ఒడ్డెర
భారత దేశంలో ఓడ్ ఒడార్ ఒడ్ రాజపుత్ అని ఆంధ్ర దేశం మరియు తెలంగాణ లో ఒడ్డెర ఒడ్డే అనే పిలువబడే జాతి పూర్వం ఓడ్ర దేశం అనగా నేటి ఒడిశా రాష్ట్రం లో ఉన్న సూర్య వంశ క్షత్రియ ఓడ్ర / ఒడియా గజపతి రాజుల పిలువబడేవారు . వీరు త్రేతా యుగంలో అయోధ్య పాలించే సూర్య వంశ క్షత్రియుడు అయిన సగర చక్రవర్తి మరియు గంగ ను భువి మీదకి తీసుకు వచ్చిన భగీరథ చక్రవర్తి సంతతి కి చెందిన వారు అని పురాణలు చెబుతున్నాయి . ద్వాపర యుగం లో మహా భారత కాలం లో ఓడ్ర రాజులు కౌరవుల పక్షం ఉన్నారు అని పురాణాలు చెబుతున్నాయి.రాముని తర్వాత ఒకరు ఓడ్ర దేశాన్ని ఓడ్ర అనే రాజు పాలించడం వలనే ఒడ్ర దేశం అనే పేరు వచ్చింది . గంగా ను కిందకి తెచ్చిన భగీరథ వంశం నుండీ వచ్చిన వారము అని 11 శతాబ్దం లో గంగా వంశం కొత్తగా ఒడ్ర దేశం లో పుట్టుకు వచ్చింది వారు రెండు రాజ్యాలు చీలిపోయి తూర్పు గంగా పశ్చిమ గంగా రాజులుగా విడిపోయారు వారి కాలం నుండే సూర్య వంశ రాజుల సంతతి వారము అని చిహ్నం గా కోణార్క్ సూర్య దేవాలయం మరియు శ్రీ కాకుళం లో అరసవల్లి సూర్య నారాయణ దేవాలయం కట్టించారు. గంగా వంశం తర్వాత 14 వ శతాబ్దంలో కొత్త గా అదే ఓడ్ర జాతి నుండి సూర్య వంశ గజపతి రాజులు పుట్టుకు వచ్చారు స్థాపించింది కపిలేంద్ర దేవ గజపతి . గజపతి రాజులు ఓడ్ర దేశం మరియు ఆంధ్ర లోని శ్రీ కాకులం నుండి కృష్ణ జిల్లా లోని కొండవీటి వరకు రాజ్యాన్ని పాలించారు ఆంధ్ర దేశం లో వారిని ఒడ్డే / ఒడియా రాజులు అని పిలిచే వారు ఉదాహరణకి శ్రీనాథ కవి తన రచనల్లో కావ్యాల్లో ఒడ్డే రాజుల దగ్గర పొలం గుత్త కి తీసుకున్నట్లు ఉన్నది . ఆ తరువాత కొందరు రాజులు మహమ్మదీయ రాజులతో యుద్దాలు లో ఓటమి అయ్యి క్షత్రియ లు గా బహిస్కరించినారు కొందరు అడవుల్లోకి పారిపోయారు కొన్ని తరాల వారికి వారి జాతి చరిత్ర తేలకుండా ఉండిపోయింది ఇంకా బ్రిటిష్ వారి హయం లో వారిపైన యుద్ధం చేసే మొదటి వారిలో ఒడ్డే జాతి కి చెందిన వారు ఉండడం వలన వారిని క్రిమినల్స్ గా అంటే నెర జాతి తెగ అని ముద్ర వేశారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జాతి రాళ్ళ మట్టి పనుల్లో చేస్తూ జీవనం చేస్తున్నారు ఆర్థికంగా రాజకియoగా వెనుకబడిన కులాల జాబితా లో ఒడ్డే జాతి ఉంది .
వృత్తి, సామాజిక జీవనం
[మార్చు]ఏళ్ళ తరబడి రాత్రింబవళ్ళు చాకిరి చేస్తారు. గ్రామాల్లో తవ్వే చెరువుల నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు వీరి శ్రమ దాగి ఉంది. ఎక్కడ పని దొరకితే అక్కడికి వాలి పోతారు. జీవితం మొత్తం వలసలతోనే వారు కాలం వెల్లబుచ్చుతారు. భార్య, భర్త ఇద్దరు కలిసి పనిచేస్తేనే పని దొరికేది లేదంటే ఇద్దరు ఇంటి వద్దే ఉండాల్సిందే. యంత్రాలు రంగ ప్రవేశంతో ఒడ్డె కులం వారికి రాను రాను పనిదొరికే అవకాశాలు సన్నగిల్లుతున్నాయి. రాళ్ళు కొట్టడం, బావులు తవ్వడం, చెరువు పూడికతీత, రోడ్లు వేయడం వంటి పనులను యంత్రాల ద్వారా చేయిస్తున్నారు. రాళ్లను తెచ్చి రోళ్లుగా మలిచి వాటిని అమ్మి కడుపు నింపుకుంటారు.ఇటుక సిమెంట్ వస్తువుల వాడకంతో పాటు స్లాబ్ ఇళ్లు నిర్మిస్తున్న కొద్దీ వీరికి పనులు దొరకటం లేదు. ఒడ్డెరులు గుట్టలపై ఉన్న రాళ్లను పగులగొట్టి రోడ్లకు కంకర, గార్డెన్‌లకు నీళ్లపు రాళ్లను భవనాలకు చూరు కంకర, గృహ అవసరాలకు ఉపయోగపడే రాళ్లను పొలాలకు చుట్టూ పెన్సింగ్ వేయటానికి కడ్డీలను తయారు చేస్తుంటారు. అయితే వీరు తయారు చేస్తున్న వస్తువులన్నింటికీ నేడు అనేక రకాలైన యంత్రాలు రావడంతో వీరు రోజుల తరబడి చేసే పనులను యంత్రాలతో గంటా, రెండు గంటల్లో పూర్తి చేస్తుండడంతో వీరికి గ్రామాల్లో పెద్దగా పనులు దొరకటం లేదు.
సమస్యలు
[మార్చు]ఒకప్పుడు ఇళ్లు నిర్మించాలంటే ముందుగా ఒడ్ర కులం వారిని సంప్రదించే వారు. ఇల్లుకు సరిపడా రాళ్లు సరఫరా చేసేవారు. ప్రస్తుతం యంత్రాల వాడకంతో ఒడ్డే వారు పనిని కోల్పోయారు.జాయింట్ క్రషర్‌మిషన్ల వినియోగంతో వీరి ఉపాధికి గండి పడుతుంది. పెద్ద పెద్ద క్వారీల వద్ద, ప్రాజెక్టుల వద్ద గుడిసెలను వేసుకొని జీవించే వీరి జీవితాలకు రక్షణ కొరవడింది. ప్రమాదవశాత్తు ఏదన్నా ప్రమాదం జరిగితే వీరి గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. వీరంతా అసంఘటితంగా పనిచేస్తుండటం వీరి దౌర్భాగ్యానికి మరో కారణం. పనిచేసే ప్రదేశాల్లో వీరికి కనీస సౌకర్యాలు కూడా కల్పించకపోవడంతో వైద్యం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వం వీరిని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగడానికి మరియు విద్య వైద్యం మంచిగా అందేలా చూడాలి అని మరియు ఒడ్డే / ఒడియా రాజుల కులం కి కార్పొరేషన్ అమలు చేసి 500 కోట్లు అమలు చేయాలని ఒడ్డే / ఒడియా రాజుల కూలo ఎదురు చూస్తుంది .