బావురు పిల్లి

బావురు పిల్లి, పులి బావురు, మరక పిల్లి, నీటి పిల్లి, ఫిషింగ్ క్యాట్ అని పిలిస్తారు దక్షిణ, ఆగ్నేయ ఆసియా యొక్క మధ్య తరహా అడవి పిల్లి. బావురు పిల్లి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర జంతువు. ఇవి మడ అడవులు, తీర ప్రాంత చిత్తడి నేలలలో ఎక్కువగా చేపలను వేటాడుతుంటాయి.

ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో గల మడ అడవుల్లో సంచరిస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కేవలం ఇవి 1500 నుంచి 2000 వరకు ఉన్నట్లు అంచనా. కృష్ణా అభయారణ్యంలో అంతరించిపోతున్న మడ అడవులపై 2013 డిసెంబర్లో రిసెర్చ్ చేస్తున్న తరుణంలో సముద్ర తీరం వెంబడి వీటి ఆచూకీ తెలిసింది.
ఉపయోగాలు
[మార్చు]సముద్రంలో ఉండే పలురకాల చేపలు పెట్టే గుడ్లను కొన్ని రకాల చేపలు తినడం వల్ల మత్స్యసంపద వృద్ధి దెబ్బతింటోంది. అలాంటి చేపలను బావురుపిల్లి తినడం వల్ల అది సంచరించే ప్రాంతాల్లో మత్స్య సంపద పెరుగుతుంది. అంతేకాదు, అవి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడతాయి.
ఇవి ప్రమాదస్థితిలో ఉన్న జాతులు, అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమితి అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. ఈ జాతుల యెుక్క ప్రత్యుత్పత్తి, మనుగడ అభివృద్ధి చెందకపోతే ఇవి కూడా అంతరించే దశకు చేరుకుంటాయి.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "కృష్ణా అభయారణ్యంలో బావురు పిల్లుల జాడ". www.andhrajyothy.com. Retrieved 26 December 2015.[permanent dead link]