Jump to content

మహేంద్రసింగ్ వాఘేలా

వికీపీడియా నుండి
మహేంద్రసింగ్ వాఘేలా

ఎమ్మెల్యే
పదవీ కాలం
2012 – 2017
ముందు ఊదేసింగ్ జాల
తరువాత ఊదేసింగ్ జాల
నియోజకవర్గం బయాద్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2007 – 2012
నియోజకవర్గం మేఘ్ రాజ్

వ్యక్తిగత వివరాలు

ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
కాంగ్రెస్
నివాసం గాంధీ నగర్, గుజరాత్
పూర్వ విద్యార్థి గుజరాత్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

మహేంద్రసింగ్‌ వాఘేలా గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన గుజరాత్‌ 12వ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా కుమారుడు. మహేంద్రసింగ్‌ వాఘేలా 2012లో గుజరాత్‌లోని బయాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

మహేంద్రసింగ్‌ వాఘేలా తన తండ్రి శంకర్‌సింగ్ వాఘేలా అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007లో మేఘ్ రాజ్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2012లో బయద్‌ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, 2017 ఆగస్టులో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి బల్వంత్‌సింగ్ రాజ్‌పుత్‌ కు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసి, అసెంబ్లీ ఎన్నికలకు నెలల ముందు 2017 ఆగస్టులో పార్టీకి రాజీనామా చేశాడు. ఆయన 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి జూలై 2018లో అధికార బీజేపీలో చేరి ఆ తరువాత మూడు నెలలకే అక్టోబరులో బీజేపీకి రాజీనామా చేశాడు.[2]

మహేంద్రసింగ్‌ వాఘేలా 2022లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీష్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (28 October 2022). "గుజరాత్‌ ఎన్నికలకు ముందు బీజేపీకి షాక్‌ : కాంగ్రెస్‌లో చేరిన వాఘేలా కుమారుడు". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  2. NDTV (18 October 2018). "Three Months After He Joined BJP, Mahendrasinh Vaghela Quits". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.
  3. Sakshi (28 October 2022). "ఎన్నికల వేళ బీజేపీకి ఊహించని షాక్‌!". Archived from the original on 11 June 2023. Retrieved 11 June 2023.