Jump to content

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

వికీపీడియా నుండి
(యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ నుండి దారిమార్పు చెందింది)
యార్లగడ్డ లక్ష్మీప్రసాద్
జననం24 నవంబరు 1953
వానపాముల, కృష్ణా జిల్లా
వృత్తిహిందీ ఆచార్యుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఏపీ అధికారభాషా సంఘం అధ్యక్షులు

యార్లగడ్డ లక్ష్మీప్రసాద్(- నవంబరు 24, 1953) రచయిత, భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారాలు పొందిన వ్యక్తి.

జననం, విద్య

[మార్చు]

1953లో నవంబరు 24న కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర వానపాములలో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలాకళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు.

రచనలు

[మార్చు]

హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు.

లక్ష్మీ ప్రసాద్ సాంస్కృతిక సాహితి రాయబారిగా యు.ఎస్.ఎ., మలేషియా, కెనడా, ధాయ్ లాండ్, సింగపూరు, ఇంగ్లాండ్, ప్రాన్స్, మారిషన్, రష్యా వంటి అనేక దేశాలు పర్యటించాడు. ప్రొపెసర్ ముదిగొండ శివప్రసాద్ రచించిన పట్టాభి అనే ప్రముఖ చారిత్రిక నవలను ఈయనకు అంకితమిచ్చాడు.

లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యాడు. ఆయన వ్రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌ సహానీ వ్రాసిన 'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందాడు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యాడు. ఒకే రచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.

సాహిత్యరంగానికి విశిష్టసేవలు అందించినందుకు ప్రతి సంవత్సరం ఇచ్చే, గురజాడ విశిష్ట పురస్కారం 2015 వ సంవత్సరానికి వీరికి బహుకరించనున్నారు. 2015,నవంబరు-30వ తేదీ సాయంత్రం 6 గంటలకు, విజయనగరంలోని ఆనంద గజపతి అడిటోరియంలో నిర్వహించే గురజాడ శతవర్ధంతి సందర్భంగా వీరికి ఈ పురస్కారం అందించారు. [1]

పార్లమెంటరీ అధికార భాషా సంఘ ఉపాధ్యక్షుడుగా, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడుగా, ఆంధ్రప్రదేశ్‌ హిందీ అకాడమీ ఛైర్మన్‌గా, విశ్వహిందీ సదస్సు నిర్వాహకుడుగా పనిచేసారు. రాజ్యసభ సభ్యునిగా (1996-2002) కూడా సేవలందించాడు.[1]

పురస్కారాలు, పదవులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Former Rajya Sabha member's book released". The Hindu. 23 February 2006. Archived from the original on 3 March 2006.
  2. "Padma Awards Directory (1954–2014)" (PDF). Ministry of Home Affairs (India). 21 May 2014. pp. 117–166. Archived from the original (PDF) on 14 September 2017. Retrieved 22 March 2016.
  3. "Draupadi's unending circle of suffering". The New Indian Express. Retrieved 2021-05-31.
  4. "The Hindu : Front Page : Poets dominate 2009 Sahitya Akademi Awards". web.archive.org. 2009-12-27. Archived from the original on 2009-12-27. Retrieved 2021-05-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 15 నవంబరు 2014. Retrieved 21 July 2015.
  6. sivanagaprasad.kodati. "ఏపీ అధికార భాషా సంఘం: అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలం పెంపు". Asianet News Network Pvt Ltd. Retrieved 2021-11-23.

[1] ఈనాడు మెయిన్; 2015,నవంబరు-24; 11వపేజీ.

వెలుపలి లంకెలు

[మార్చు]