Jump to content

వజ్రాయుధం

వికీపీడియా నుండి
(వజ్రాయుధము నుండి దారిమార్పు చెందింది)
వజ్రాయుధాన్ని చేత ధరించిన ఇంద్రుడు (1820 ల నాటి చిత్రం)

హిందూ పురాణాలలో వజ్రాయుధం ఇంద్రుని ఆయుధం. ఈ వజ్రాయుధం నూరంచులు కలిగినది. ఈ ఆయుధంతో అనేక రాక్షసులను సంహరించాడు.

వజ్రాయుధం ఇతిహాసం

[మార్చు]

బృహస్పతి తన రాచ సభలో చేసిన అవమానం వలన, బృహస్పతి ఇంద్రుడిని విడిచి వెళ్తాడు. దాని వల్ల త్వష్ట ప్రజాపతి కుమారుడైన విశ్వరూపుడు అనే బ్రాహ్మణోత్తముడిని వేడుకొని గురువుగా పొందుతాడు. రాక్షసులని సంహరిస్తాడు. రాక్షసులకు మేనమామ అయిన విశ్వరూపుడు రాక్షసుల మాట మేరపు హవిస్సులను రాక్షసులకు ఇస్తాడు. దానితో కోపించి తన వద్ద ఉన్న చంద్రహాసంతో విశ్వరూపుడి తలలు నరికి సంహరిస్తాడు. దానితో బ్రహ్మహత్యపాతకం ప్రాప్తిస్తుంది. తన కుమారుడి సంహారం జరిగిందని తెలిసిన త్వష్ట ప్రజాపతి యజ్ఞాన్ని చేసి ఇంద్రుడిని సంహారించేందుకు ఒక రాక్షసుడిని సృష్టిస్తాడు. ఆ రాక్షసుడు వృత్రాసురుడు. వృత్రాసురుడు సర్వలోకాలను సంహరిస్తూ అల్లకల్లోలం చేస్తుండగా, ఇంద్రుడికి , దిక్పాలురులకు తోచక మహా విష్ణువుని సంప్రదిస్తారు. మహావిష్ణువు తరుణోపాయంగా దధీచి మహర్షి వద్దకు వెళ్ళి ఆయన వెన్నుముక కోరి, విశ్వకర్మచే ఆ వెన్నుముకతో నూరు అంచులు కల వజ్రాయుధం చేయించి వృతాసురుడి సంహారం చెయ్యమని చెబుతాడు. ఆ విధంగా దధీచి మహర్షి వెన్నుముకతో చేయబడిందే వజ్రాయుధం.

బయటి లింకులు

[మార్చు]

వృతాసురుడు వధ

మూలాలు

[మార్చు]