వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగస్టు 29
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/ఆగష్టు 29 నుండి దారిమార్పు చెందింది)
- తెలుగు భాషా దినోత్సవము
- జాతీయ క్రీడా దినోత్సవం
- అంతర్జాతీయ అణుపరీక్షల వ్యతిరేక దినోత్సవం
- 1604 : మొఘల్ చక్రవర్తి హుమాయూన్ భార్యలలో ఒకరు, చక్రవర్తి అక్బర్ తల్లి హమీదా బాను బేగం మరణం (జ.1527).
- 1863 : తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జననం (మ.1940).(చిత్రంలో)
- 1905 : భారత క్రీడా మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జననం (మ.1979).(చిత్రంలో)
- 1923 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు హీరాలాల్ గైక్వాడ్ జననం (మ.2003).
- 1928 : పాతతరం తెలుగు చలనచిత్ర నటి, నేపథ్యగాయని రావు బాలసరస్వతీ దేవి జననం.
- 1958 : అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత కళాకారుడు మైకల్ జాక్సన్ జననం (మ.2009).
- 1976 : బెంగాలీ కవి, సంగీతకారుడు, విప్లవకారుడు ఖాజీ నజ్రుల్ ఇస్లాం మరణం (జ.1899).
- 2018 : తెలుగు దేశం పొలిట్ బ్యూరో సభ్యుడు, నటుడు, నిర్మాత, తెలుగుదేశం చైతన్య రధసారధి నందమూరి హరికృష్ణ మరణం (జ.1956 ).