Jump to content

మిణుగురు పురుగు

వికీపీడియా నుండి
(మిణుగురు పురుగులు నుండి దారిమార్పు చెందింది)

మిణుగురు పురుగు
Adult Photuris lucicrescens firefly
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Infraclass:
Superorder:
Order:
Suborder:
Infraorder:
Superfamily:
Family:
Lampyridae

Subfamilies

Cyphonocerinae
Lampyrinae
Luciolinae
Ototetrinae
Photurinae
and see below


Genus incertae sedis:
Pterotus

మిణుగురు పురుగులు (ఆంగ్లం Fireflies) ఒకరకమైన కీటకాలు. వర్షా కాలం, శీతాకాలాలలో మిణుగురు పురుగులు కన్పిస్తుంటాయి. మిణుగురు పురుగు కాంతి వేడి లేకు ండా వెలుగును మాత్రమే ఇస్తుంది. దీనికి కారణం వాటి శరీరంలో జరిగే ఒక రకమైన జీవ రసాయనిక చర్య. అలా అవి ఎందుకు చేస్తాయి? అంటే, పక్షులు, ఇతర జీవుల నుండి తమను తాము రక్షించుకునేందుకు, జత కట్టేందుకు, తమ జాతి జీవులకు సంకేతాలు పంపేందుకు ఇవి కాంతిని విరజుమ్ముతుంటాయి. ఉదాహరణకు: ఒక చోట ఉన్న పురుగు ఒకలా మెరిస్తే వేరే చోట ఉన్న పురుగు మరొలా మెరుస్తూ మొదటి పురుగు కు సమాధానం ఇస్తుంది.

మిణుగురు పురుగు పొట్ట క్రింది భాగంలోని కణాలలో ట్రాన్స్‌ఫెరిన్‌ అనే ఓ వర్ణద్రవ్యం ఉంటుంది. వెలుగు రావడం అనేది ఆక్సిడేషన్‌ చర్య వలననే జరుగుతుంది. టాన్స్‌ఫెరిన్‌ ఆక్సిజన్‌తో కలిసి ట్రాన్స్‌ఫెరేజ్‌ అనే ఎంజైమ్‌ సమక్షంలో చర్య జరుగుతుంది. ఫలితంగా ఆక్సీ ట్రాన్స్‌ ఫెరిన్‌, శక్తి వెలువడుతుంది. ఈ విధంగా వెలువడిన శక్తి వెలుగుగా మారు తుంది. అనంతరం ఆక్సీట్రాన్స్‌ఫెరిన్‌ తిరిగి ట్రాన్స్‌ఫెరిన్‌గా మారుతుంది. దీని వలన తిరిగి చర్య జరిగే వీలు ఏర్పడుతుంది.

నిజానికి మిణుగురు పురుగు నుంచి వఛ్చె కాంతి చాలా తక్కువ. ఒక కొవ్వొత్తి ఇచ్చే వెలుఇగుతో పోలిస్తే అందులో కేవలం 40వ వంతు కాంతి మాత్రమే మిణుగురు పురుగు ఇవ్వగలుగుతుంది. మనిషి కన్ను ఈ కాంతిని గ్రహించగలదు. కాబట్టే మిణుగురు పురుగు వెలుగులో మనం చకచకా ఓ పుస్తకాన్ని చదివేయచ్చు.