గవర్నమెంట్ మ్యూజియం, చెన్నై
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bb/Building_of_Chennai_Egmore_Museum.jpg/200px-Building_of_Chennai_Egmore_Museum.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/74/The_Government_Museum_at_Egmore.jpeg/200px-The_Government_Museum_at_Egmore.jpeg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/91/Chennai_Museum_Canon.jpg/200px-Chennai_Museum_Canon.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4f/Egmore_Museum_building.jpeg/200px-Egmore_Museum_building.jpeg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/10/Chennai_Museum_Entrance.jpg/200px-Chennai_Museum_Entrance.jpg)
గవర్నమెంట్ మ్యూజియం 1851 సంవత్సరం చెన్నైలోని ఎగ్మోర్ ప్రాంతంలో స్థాపించబడింది. భారతదేశంలోని చారిత్రక పురాతన మ్యూజియాలలో రెండవది ఈ మద్రాస్ మ్యూజియం. భారతదేశంలోని చారిత్రక మ్యూజియాలలో మొదటిది కోలకతా లో ఉంది, దీనిని 1814 సంవత్సరంలో స్థాపించారు. దక్షిణ ఆసియాలోని అతిపెద్ద మ్యూజియములలో ఒకటిగా ఈ చెన్నపట్టణం మ్యూజియం ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇందులో ప్రాధాన్యత కలిగిన పురావస్తు, నాణేల సేకరణలు ఉంటాయి. రోమన్ ప్రాచీనకాలం నాటి ప్రాముఖ్యత గల అతిపెద్ద పురాతన వస్తువులను సేకరించారు. వంద సంవత్సరాల పైబడిన అనేక చారిత్రక భవనాలు ఈ ప్రభుత్వ సంగ్రహాలయం ప్రాంగణంలో ఉన్నాయి. ఈ మ్యూజియం ప్రాంగణంలోనే అందరిని బాగా ఆకట్టుకునే వైజ్ఞానిక థియేటర్ ఉంది. ఈ మ్యూజియం పరిసర ప్రాంతంలోనే ప్రస్తుతం నేషనల్ ఆర్ట్ గ్యాలరీ ఉన్నది. దీనిని ఇండో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. ఈ భవనం నందు రాజా రవి వర్మ వంటి వారు తయారు చేసిన అరుదైన కళాఖండాలు ఉన్నాయి.
చచ్చిన కాలేజి, బతికిన కాలేజి
[మార్చు]ఈ మ్యూజియం ప్రాంగణంలోని ఒక భవనంలో చనిపోయిన అన్ని జంతువుల శరీరాలను ఇక్కడ భద్ర పరిచారు. ఇక్కడ అన్ని జీవులకు సంబంధించిన కళేబరాలు ఉండటంతో మాట సామెతగా ఈ మ్యూజియంలో ఏముంటాయి బొచ్చు తప్పక అని ఎవరో అన్నారని అప్పుడు నిర్వాహకులు ఒరోరే మన మ్యూజియంలో బొచ్చు లేదే అని అప్పుడు బొచ్చు కూడా ఏర్పాటు చేసారని పెద్దలు చెప్పుతుంటారు. తెలుగువారు అన్ని రకాల చనిపోయిన జంతువుల శరీరాలను భద్ర పరచిన ఈ మ్యూజియాన్ని చచ్చిన కాలేజి అని మద్రాసులోని మరొక ప్రాంతంలో ఉన్న జూపార్కును బతికిన కాలేజి అని చాలా కాలం పాటు ఉపయోగించారు.
మ్యూజియము దాని ప్రాంగణంలోని పరిసరాల చిత్రమాలిక
[మార్చు]![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4a/Commons-logo.svg/30px-Commons-logo.svg.png)