Jump to content

రాజా హరిశ్చంద్ర (సినిమా)

వికీపీడియా నుండి
(రాజా హరిశ్చంద్ర నుండి దారిమార్పు చెందింది)
రాజా హరిశ్చంద్ర
దర్శకత్వందాదాసాహెబ్ ఫాల్కె
రచనదాదాసాహెబ్ ఫాల్కె
రంచోడ్‌బాయి ఉదయ్‌రామ్(కథ)
నిర్మాతదాదాసాహెబ్ ఫాల్కె
ఫాల్కే సినిమా కొరకు
తారాగణండి.డి. డబ్కె
పి.జి. సానె
ఛాయాగ్రహణంత్ర్యంబక్ బి. తెలాంగ్
విడుదల తేదీ
1913 నాటి సినిమాలు
దేశంIndia బ్రిటీషు ఇండియా
భాషమూకీ సినిమా

రాజా హరిశ్చంద్ర (ఆంగ్లం :Raja Harishchandra) (హిందీ : राजा हरिश्चंद्र ), 1913 చెందిన ఒక హిందీ మూకీ సినిమా. దీని దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఇది భారతీయ పూర్తినిడివి గల మొదటి సినిమా.[1] రామాయణ మహాభారతాల్లో పేర్కొనబడిన రాజు హరిశ్చంద్రుడి గూర్చి ఈ సినిమా.

సత్యసంధుడైన హరిశ్చంద్రుడి చుట్టూ తిరిగే ఈ కథ, తన రాజ్యం, తన కుటుంబం పోగొట్టుకొని, విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడే తపన, యాతన వర్ణించే చిత్రం.

నిర్మాణం

[మార్చు]

ఫాల్కే, రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై నిర్మించిన సినిమా. ఇందులో పనిచేసినవాళ్ళంతా పురుషులే. స్త్రీపాత్రలకు కూడా పురుషులే పోషించారు. ఆ కాలంలో సినిమాలంటే చాలా తక్కువగా, ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం. స్త్రీలెవరూ ఈ సినిమాలో పని చేయడానికి రాలేదు.[2] ఈ సినిమా దాదాపు 40 నిముషాలపాటు నడిచే నిడివి గలది.[3]

2008 లో, 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' అనే సినిమా, రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాణానికి మూలం చేసుకుని నిర్మింపబడినది. ఆ కాలంలో సినిమాలంటేనే ఒక జాడ్యంలా చూసేవారు. "సినిమాలో నటుస్తున్నారని చెప్పకండి, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని చెప్పండి" అని ఫాల్కే తన నటవర్గానికి నచ్చజెప్పాడు.[4]

ప్రదర్శన

[మార్చు]

ఈ సినిమా మొదటిసారిగా 1913, మే 3న ప్రజలకొరకు ప్రదర్శించారు.[5] బాంబే, గిర్‌గావ్ లోని కొరోనేషన్ సినిమా దీనికి వేదిక. హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు.[2] భారత్ లో నిర్మించిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఇదో వింత అనుభూతి. ఈ సినిమా హిట్టయింది. ప్రజాదరణనూ పొందింది. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రదర్శించడానికి ఫాల్కే ఏర్పాట్లు చేసాడు. దీని విజయంతో, ఫాల్కే చరిత్ర సృష్టించాడు. నిర్మాతగా దర్శకుడిగా స్థిరపడ్డాడు. భారతీయ సినిమాలకు ఆద్యుడుగానూ నిలిచాడు.[3]

పబ్లిసిటీ పోస్టరు. కొరోనరీ హాల్, గిర్‌గావ్, ముంబాయిలో ప్రదర్శించారు.

సినిమా ప్రింటులు, నిడివి

[మార్చు]

నిజానికి దీని నిడివి నాలుగు రీళ్ళు, కానీ జాతీయ సినిమా భద్రాలయం పుణే లో దీని మొదటి, ఆఖరి రీళ్ళు గలవు. కొందరు సినిమా చరిత్రకారుల ప్రకారం ఈ భద్రపరచబడిన రీళ్ళు 1917 లో ఇదే పేరుతో నిర్మించిన చిత్రానికి చెందినవి.[6][7]

నటవర్గం

[మార్చు]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Overview New York Times.
  2. 2.0 2.1 10 pre-release big ones Subhash k. Jha, Rediff.com.
  3. 3.0 3.1 The Beginning: The Silent Movie Era Archived 2007-10-22 at the Wayback Machine Asia Studies, University of Berkeley.
  4. Plan to showcase making of India's 1st film Archived 2009-08-25 at the Wayback Machine bignews.big927fm.com
  5. Today in History Archived 2012-09-08 at Archive.today May 3, NDTV.
  6. Raja Harishchandra Archived 2017-11-26 at the Wayback Machine National Film Archive of India.
  7. Raja Harishchandra" (1913) www.filmthreat.com.

బయటి లింకులు

[మార్చు]