పితాని సత్యనారాయణ

వికీపీడియా నుండి
(పీతాని సత్యనారాయణ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పితాని సత్యనారాయణ
జననంకొమ్ము చిక్కాల గ్రామం, పాలకొల్లు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
వృత్తిరాజకీయ నాయకుడు
మతంహిందూ
పిల్లలునలుగురు సంతానం
ముగ్గురు కుమారులు 
ఒక్క ఆడపిల్ల
అమ్మాయిగారు  వివాహం అయిన తర్వాత  అమెరికాలో స్థిరపడ్డారు
ముగ్గురు కుమారులు  వారి రాజకీయాలు
దగ్గరుండి పర్యవేక్షిస్తుంటారు

పితాని సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు. ప్రధానంగా లేసు వ్యాపారిగా ప్రసిద్ధి చెందిన సత్యనారాయణ, తరువాత పెనుగొండ నియోజకవర్గం నుండి శాసనసభకు ఎన్నికైనారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో సొంత ఖర్చులతో భక్తుల సౌకర్యార్థం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నిర్మాణం చేసాడు.[1]

బాల్యం, విద్య

[మార్చు]

1952 డిసెంబరు 9న జన్మించిన సత్యనారాయణ స్వగ్రామం పాలకొల్లు మండలం కొమ్ము చిక్కాల గ్రామం. పితాని తండ్రి వెంకన్న కొమ్ముచిక్కాల గ్రామంలో ప్రముఖుడు. లేసు వ్యాపారాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేసిన వాడు వెంకన్న. సత్యనారాయణ ప్రాథమిక విద్య కొమ్ముచిక్కాల హైస్కూలులోనూ, ఉన్నతవిద్య పెనుగొండలోనూ గడిచింది.

రాజకీయ ప్రవేశం

[మార్చు]
  • 2009 లో మొదటగా పెనుగొండ శాసనసభ స్థానానికి కాంగ్రెస్ తరపున పోటీ చేసి తెలుగుదేశానికి చెందిన కర్రి రాధాకృష్ణారెడ్డిపై గెలుపొందారు. ఆయన 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి కార్మిక, ఉపాధి, ట్రైనింగ్‌ అండ్‌ ఫ్యాక్టరీస్‌ శాఖల మంత్రిగా పని చేశాడు. శాసనసభ్యుడుగా  ఉభయ తెలుగు  రాష్ట్రాల్లో మంత్రిగా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన సమయంలో ఆ మంత్రికి కీర్తి పరీక్షలు తెచ్చినటువంటి వ్యక్తి శ్రీ పితాని సత్యనారాయణ గారు. [2]

పదవులు

[మార్చు]
  • ఛైర్మన్, ఆంధ్ర ప్రదేశ్ స్పిన్నింగ్ మిల్స్ పెడరేషన్
  • ఆరోగ్యశ్రీ శాఖా మంత్రిగా పనిచేసారు
  • సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి.

మూలాలు

[మార్చు]
  1. Eenadu (5 June 2024). "'పితాని'కి పట్టం". Archived from the original on 12 June 2024. Retrieved 12 June 2024.
  2. Sakshi (3 April 2017). "ఏపీ మంత్రుల శాఖలు ఇవే". Archived from the original on 10 December 2021. Retrieved 10 December 2021.