Jump to content

వారాలబ్బాయి

వికీపీడియా నుండి
వారాలబ్బాయి
దర్శకత్వంరాజాచంద్ర
తారాగణంమురళీమోహన్,
మాధవి,
జానకి
సంగీతంచక్రవర్తి
విడుదల తేదీ
డిసెంబరు 5, 1981 (1981-12-05)
భాషతెలుగు

వారాలబ్బాయి 1981 డిసెంబరు 5న విడుదలైన తెలుగు సినిమా. జయభేరి ఆర్ట్ మూవీస్ పతాకం కింద మాగంటి వెంకటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజాచంద్ర దర్శకత్వం వహించాడు. మురళీ మోహన్, మాధవి, జానకి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రం మురళీమోహన్ నూరవ సినిమా. తన చెల్లెలికి అన్యాయం చేసిన వాళ్ళ ఊరికి వెళ్ళ, వాళ్ళ ఇంట్లోనే వారాలబ్బాయిగా చేరి, వాళ్ళకు తల్లో నాలుకలా తయారై, తన చెల్లెలి కాపురాన్ని చక్కదిద్దుకోవడం ఈ చిత్ర కథాంశం.

తారాగణం

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

మురళీ మోహన్ స్వంత నిర్మాణ సంస్థయైన జయభేరి పిక్చర్స్ నిర్మించిన మొదటి సినిమా ఇది. నిజానికి జయభేరి పిక్చర్స్ ను మొదటగా నటుడు గిరిబాబు ప్రారంభించాడు. అయితే మురళీమోహన్ అభ్యర్థన మేరకు ఆయనకు ఇచ్చేశాడు. ఈ పేరు మురళీమోహన్ కు బాగా కలిసి వచ్చింది. దర్శకుడు రాజాచంద్ర దాసరి నారాయణరావు శిష్యుడు.

సాంకేతిక సహకారం

[మార్చు]
  • కథ : వసుంధర
  • పాటలు : జాలాది
  • నేపధ్యగానం: సుశీల, బాలసుబ్రహ్మణం
  • కళ: రంగారావు
  • స్టిల్స్:మోహన్ జీ, జగన్ జీ
  • కూర్పు: డి.రాజగోపాల్
  • సంగీతం: చక్రవర్తి
  • నిర్మాత: మాగంటి వెంకటేశ్వరరావు
  • మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజాచంద్ర

పాటల జాబితా

[మార్చు]

ఈ చిత్రానికి కె.చక్రవర్తి సంగీతదర్శకత్వం వహించాడు. పాటలన్నీ జాలాది రాశాడు.[2]

  1. అర్ధరేతిరి వచ్చాడంట ఆకలేసి ఉన్నదంటా, రచన: జాలాది రాజారావు, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. కాకమ్మ కాకి కలవాళ్ళ కాకి లోకాన ఏకాకి, రచన: జాలాది, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. తాంబూలం వేశాడే మేనమామ వాడు, రచన: జాలాది, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. లటుకు చిటుకు లంక తోటలో అటుకు ఇటుకు, రచన: జాలాది, గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "Vaaralabbai (1981)". Indiancine.ma. Retrieved 2022-11-13.
  2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు.