ప్రజా నాయకుడు
'ప్రజా నాయకుడు ' తెలుగు చలన చిత్రం,1972 నవంబర్ 10 న విడుదల. నటుడు నాగభూషణం సమర్పించిన ఈ చిత్రానికి దర్శకత్వం వీరమాచినేని మధుసూదనరావు. పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై సి హెచ్ రాఘవరావు నిర్మించిన ఈ చిత్రం లో నాగభూషణం , షావుకారు జానకి ,ఘట్టమనేని కృష్ణ కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
ప్రజా నాయకుడు (1972 తెలుగు సినిమా) | |
![]() సినిమాపోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వి.మధుసూదనరావు |
తారాగణం | కృష్ణ, జానకి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | పద్మశ్రీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
![](http://upload.wikimedia.org/wikipedia/te/9/98/Prajanayakudu.png)
1972 వ సంవత్సరానికి గాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి కాంస్య నంది అవార్డు ప్రకటించింది.
తారాగణం
[మార్చు]నాగభూషణం,
కాంతారావు
,మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి,
సాక్షి రంగారావు,
రాజబాబు ,
పొట్టి ప్రసాద్,
గోకిన రామారావు,
కృష్ణ,
జగ్గయ్య
చంద్ర మోహన్,
కాకరాల,
షావుకారు జానకి,
రమాప్రభ,
నిర్మల.
సాంకేతిక వర్గం
[మార్చు]స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీరమాచనేని మధుసూదనరావు
సంగీతం: కె వి మహదేవన్
గీత రచయితలు: ఆచార్య ఆత్రేయ, కొసరాజు రాఘవయ్య చౌదరి
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి
నిర్మాణ సంస్థ: శశి థియేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్
నిర్మాత: సి హెచ్.రాఘవరావు
విడుదల:10:11:1972.
పాటల జాబితా
[మార్చు]1.ఉతకాలిరా బాబు ఉతకాలి బండమీద వేసి బాగా, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి .
2.ఏమిటో చెబుతున్నావు ఎందో ఉందని అనుకున్నావు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
3.ఏరువాకమ్మా మా కెదురురావమ్మ ఎదురొచ్చి, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల బృందం
4.ఓ దొరా లే దొరా రాదొరా ఊరకే చూస్తుంటే రాదురా పడుచు, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి
5.ఓలమ్మి అమ్మీ అమ్మి అమ్మీ పండగొచ్చింది, రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎల్ ఆర్ ఈశ్వరి బృందం
6.నువ్వే.ఏదోలా ఉన్నావు నువ్వే ఏదోలా చూస్తున్నావు, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.