పిల్ల నచ్చింది
పిల్ల నచ్చింది (1999 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఇ.వి.వి.సత్యనారాయణ |
---|---|
నిర్మాణం | పి. ఉషారాణి |
తారాగణం | శ్రీకాంత్, రచన, సంఘవి |
సంగీతం | కోటి |
నిర్మాణ సంస్థ | స్రవంతి ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
పిల్ల నచ్చింది 1999 లో వచ్చిన కామెడీ చిత్రం. ఈ చిత్రంలో శ్రీకాంత్, రచనా బెనర్జీ & సంఘవి ప్రధాన పాత్రల్లో నటించారు.[1] ఇ.వి.వి సత్యనారాయణ దర్శకత్వం వహించగాకోటి సంగీతం అందించాడు.[2]
కథ
[మార్చు]దత్తు (శ్రీకాంత్) కుటుంబ రావు (కోట శ్రీనివాసరావు) అనే ధనవంతుడి అల్లుడు. అతని భార్య ప్రీతి (సంఘవి) కారు ప్రమాదంలో మరణించింది. చనిపోతున్న తన కుమార్తె కోరిక ప్రకారం, రావు దత్తును చూసుకుంటాడు. అతనికి మళ్ళీ పెళ్ళి చెయ్యడానికి అమ్మాయి కోసం వెతుకుతున్నాడు కూడా. ఈ ప్రక్రియలో అతను కొంతమంది అమ్మాయిలను అతని వ్యక్తిగత సహాయకురాలు పనిచేసేందుకు ఇంటర్వ్యూ చేస్తాడు. వాస్తవానికి దత్తు కోసం కాబోయే భార్యను ఎన్నుకోవటానికి ఇదొక వంక, అంతే.
లింగం (ఎంఎస్ నారాయణ) తన బాసు, రావు ప్రతి కదలికనూ అనుమానిస్తాడు. అతని ప్రయత్నాలను అన్ని దశలలో పాడుచేయటానికి ప్రయత్నిస్తూంటాడు. రావు భార్య (రజిత) కు ఈ విషయం తెలియజేసినప్పుడు మాత్రమే నిజం బయటికి వస్తుంది.
లహరి (రచనా బెనర్జీ) ఒక కామెడీ క్లబ్‌ను నిర్వహిస్తూటుంది. ఇందులో ఎవిఎస్, భరణి, ఇతరులు స్కిట్స్ కామెడీ నాటకాలతో ప్రేక్షకులను అలరిస్టూంటారు. రావుకు లహరి నచ్చుతుంది. ఆమెను దత్తుకు కాబోయే భార్యగా నిర్ణయించుకుంటాడు. కానీ ఇక్కడ ఒక తంటా వస్తుంది. తాను భార్య పోయినవాణ్ణి కాబట్టి, భర్తను కోల్పోయిన స్త్రీని మాత్రమే పెళ్ళి చేసుకుంటానని దత్తు పట్టుబడుతున్నాడు. రచన ఒక వితంతువులా నటించడానికి అంగీకరిస్తుంది. మరణించిన భర్తగా, ప్రతిరోజూ సంస్మరణ కాలమ్‌లో ప్రచురించబడే ఒక గోపాలకృష్ణ (బ్రహ్మానందం) చిత్రాన్ని కూడా చూపిస్తుంది.
గోపాలకృష్ణ భార్య బాబు మోహన్ ను ప్రేమిస్తుంది. ఆమే వార్తాపత్రికలో ఆ ప్రకటన ఇస్తుంది! శ్రీకాంత్, రచనల పెళ్ళి కుదిరినపుడు, చనిపోయిన గోపాలకృష్ణ తన స్నేహితుడు అలీతో కలిసి క్లైమాక్స్ ప్రొసీడింగ్స్ కోసం సన్నివేశానికి వస్తాడు.
తారాగణం
[మార్చు]- దత్తుగా శ్రీకాంత్
- లహరిగా రచనా బెనర్జీ
- ప్రీతిగా సంఘవి
- గోపాలకృష్ణగా బ్రహ్మానందం
- కుటుంబరావుగా కోట శ్రీనివాస రావు
- అలీ
- బాబు మోహన్
- రజిత
- లింగంగా ఎంఎస్ నారాయణ
పాటలు
[మార్చు]శీర్షిక | గాయకులు |
---|---|
"అయ్యరో పిల్ల నచ్చింది" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
"నేను నిన్ను ప్రేమిస్తున్నాను" | మనో, స్వర్ణలత |
"ముద్దొచ్చేస్తుందమ్మా" | మనో, కె.ఎస్.చిత్ర |
"లావణ్య రాశి" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
"జలక్ జలక్" | మనో |
"బాలాకుమారి సైగా" | ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర |
మూలాలు
[మార్చు]- ↑ "Pilla Nachindi" (in ఇంగ్లీష్). Archived from the original on 2016-08-25. Retrieved 2020-08-25.
- ↑ "Pilla Nachindi (1999)".