Jump to content

పెమ్మసాని రామలింగ నాయకుడు

వికీపీడియా నుండి
(పెమ్మసాని రామలింగ నాయుడు నుండి దారిమార్పు చెందింది)

విజయనగర సామ్రాజ్యకాలములో బహు పేరుప్రఖ్యాతులు పొందిన సేనాధిపతులు, సామంతరాజులు పెమ్మసాని నాయకులు. వీరు ఓరుగల్లు పతనము పిమ్మట విజయనగరమునకొచ్చి రెండవ హరిహరరాయల కడ సేనాధిపతులుగా చేరారు. వీరి పూర్వీకులు కమ్మనాటిలోని బెల్లంకొండ కు చెందిన వల్లుట్ల, ముసునూర్ల గోత్రీకులు. కాకతీయ కాలమునండి వీరికి ముసునూరివారికి సంబంధబాంధవ్యములున్నాయి.

గండికోట పాలకునిగా కీర్తిప్రతిష్టలు బడసిన తిమ్మా నాయుని మునిమనుమడు రామలింగ నాయుడు. తిమ్మానాయుని కొడుకు వీరతిమ్మానాయునికి చెన్నప్పయను కుమారుడున్నాడు. చెన్నప్పకు రామలింగ, పెద్దతిమ్మ అను ఇద్దరు కొడుకులున్నారు. వీరిలో రామలింగ నాయుడు మహాయోధునిగా బహుళ పేరుప్రఖ్యాతులు సంపాదించాడు. రామలింగ గండికోటను 1509 నుండి 1530 వరకు పాలించాడు. ఈతనివద్ద మహాయోధులగు 80000 సైనికులున్నారు. విజయనగరములో బస చేయడానికి 1430 కుంటల స్థలముంది. శ్రీక్రిష్ణదేవరాయలకు సామంతునిగా యుద్ధసమయములలో ముఖ్య సేనాధిపతిగా వ్యవహరించుచు గుల్బర్గా, గొల్లకొండ, అహమ్మదునగరు సేనలపై ఒకేమారి విజయము సాధించి ముగ్గురు తురుష్క వజీరులను సంహరించి క్రిష్ణదేవరాయనికి విశ్వాసపాత్రుడయ్యాడు. రాయచూరి యుద్ధములో అవిక్రపరాక్రముడై విజ్రింభించి అహమ్మదు షా గుడారపు త్రాళ్ళు కోసి సుల్తానును పారద్రోలాడు. రామలింగని సాహసములను కవి రాయవచకము అను గ్రంథములో పలువిధాల కొనియాడాడు. రామలింగ అనంతపూరు మండలములో పలు దేవాలయములు కట్టించాడు. పోర్చుగీసు చరిత్రకారుడు న్యూనెజ్ రామలింగనాయుని కామనాయక్ అని ఉదహరించాడు.

రామలింగనాయుని తమ్ముడు పెద్దతిమ్మానాయుడు కూడ మహా యోధుడు. ఈతడు దస్తూరు ఖాను అను సేనాధిపతిని వధించి రాయలవారి అభిమానమునకు పాత్రుడయ్యాడు.

వనరులు

[మార్చు]
  • రాయవాచకము, విశ్వనాథరాయ స్థానాపతి.
  • క్రిష్ణరాజవిజయము, కుమార ధూర్జటి.
  • కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  • పెమ్మసానివారి చరిత్రము, యమ్. లక్ష్మీనరసింహ శర్మ
  • Vijayanagara, Burton Stein, Cambridge University Press, 1989, p. 88-92, ISBN 0521266939
  • Quartely Journal of Mythic Society, Bangalore, Vol. 30 (2), p. 186
  • Carnatic Chronolgy: Hindu and Mahomedan, C. P. Brown, 1863, Bernard Quaritch, London, p. 64
  • Krishnadeva Raya, M. Rama Rao, 1971, National Book Trust, New Delhi, p. 17
  • A Forgotten empire (Vijayanagar): A Contribution to the History of India by Robert Sewell (https://web.archive.org/web/20051202102715/http://historion.net/r.sewell-vijayanagar-history-india/)
  • Tidings of the king: a translation and ethnohistorical analysis of the Rayavachakamu by Phillip B. Wagoner. University of Hawaii Press, Honolulu. 1993, Page 138-139, ISBN 0-8248-1495-9 (http://www.questia.com/PM.qst?a=o&d=62773998 Archived 2011-06-05 at the Wayback Machine)
  • Further Sources of Vijayanagar History by K. A. Nilakanta Sastry, 1946(http://www.archive.org/details/FurtherSourcesOfVijayanagaraHistory)