రాజారామన్న
డాక్టర్ రాజా రామన్న | |
---|---|
దస్త్రం:RajaRamannaPic.jpg | |
జననం | జనవరి 28, 1925 తుమకూరు, కర్ణాటక,భారతదేశము |
మరణం | 2004 సెప్టెంబరు 24సెప్టెంబర్ 24, 2004 ముంబై, మహారాష్ట్ర, భారతదేశము | (వయసు: 79)
నివాసం | ముంబై, మహారాష్ట్ర, భారతదేశము |
జాతీయత | భారతీయుడు |
రంగములు | అణు భౌతికశాస్త్రము |
వృత్తిసంస్థలు | బాబా అణు పరిశోధనా సంస్థ జాతీయ రక్షణ, పరిశోధనాలయము (డి.ఆర్.డి.ఓ) అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ |
చదువుకున్న సంస్థలు | కింగ్స్ కళాశాల,లండన్,ఇంగ్లాండు |
ప్రసిద్ధి | ఆపరేషన్ స్మైలింగ్ బుద్ద్ద, పోఖ్రాన్-1 అణుపరీక్షలు పోఖ్రాన్-2 అణుపరీక్షలు జాతీయ అణుశక్తి కార్యక్రమ పితామహుడు |
ముఖ్యమైన పురస్కారాలు | పద్మశ్రీ (1968) పద్మభూషణ్ (1973) పద్మవిభూషణ్ (1975) |
రాజారామన్న, (జనవరి 28, 1925 - సెప్టెంబర్ 24, 2004) భారత అణు శాస్త్రవేత్త. భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంచలన విజయాలు సాధించడంలో, అద్భుతమైన ప్రగతిని సాధించడంలో కీలకపాత్ర వహించిన వారిలో డాక్టర్ రాజారామన్న గారు ఒకరు. భారతదేశం అణుబాంబును తయారు చేయడంలో ఈయన కీలకపాత్ర పోషించారు.
జననం
[మార్చు]కర్ణాటక లోని మైసూర్‌లో 1925, జనవరి 28 నాడు జన్మించిన రాజారామన్న ప్రాథమిక విద్యాభ్యాసం మైసూర్‌లోనే చేశారు. తరువాత బెంగుళూర్, మద్రాసు నగరాలలో ఉన్నత విద్యాభ్యాసం చేసి లండన్‌లోని కింగ్స్ కాలేజి నుండి అణుభౌతిక శాస్త్రంలో పిహెచ్.డి. చేశారు. 1949లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో ప్రొఫెసర్‌గా రామన్న తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. అక్కడ సుప్రసిద్ధ శాస్త్రజ్ఞుడు డా. హోమీ జహంగీర్ భాభా సాహచర్యం రాజారామన్నను ఎంతగానో ప్రభావితం చేసింది.
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం నిర్మాణం డా. హోమీభాభా బాధ్యతలను రాజా రామన్నకు అప్పగించారు. వాటిని రామన్న సమర్ధవంతంగా నిర్వహించారు. భారతప్రభుత్వం హోమీభాభా మరణం తరు వాత అటామిక్ ఎనర్జీ కమీషన్ ఛైర్మన్‌గా, అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ కార్యదర్శిగా రాజారామన్నను నియమించింది.
1989 టాటాల ప్రోత్సాహం, ఫ్రాన్స్ నుండి ఆర్థిక సహకారం అందడం వలన రాజారామన్న తన ఉద్యోగానికి రాజీనామా చేసి బెంగుళూర్‌లో పరిశోధనా సంస్థను స్థాపించారు.
మరణం
[మార్చు]2004, సెప్టెంబర్ 24 న మరణించారు.
రచనలు
[మార్చు]- The Structure of Music in Raga and Western Systems
బయటి లింకులు
[మార్చు]- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1929 జననాలు
- 2008 మరణాలు
- పద్మశ్రీ పురస్కారం పొందిన కర్ణాటక వ్యక్తులు
- పద్మభూషణ పురస్కారం పొందిన కర్ణాటక వ్యక్తులు
- పద్మవిభూషణ పురస్కారం పొందిన కర్ణాటక వ్యక్తులు
- భారతీయ భౌతిక శాస్త్రవేత్తలు
- రాజ్యసభ సభ్యులు
- కర్ణాటక శాస్త్రవేత్తలు