేసారు. ఆయన చిత్రాలు పేద ప్రజల జీవన చిత్రాలను ప్రతిబించేటట్లు ఉండేవి.

పట్టభద్రుడైన తరువాత ఆయన 1927 లో త్రివేండ్రం లోని మహారాజా కాలేజి ఆఫ్ సైన్స్ (ప్రస్తుతం యూనివర్శిటీ కళాశాల) లో చేరారు. ఆయన ఉన్నత విద్యకోసం ముంబై విడిచి వెళ్ళి న్యాయ కళాశాలలో చేరారు. కానీ న్యాయశాస్త్ర విద్యను మధ్యంతరంగా విడిచిపెట్టారు.

ఆయన చదువుకునే రోజుల్లోనే కార్టూన్లు వేసేవాడు. తన కార్టూన్లతో గాంధీ, జిన్నా, నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలగు ఎందరో నాయకుల వ్యంగ్య చిత్రాలు గీసి వారి చేత 'సెహబాష్‌ శంకర్‌' అనిపించుకున్న అద్భుత ప్రజ్ఞాశాలి ఆయన. శంకర్‌ ఎందరో నాయకుల తప్పులను వ్యంగ్య చిత్రాలుగా గీసి వారి తప్పును బయటపెట్టాడు. 1948 లో శంకర్స్‌ వీక్లిని ప్రారంభించి తన విజయకేతన మెగుర వేశాడు. అప్పట్లో 'శంకర్స్‌ వీక్లి' ప్రపంచ ప్రసిద్ధి పొందింది. ఒకవైపు పెద్దల అభిమానాన్ని పొందుతూనే మరోవైపు తన కిష్టమైన పిల్లల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. పిల్లలకోసం అతడు 1965లో దేశ విదేశాల నుండి బొమ్మలను సేకరించి ఢిల్లీలో ఒక డాల్స్‌ మ్యూజియం ఏర్పాటు చేశాడు. ఈ మ్యూజియంలో దేశ దేశాలకు చెందిన దాదాపు అయిదువేల బొమ్మలు మనకు కనువిందు చేస్తాయి. అలాగే బాలల కోసం బాలల పుస్తకసంస్థ (సిబిటి), చిల్డ్రన్స్‌ వరల్డ్‌ అనే పిల్లల గ్రంథాలయాన్ని నెహ్రూ నివాసంలో ఈయన నెలకొల్పారు.

1931లో హిందూస్తాన్ టైమ్స్ లో ప్రతి దినం కార్టూన్లేయడం ప్రారంభించారు.అతని కార్టూన్లు ప్రతి చోటా చర్చనీయాంశంగా వుండేవి. సాధారణంగా కార్టూనిస్ట్ కార్టున్ చూసి ఎడిటర్ అనుమతి పొందాకే ప్రచురించ బడుతుంది.కాని, శంకర్ విషయంలో ఆ నియమం ఉండేది కాదట. 1941 హిందూస్తాన్ టైమ్స్ లో శంకర్ అప్పటి భారత దేశ వైస్రాయి లార్డ్ విన్త్ గో కాళికాదేవిలా పుర్రెలు మెళ్ళోవేసుకొని శ్మశానంలో కరాళ నృత్యం చేస్తున్నట్లు బొమ్మ వేసారు. ఉదయాన్నే ఆ బొమ్మ చూసిన ఎడిటర్ బ్రిటిష్ ప్రభుత్వం తన పత్రికను నిషేధించడం తప్పదనుకున్నాడట. అనుకున్నట్లుగానే వైస్రాయి ఆఫీసు నుంచి మీ కార్టూనిస్ట్ ను మా ఆఫీస్ కు పంపించండి అంటూ ఫోనొచ్చింది. భయపడూతూ శంకర్ వైస్రాయి గదిలోకి అడుగుపెట్టాడు. వైస్రాయి లార్డ్ విన్త్ గో తన సీటులోంచి లేఛి కరచాలనంచేసి "నీ కార్టూన్ అద్భుతంగా వుంది. కీప్ ఇట్ అప్. ఆ కార్టూన్ ఒరిజినల్ నాకివ్వగలవా? దాచుకొంటాను" అన్నాడట. అలా తన కార్టూన్లను భారతీయ నాయకుల్లో అభిమానించినది, గాంధీ, నెహ్రూలని శంకర్ అనేవారు. 1948 లో "శంకర్స్ వీక్లీ"ని ప్రారంభించి నప్పుడు నెహ్రూ "నా మీద కూడా నువ్వు కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా" అని నెహ్రూ కోరారు.

కెరీర్

[మార్చు]

ఆయన కార్టూన్లు "ద ఫ్రీ ప్రెస్ జర్నల్", "బాంబే క్రానికల్" లలో ప్రచురితమయ్యాయి. 1932లో "ద హిందూస్థాన్ టైమ్స్" పత్రిక సంపాదకుడు పోథన్ జోసెఫ్ ఈయనను ధిల్లీకి తీసుకొనివచ్చి స్టాప్ కార్టూనిస్టును చేసారు. ఆయన 1946 వరకు స్టాఫ్ కార్టూనిస్టుగానే ఉన్నారు. తరువాత ఆయన కుటుంబం న్యూఢిల్లీలో స్థిరపడింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన భార్యపేరు తంకం. ఆయనకు ఇద్దరుకుమారులు, ముగ్గురు కుమార్తెలు. భారత ప్రభుత్వం 1991లో ఆయనపై రెండు తపాలా బిళ్లలు విడుదలచేసింది. ఆయన కేరళ లలితకళా అకాడమీలో సభ్యులు. ఆయన స్వీయ చరిత్రను "లైఫ్ విత్ మై గ్రాండ్ ఫాదర్" అనే పేరుతో 1965లో ప్రచురించారు.

అవార్డులు

[మార్చు]

గ్రంథపట్టిక

[మార్చు]
  • Shankar (1937), 101 Cartoons from the Hindustan Times. Dehli: Printed at the Hindustan Times Press. One hundred and one cartoons from the Hindustan Times; With a foreword by Jawaharlal Nehru.
  • Shankar (1965), Life with grandfather. New Delhi, Children's Book Trust. Written and illustrated by Shankar: An orphan Indian boy being raised by his grandparents tells stories about his life.
  • Shankar (1983), Don't spare me Shankar: Jawaharlal Nehru. New Delhi: Children's Book Trust. Reproduction of 400 selected cartoons from the Shankar's weekly, 20 June 1948 – 17 May 1964.
  • Khanduri. 2014. Caricaturing Culture in India: Cartoons and History of the Modern World. Cambridge: Cambridge University Press. http://www.cambridge.org/us/academic/authors/246935

ఇతర పఠనాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Khorana, Meena (1991). The Indian subcontinent in literature for children and young adults. Greenwood Publishing Group. ISBN 0-313-25489-3.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-09-28. Retrieved 2018-07-09.
  3. "Fifty and counting". Retrieved 2018-07-09.
  4. Padma Bhushan Awardees

ఇతర లింకులు

[మార్చు]