గోరింక

వికీపీడియా నుండి
(మైనా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

గోరింక
Common Myna (Acridotheres tristis)
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Order:
Family:

గోరింక (ఆంగ్లం Myna) ఒక రకమైన పక్షులు. ఇవి చిన్న చిన్న పురుగులని, పండ్లని, గింజలు ఆరగిస్తాయి.

ఇవి కూడా కాకుల వలె మానవ సహిత జీవనాన్ని అవలంభిస్తాయి. గోరువంక, గోరింక అనే పేర్లతో తెలుగులో వ్యవహారం. ఇది మైనాపిట్ట జాతిది. ఇది భారతదేశం అంతా, చుట్టుపట్ల దేశాలలో కనిపిస్రంతుంది. పసుపురంగు ముక్కు, పసుపురంగు దృడమయిన కాళ్ళు, తలమీద నల్లగా, పసుపు రంగు కళ్ళు, లేత కాఫీపొడిరంగు రెక్కలు, రెక్కల కింద తెల్లగా ఉంటుంది. ఆడ మొగ పక్షులు ఒకే రకంగా ఉంటాయి. వీటిలో కొండజాతి మైనా (The common myna or Indian myna((Acridotheres tristi )అనేక ధ్వనులను అనుకరించి పలుకుతుంది, మాట్లాడుతుంది. మైనాపిట్టల ఊళ పెద్దగా వినిపిస్తుంది. ప్రమాదాన్ని శంకిస్తె, సాటి పక్షులకు హెచ్చరిక చేసి ఎగిరి పోతుంది. ఆహార భద్రతకు ఈ జాతి పిట్లలవలన నష్టం వాటిల్లుతుందని, ఇతర జంతుజాలానికి నష్టంకలుగుతుందని శాస్త్రవెత్తలు అంటారు. దీన్ని పంజరంలో పెట్టి పెంచుతారు. భారతదేశం అంతటా బీళ్ళల్లో, పొలాల్లో తరచూ గోరువంకలు కనిపిస్తాయి. ధాన్యం గింజలు, పురుగులు, చిన్న చిన్న పండ్లు సర్వం తింటాయి. ఆమ్నిఓరస్ పిట్టలు. ఇవి ఎక్కువగా కొబ్బరి, తాటి చెట్లపై పుల్లలు, గడ్డిపోచలతో గూడు కట్టుకుంటాయి, గూల్ళల్లో, లేదా కలుగుల్లో గుడ్లు పెడతాయి. అడా, మగా పొదుగుతాయి. ఎల్లప్పుడు అరుస్తూ గోలగోలగా ఉంటాయి. తగాదా వస్తే జంటలు మరొక జంటతో ఘోరంగా పోరాడుతాయి. గోరింకలను పంజరంలోపెట్టి పెంచుతారు. సాహిత్యంలొ ఈ పిట్టలను గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. సాహిత్యంలొ గోరువంకలను రాయబారాలుగా, ముచ్చటయిన దంపతులకు పోలికగా చిలకాగోరింకా అని వర్ణించారు.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గోరింక&oldid=4322415" నుండి వెలికితీశారు