రారా క్రిష్ణయ్య
స్వరూపం
(రారా కృష్ణయ్య నుండి దారిమార్పు చెందింది)
రారా కృష్ణయ్య (1979 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | యోగి |
---|---|
నిర్మాణ సంస్థ | సుప్రభాత ఆర్ట్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
రా రా క్రిష్ణయ్య 1979 అక్టోబరు 6న విడుదలైన తెలుగు సినిమా. సుప్రభాత ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ కింద కె.సంబశివరావు, ఎ.బి.చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకు యోగి దర్శకత్వం వహించాడు. జె.వి. సోమయాజులు, వల్లూరి వెంకట్రామయ్య చౌదరి, మక్కపాటి కృష్ణమోహన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జె.వి. సోమయాజులు ( బాబూరావుగా)
- వల్లూరి వెంకట్రామయ్య చౌదరి,
- మక్కపాటి కృష్ణమోహన్
- బేబీ రాణి (కృష్ణయ్యగా)
- చంద్రమోహన్ (రామం గా)
- మాధవి (సితగా)
- నిర్మల (పాపాయమ్మగా)
- అనిత
- పొట్టి ప్రసాద్
- ఎం.పి.ప్రసాద్
- రామరాజు
- అంజిబాబు
- పి.ఎస్.మూర్తి
- సుంకరల లక్ష్మి
- పి.నరసింహారావు
- దేవదాసు కనకాల
- చక్రపాణి
- రాళ్లపల్లి
- కొంగర జగ్గయ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ,మాటలు, పాటలు: గోపి
- నేపథ్యం: లీల, సుశిల,జానకి, మాధవపెద్ది సత్యం,ఆనంద్, ఎల్.కృష్ణ, వంగల పట్టాబి భాగవతార్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి.శైలజ
- సంగీతం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం : సహాయకులు: గుణసింగ్ , నిత్యానంద్, చంద్రశేఖర్
- స్టిల్స్: రామలింగం
- నృత్యం:సుందరం
- ఫోటోగ్రఫీ: ఆర్.మధుసూదన్
- ఆపరేటివ్ కెమేరామన్: జె.పి.శెల్వం
- నిర్మాతలు: కొత్త సాంబశివరావు, అనుమాల బాలాజీ చంద్రశేఖర్
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: యోగి
పాటల జాబితా
[మార్చు]1.అరవైకి ఆవేళకి ఏమిటి అనుబంధం, రచన: మైలవరపు గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.ఆ వన్నెలు ఎక్కడివి తూర్పుకాంత మెనిలో, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ,పి సుశీల
3.చేత వెన్నముద్ద ఆనంద గొపాలకృష్ణా, రచన: గోపి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, జి.ఆనంద్,మాధవపెద్ది,సత్యం, పి.లీల బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Rara Krishnayya (1979)". Indiancine.ma. Retrieved 2021-04-01.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.