Jump to content

వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా

వికీపీడియా నుండి
(వికీపీడియా:Talk page guidelines నుండి దారిమార్పు చెందింది)

ఈ వ్యాసం సహాయం పేజీల లోని ఒక భాగం.

వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని చర్చ పేజీ అంటారు. వ్యాసపు చర్చ పేజీని చూడటానికి చర్చ అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చ పేజీలో నుండి గురించి లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.

వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు— అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక నేంస్పేసు నే ప్రత్యేకించాం. చర్చ పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం ఒక మంచి వికీ సాంప్రదాయం.

చర్చ పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు చర్చ పేజీ మార్గదర్శకాలు చూడండి. ఇంకా చర్చ పేజీని ఎలా సంగ్రహించాలి మరియు వికీపీడియా:Refactoring talk pages కూడా చూడండి.

చర్చ సంబందిత వ్యాసానికి అంతర్గతంగా సంబంధం లేనప్పుడు, చర్చ కోసం ఇమెయిల్ లేదా వినియోగదారు పేజీని ఉపయోగించడానికి ప్రయత్నించండి.

అసలు ఎందుకది?

[మార్చు]

గమనిక: వికీపీడియా:వివాద పరిష్కారం లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చ పేజీలు వాడాలని సూచన ఉన్నది.

చర్చ పేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, దానికి సంబంధించిన వ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, పాఠ్యాల మార్పుపై వాదాలు, వ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజీలో చెయ్యవచ్చు.

సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని వికీజీవులు వ్యతిరేకిస్తారు. వికీపీడియా సబ్బు పెట్టేం కాదు, అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, వ్యాసం గురించి చర్చించు, వ్యాస విషయం గురించి కాదు. వికీపీడియా మరో H2G2నో లేక Everything2నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: వికీ సాంప్రదాయం

ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చ పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత అనేది ఉందన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.

ఏదో ఆశించి, వాడుకరుల పేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు - కూడదు.

"విషయాన్ని చేర్చు" అంశం

[మార్చు]

"విషయాన్ని చేర్చు" అనే లింకును నొక్కడం ద్వారా చర్చ పేజీలో రాయవచ్చు. కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.

  • ఏదైనా చర్చకు సమాధానం రాయదలిస్తే సదరు చర్చను దిద్దుబాటు చెయ్యండి.

చర్చ పేజీ నమూనా

[మార్చు]

కూరెలా ఉంది? --[[పి.భీముడు]]
:అదిరింది!! --[[పి.ద్రౌపది]]
:పర్లేదు.. --[[పి.ధర్మరాజు]]
::నేనే వండాను! --[[పి.భీముడు]]
ఈ కూర చర్చను [[చర్చఃకూర]] కు తరలించాలని నా అభిప్రాయం.. --[[పి.అర్జునుడు]]
:అక్కర్లేదనుకుంటా --[[పి.నకులుడు]]
:ఇంతకీ అసలు ఏ కూర వండారో చెప్పనేలేదు --[[పి.సహదేవుడు]]

పై విధంగా రాస్తే ఇలా కనిపిస్తుంది:

కూరెలా ఉంది? --పి.భీముడు

అదిరింది!! --పి.ద్రౌపది
పర్లేదు.. --పి.ధర్మరాజు
నేనే వండాను! --పి.భీముడు

ఈ కూర చర్చను చర్చఃకూర కు తరలించాలని నా అభిప్రాయం.. --పి.అర్జునుడు

అక్కర్లేదనుకుంటా --పి.నకులుడు
ఇంతకీ అసలు ఏ కూర వండారో చెప్పనేలేదు --పి.సహదేవుడు

పై చర్చ ద్వారా చర్చ పేజీ అమరిక ఏ పధ్ధతిలో ఉండాలనేది సూచిస్తున్నాం గానీ ఎటువంటి వ్యాఖ్యలు రాయాలనేది కాదు.

వాడుకరుల చర్చ పేజీలు

[మార్చు]

మీ వాడుకరి పేజీకి కూడా ఒక చర్చ పేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. మొదటగా, పేజీల పైన ఉండే శీర్షంలో దీనికి లింకు ఉంటుంది. ఇతరులు మీ చర్చ పేజీలో సందేశం రాస్తే, మీకు కొత్త సందేశాలు ఉన్నాయి అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ పేజీ అందరికీ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు గోప్యంగా సంప్రదించదలిస్తే, ఈ-మెయిల్‌ వాడండి (వాడుకరులకు ఈ-మెయిల్‌ చూడండి).

ఇతర వాడుకరుల చర్చ పేజీలో సందేశం రాయదలిస్తే ఆ వాడుకరి పేజీలోని చర్చ లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న వాడుకరి పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చ పేజీకి వెళ్ళవచ్చు.

నా చర్చ పేజీలో నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చా?

[మార్చు]

ఎక్కువ మంది తమ వాడుకరి చర్చ పేజీని ఇతర చర్చ పేజీల వలెనే చూస్తారు - పాతవాటిని జాగ్రత్త చెయ్యడం మొదలైనవి చేస్తారు. మరి కొందరు చర్చ ముగిసిన తరువాత తీసివేస్తారు.

