బావి

వికీపీడియా నుండి
(నూతులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
బావి వద్ద నీటి కోసం వస్తున్నయువతి చిత్రం


బావులు లేదా నూతులు (Wells) కొన్ని ప్రాంతాలలో మంచినీటి అవసరాల కోసం తయారుచేసుకున్న కట్టడాలు.

బావులలో రకాలు

[మార్చు]
  • ఊట బావి: ఈ బావులలో ప్రకృతి సిద్దంగా నీరు ఊరుతుంది. అందువల్ల ఇవి వేసవి కాలంలో కూడా ఎండిపోవు.
  • దిగుడు బావి: ఈ బావులు భూమి ఉపరితలంలో కలిసిపోయి ఉంటాయి. అంటే వీనికి గట్లు ఉండవు. అందువల్ల వీనిలో పశువులు, చిన్న పిల్లలు పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. కొన్నింటిలోనికి దిగడానికి మెట్లు ఉంటాయి.
  • గొట్టపు బావి: ఈ బావులు యంత్రాల సహాయంతో చాలా లోతు వరకు తవ్వించే అవకాశం ఉన్నాయి. ఇవి భూగర్భ జాలాలలోని క్రింది పొరల లోనికి వేసి నీరును మోటారు పంపు ద్వారా బయటకు తెస్తారు. పెద్ద పట్టణాలలోని ఎక్కువ మంది ఇండ్లలో ఈ రకం బావులు ఉంటున్నాయి. ఆధునిక వ్యవసాయంలో కూడా ఇవి ఎక్కువగా తవ్విస్తున్నారు.
  • గిలక బావి: ఈ బావులు గట్టుతో ఉండి సురక్షితమైనవి. చేదతో నీరు తోడుకోవడానికి మధ్యలో బావిగిలక నిర్మించబడి ఉంటుంది.

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  • Driscoll, F. (1986). Groundwater and Wells. St. Paul, MN: Johnson Filtration Systems, second edition. ISBN 978-0-9616456-0-1
"https://te.wikipedia.org/w/index.php?title=బావి&oldid=4352538" నుండి వెలికితీశారు