Jump to content

పృథ్వీరాజ్ సాఠే

వికీపీడియా నుండి
పృథ్వీరాజ్ సాఠే

పదవీ కాలం
2012 - 2014
ముందు విమల్ ముండాడ
తరువాత సంగీత థోంబ్రే
నియోజకవర్గం కైజ్

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ చంద్రపవార్)
నివాసం మహారాష్ట్ర , భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

పృథ్వీరాజ్ సాఠే మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2012లో కైజ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

పృథ్వీరాజ్ సాఠే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా 1992లో రాజకీయాల్లోకి వచ్చి నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత అఖిల భారత యువజన కాంగ్రెస్‌ కార్యదర్శిగా, 2007 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో రాహుల్ గాంధీ కోర్ గ్రూపులో సభ్యుడిగా, యువజన కాంగ్రెస్ జాతీయ సమన్వయకర్తగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి ఆ తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2012లో కైజ్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ - కాంగ్రెస్ కూటమి అభ్యర్థి పృథ్వీరాజ్ సాఠే బీజేపీ-సేన మహాకూటమి అభ్యర్థి సంగీత థోంబ్రేపై 8,306 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. పృథ్వీరాజ్ సాఠేకు 85,750 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సంగీత థోంబ్రేకు 77,444 ఓట్లు వచ్చాయి.[4]

పృథ్వీరాజ్ సాఠే 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ అభ్యర్థిగా, 2024 శాసనసభ ఎన్నికలలో ఎన్‌సీపీ - ఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Nationalist Congress Party retains assembly seat". The Times of India. 16 June 2012. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  2. "Prithviraj alias Roman Sathe on Wednesday was administered oath by Dilip Walse Patil, speaker of the state legislative assembly. Sathe defeated BJP candidate Sangita Thombare in the recently held by-election. The election to Kaij-Ambejogai was necessitated following sudden death of sitting NCP MLA Vimal Mundada". The Times of India. 4 July 2012. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  3. "Prithviraj Sathe is Congress national secretary" (in అమెరికన్ ఇంగ్లీష్). Hindustan Times. 19 December 2020. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  4. "अजितदादांचा मुंडेंना धोबीपछाड; केजमध्‍ये राष्‍ट्रवादीचे पृथ्‍वीराज साठे विजयी". 2012. Archived from the original on 11 January 2025. Retrieved 11 January 2025.
  5. "Kaij Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 23 November 2024. Archived from the original on 10 January 2025. Retrieved 10 January 2025.