రాజమకుటం
స్వరూపం
(రాజ మకుటం నుండి దారిమార్పు చెందింది)
రాజమకుటం చిత్రం ,1960 ఫిబ్రవరి 24 విడుదలైన హాస్య, శృంగార, వీరరస ప్రధానమైన విశిష్ట జానపద చిత్రం. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డిదర్శకత్వంలో
నందమూరి తారకరామారావు,రాజసులోచన , జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
రాజమకుటం (1960 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి |
---|---|
నిర్మాణం | బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి |
రచన | డి.వి. నరసరాజు |
తారాగణం | నందమూరి తారక రామారావు, రాజసులోచన రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావు, కన్నాంబ, పద్మనాభం |
సంగీతం | మాస్టర్ వేణు |
సంభాషణలు | డి.వి. నరసరాజు |
నిర్మాణ సంస్థ | వాహినీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
సంక్షిప్త కథ
[మార్చు]కథలో ప్రతాప సింహుడు ( రామారావు) యువరాజు. మంత్రియైన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపి వేస్తాడు. దానిని యువరాజుకు తెలియనీయకుండా కొంత మంది అమాయకులను రాజహత్యా నేరం క్రింద మరణ శిక్ష విధించేటట్లు చేస్తాడు. ఆ చనిపోయిన వారిలో కథానాయిక ప్రమీల (రాజ సులోచన) అన్న కూడా ఉంటాడు. యువరాజు తన తల్లితో కలిసి దుర్మార్గుడైన మంత్రి ఆట కట్టించడం ఈ చిత్ర కథాంశం.
తారాగణం
[మార్చు]నందమూరి తారక రామారావు
రాజసులోచన
గుమ్మడి వెంకటేశ్వరరావు
పసుపులేటి కన్నాంబ
రాజనాల
పద్మనాభం .
పాటలు
[మార్చు]- అంజలిదే జననీ దేవీ ... కంజదళాక్షి కామతదాయిని - పి.లీల, రచన:నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
- ఊరేది పేరేది ఓ చందమామా నినుచూచి నిలికలువ - పి.లీల, ఘంటసాల -రచన: నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
- ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు - పి. లీల, రచన:కొసరాజు
- చూడచక్కని చుక్కలరేడు .. ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు (బిట్) - ఘంటసాల , రచన:కొసరాజు
- ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి - జిక్కి బృందం , రచన:కొసరాజు
- కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా - మల్లికార్జునరావు బృందం , రచన:కొసరాజు
- జయజయ మనోఙ్ఞమంగళ మూర్తి శారదనీరద నిర్మల కీర్తి - సుశీల
- జింగన టింగన ఢిల్లా కొంగన ముక్కున జెల్లా రంగు ఫిరాయించి - జిక్కి బృందం, రచన:నాగరాజు పేరుతో (బాలాంత్రపు రజనీకాంతరావు)
- రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా - మాధవపెద్ది బృందం , రచన:కొసరాజు
- సడిసేయకో గాలి సడిసేయబోకే బడలి ఒడిలో రాజు పవ్వళించేనే - (రచన: దేవులపల్లి కృష్ణ శాస్త్రి: పి.లీల
- హేయ్... తకిట తకిట ధిమి తబల - ఘంటసాల ( ఎన్.టి. రామారావు మాటలతో ) - రచన: కొసరాజు
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)