Jump to content

దీవకొండ దామోదర్ రావు

వికీపీడియా నుండి
(దీవకొండ దామోదర్‌ రావు నుండి దారిమార్పు చెందింది)
దీవకొండ దామోదర్‌ రావు
దీవకొండ దామోదర్ రావు

దీవకొండ దామోదర్‌ రావు


రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2022 జూన్ 22 - 2028 జూన్ 21

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 1, 1958
మద్నూర్, బుగ్గారం మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు నారాయణరావు [1]
నివాసం హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం

దీవకొండ దామోదర్‌ రావు తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, నమస్తే తెలంగాణ దినపత్రిక వ్యవస్థాపకుడు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు.[2]

జననం - కుటుంబం

[మార్చు]

దామోదర్‌ రావు జగిత్యాల జిల్లా, బుగ్గారం మండలం, మద్నూర్ లో 1958, ఏప్రిల్ 1న జన్మించాడు. భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.[3]

తెలంగాణ ఉద్యమం

[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో జరిగిన తెలంగాణ మలిదశ, తుదిదశ ఉద్యమాల్లో పాల్గొన్నాడు.[4]

రాజకీయరంగం

[మార్చు]

2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించాడు. ఆయనను 2022 మే 18న టీఆర్ఎస్ పార్టీ తరపున రాజ్య‌స‌భ సభ్యుడిగా ఖరారు చేసింది.[5][6] ఆయన 2024 జూన్ 23న రాజ్యసభలో బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ విప్‌గా నియమితుడయ్యాడు.[7]

ఇతర వివరాలు

[మార్చు]
  1. తెలంగాణ పబ్లికేషన్స్‌ను స్థాపించి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలకు, టీ న్యూస్ ఛానల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేశాడు.
  2. 2019, సెప్టెంబరు 18న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించబడ్డాడు.[8]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (2 September 2021). "నమస్తే తెలంగాణ సీఎండీకి పితృవియోగం". Archived from the original on 15 January 2022. Retrieved 15 January 2022.
  2. టీ న్యూస్, తెలంగాణ (19 September 2019). "టీటీడీ బోర్డులో తెలంగాణకు పెద్దపీట". Tnews. Retrieved 2 February 2020.[permanent dead link]
  3. Andhra Jyothy (19 May 2022). "రాజ్యసభకు దామోదర్‌రావు" (in ఇంగ్లీష్). Archived from the original on 19 May 2022. Retrieved 19 May 2022.
  4. Telangana Today, Telangana (18 September 2019). "TTD board reconstituted, TPPL C&MD Damodar Rao nominated to board". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.
  5. Namasthe Telangana (18 May 2022). "టీఆర్ఎస్ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులు వీరే." Archived from the original on 18 May 2022. Retrieved 18 May 2022.
  6. Namasthe Telangana (19 May 2022). "రాజ్యసభకు దామన్న". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
  7. Andhrajyothy (23 June 2024). "బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్ర." Archived from the original on 23 June 2024. Retrieved 23 June 2024.
  8. ఆంధ్రజ్యోతి, అమరావతి (17 September 2019). "టీటీడీ పాలకమండలి సభ్యుల పేర్లు ఖరారు". Archived from the original on 2 February 2020. Retrieved 2 February 2020.