అయితే, సందేశాలకు సమాధానాలివ్వకుండానే వాటిని తొలగించరాదు. దీనిని అమర్యాదగా భావించి, దాని వలన ఘర్షణలు తలెత్తి, మధ్యవర్తుల వరకూ వెళ్ళిన సందర్భాలు ఇంగ్లీషు వికీలో ఉన్నాయి. మీ వాడుకరి చర్చ పేజీ నుండి వేరే పేజీకి దారి మార్పు చెయ్యడం కూడా (సరదాగా చేసినా, ఎగతాళిగా చేసినా సరే) ఇటువంటి చర్య గానే భావిస్తారు.

మీ వాడుకరి చర్చ పేజీని అలంకరించు కోవాలనుందా..? ఆలస్యమెందుకు, కానివ్వండి. కాకపోతే, ఒక్క విషయం గుర్తుంచుకోండి - మీ చర్చ పేజీలో ఇతర వాడుకరులు సందేశం రాయాలనుకుంటే అలంకరణల కారణంగా వారికి ఇబ్బంది కలగకూడదు. అలా జరిగితే వాళ్ళు బాధ పడవచ్చు.

సంభాషణా క్రమాన్ని సులభంగా అనుసరించడం ఎలా

[మార్చు]

ఒకే చర్చకు సంబంధించిన సందేశాలను వివిధ వాడుకరుల చర్చ పేజీలలో రాస్తూ పోతూ ఉంటే, ఆ చర్చను అనుసరించడం కష్టమవుతుంది. ఈ సమస్యను అధిగమించే రెండు మార్గాలు ఇవిగో:

  • మీరు సమాధానమిస్తున్న చర్చ లోని భాగాన్ని కాపీ చేసి రెండో వాడుకరి చర్చ పేజీలో పేస్టు చేసి, దాని కిందే మీ సమాధానం రాయండి. మీ సమాధానాన్ని మామూలుగానే ఇండెంటు చెయ్యండి.

లేదా:

  • మీ వాడుకరి చర్చ పేజీలో సమాధానం రాస్తానని సందేశం పెట్టండి. ఇతరులు మొదలు పెట్టే సంభాషణలకు ఇలా చెయ్యండి.
  • సంభాషణ మీరు మొదలు పెట్టేటపుడు, ఇతరుల చర్చ పేజీలో రాసి, వాళ్ళు అక్కడే సమాధానం ఇవ్వవచ్చని చెప్పండి.

చర్చ పేజీలను భద్రపరిచే విధానం

[మార్చు]

అప్పుడప్పుడూ వికీపీడియాలో చర్చ పేజీలు చాలా పెద్దవయిపోతుంటాయి. అలాంటప్పుడు చర్చ పేజీలలోని పాత వివరాలను ఇంకొక అనుబంధ పేజీలో భద్రపరుస్తూ ఉంటారు. ఇలా భద్రపరచటానికి సాధారణంగా కింద వివరించిన పద్దతిని ఉపయోగిస్తారు.

ఇలా కొత్తగా సృష్టిస్తున్న పాత చర్చ పేజీలకు పేర్లను జాగ్రత్తగా పెట్టాలి. వాటి పేర్లు తయారు చేయడానికి, మొదట వ్యాసపు చర్చ పేజీ పేరుని తీసుకుని దానికి "/పాత చర్చ #"ను కలపండి, # అనేది పాత చర్చ పేజీ సంఖ్య. ఉదాహరణకు:

  • చర్చ:భారతదేశం యొక్క 20వ పాత చర్చ పేజీకి "చర్చ:భారతదేశం/పాత చర్చ 20" అని నామకరణం చెయ్యాలి.
  • "వాడుకరి చర్చ:సభ్యుడు" యొక్క మొదటి పాత చర్చ పేజీకి "వాడుకరి చర్చ:సభ్యుడు/పాత చర్చ 1" అనే పేరు వస్తుంది.

అంతేకాదు చర్చ పేజీలను భద్రపరిచేటప్పుడు వాటి నేముస్పేసు సరయినదేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కోలన్ (:) గుర్తు ముందు ఉన్న పదాన్ని గమనించండి. మీ సొంత చర్చ పేజీలు "వాడుకరి చర్చ" తో మొదలవుతాయి, "చర్చ"తో కాదు.

అలా పేజీలకు పేరును తయారు చేసేసిన తరువాత, అసలు చర్చ పేజీలో ఉన్న సమాచారాన్నంతటిని ఆ పేజీ నుంచి తొలగించి కొత్తగా సృష్టించిన పేజీలో చేర్చి రెండు పేజీలను భద్రపరచాలి. పాత చర్చల పేజీలలో {{పాత చర్చల పెట్టె|auto=yes}} అని వ్రాయండి. దీనితో ఆ పేజీ నుండి, పాత చర్చ పేజీలకు లింకులు ఏర్పడతాయి.

చర్చ పేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు

[మార్చు]

వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి మీ వ్యాఖ్యలో ఆయా వాడుకరుల పేజీలను [[వాడుకరి:వాడుకరిపేరు]] - ఇలా ఉటంకిస్తే, వారికి ఎకో వ్యవస్థ ద్వారా సందేశం వెళ్తుంది. వాడుకరి చర్చ పేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే {{సహాయం కావాలి}} చేర్చితే ఆ పేజీ రచ్చబండలో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న వాడుకరుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. ఉదాహరణ.

ఇంకా చూడండి

[మార్చు]