Jump to content

సీడెడ్

వికీపీడియా నుండి
(దత్తమండలం నుండి దారిమార్పు చెందింది)

ఈ ప్రాంతానికే సంబంధించిన రాయలసీమ వ్యాసం

సీడెడ్ జిల్లాలు
ప్రాంతం , బ్రిటీష్ ఇండియా

1800–1947

Flag of సీడెడ్ జిల్లాలు

Flag

చరిత్ర
 -  నిజాం నేటి రాయలసీమ ప్రాంతమైన సీడెడ్ జిల్లాలను బ్రిటీషర్లకు దత్తపరిచడం 1800
 -  భారత స్వాతంత్రం 1947

1800 సంవత్సరంలో హైదరాబాదు నిజాం, బ్రిటిషు ఈస్టిండియా కంపెనీకి అప్పగించిన (ఇంగ్లీషులో ceded - సీడెడ్) దక్కను లోని జిల్లాలకు సీడెడ్ జిల్లాలు అని పేరు. ఈ పేరుకు అధికారికంగా న్యాయ, పరిపాలన రంగాల్లో వాడుక ఉండేది కాదు కానీ మొత్తం బ్రిటీష్ పాలనా కాలమంతా ఈ పేరే వినియోగంలో ఉండేది.

చరిత్ర

[మార్చు]

ఈ ప్రాంతం 17వ శతాబ్ది మధ్యకాలంలో మైసూరు సామ్రాజ్యానికి చెందిన సేనాధిపతుల్లో ఒకనిగా ఉన్న కాలంలో హైదరాలీ ఈ ప్రాంతాన్ని గెలుచుకున్నాడు. ఆపైన 18వ శతాబ్ది చివరి దశకం వరకూ మైసూరు సామ్రాజ్యంలో అంతర్భాగాలుగా ఈ ప్రాంతాలు వుండేవి. 1792లో టిప్పు సుల్తాన్ ఓటమి చెందాక కుదిరిన శ్రీరంగపట్నం సంధి ప్రకారం మైసూరు సామ్రాజ్యంలోని సగాన్ని విభజించి, మిగిలిన సగాన్ని ఆ యుద్ధవిజేతలైన ఆంగ్లేయులు, మరాఠాలు, నిజాం ప్రభువు పంచుకున్నారు. ఆ పంపకాల్లో, నేటి బళ్ళారి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలున్న భాగం నిజాం రాజ్యానికి వచ్చింది. 1796లో ఒకపక్క నుంచి మరాఠాలు, మరొకవైపు నుంచి టిప్పు సుల్తాన్ చొచ్చుకు వస్తుండడంతో నిజాము, ఈస్టిండియా కంపెనీ సైనిక సహాయం స్వీకరించాలని భావించాడు. లార్డ్ వెస్లే సిద్ధాంతాన్ని అనుసరించి ఏర్పాటైన సబ్సిడరీ కూటమి నియమాల ప్రకారం స్వీకరించారు. 1799లో జరిగిన నాలుగవ ఆంగ్ల-మైసూరు యుద్ధంలో టిప్పుసుల్తాన్ ఓటమి పాలై మరణించాక, 1800 లో యుద్ధాలు, సైన్యనిర్వహణ ఖర్చుల నిమిత్తం నిజాం తమకు పడిన బాకీ నిమిత్తం ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారు.[1] ఐతే ఈ యుద్ధం వెనుక టిప్పుసుల్తాన్ ఫ్రెంచివారితో ఒప్పందం కుదుర్చుకుని బ్రిటీష్ ఈస్టిండియా పాలను వ్యతిరేకంగా కుట్రచేసినందుకు బ్రిటీష్ వారు ఆగ్రహించడమే ముఖ్యకారణం కావడం విశేషం.

నిజాంకు మైసూరు సామ్రాజ్యం నుంచి లభించిన భూభాగంలో అదిపెద్ద భాగాన్ని తిరిగి బ్రిటీషర్లు అగ్రిమెంటు ప్రకారం స్వీకరించి, మద్రాసు ప్రెసిడెన్సీలో కలిపారు. ఈ ప్రాంతాన్ని ఆ కారణంగానే సీడెడ్ జిల్లాలు అని పిలిచేవారు. బ్రిటీష్ వారికి నిజాం ద్వారా ధారాదత్తమైన ప్రాంతం కనుక తెలుగులో సీడెడ్‌కు దత్త మండలం అన్న పేరుండేది.

ప్రాంతం

[మార్చు]

సీడెడ్ ప్రాంతంలో కింది జిల్లాలు ఉండేవి:[2]

పూర్తిగా

[మార్చు]

పాక్షికంగా

[మార్చు]

రాయలసీమ

[మార్చు]

ప్రధానవ్యాసం:రాయలసీమ
సీడెడ్ లేదా దత్తమండలం అన్న పేరు రెండు రాజ్యాల నడుమ ప్రాంతం చేతుల మారినందుకే వచ్చిందని ఈ ప్రాంతపు మేధావులు కొందరు వ్యతిరేకించారు. భారతీయ చక్రవర్తుల్లో ప్రసిద్ధుడైన శ్రీకృష్ణదేవరాయలు పేరుమీదుగా రాయలసీమ అనే పేరును చిలుకూరి నారాయణరావు 1928లో దత్తమండలానికి పెట్టాలని సూచించారు. ఈ సూచన కాలక్రమేణ పండితామోదం, జనామోదం పొంది చివరకు ఈ ప్రాంతానికి రాయలసీమ అన్న పేరు స్థిరపడింది. ఈ ప్రాంతానికి ఇదే పేరు వేరే పండితులు సూచించారని వాదన కూడా వచ్చినా చివరకు దీన్ని సూచించింది చిలుకూరి నారాయణరావేనన్న విషయం నిర్ధారణ పొందింది.[3]

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140. Retrieved 1 December 2014.
  2. The Imperial Gazetteer of India, Volume 7. Oxford: Clarendon Press. pp. 158–176. Archived from the original on 2014-11-22. Retrieved 2014-12-10.
  3. యానాదిరాజు, పి. (2003). రాయలసీమ:డ్యూరింగ్ కొలోనియల్ టైమ్స్ (1 ed.). న్యూఢిల్లీ: నార్త్రన్ బుక్ సెంటర్. ISBN 81-7211-139-8. Retrieved 10 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=సీడెడ్&oldid=3873929" నుండి వెలికితీశారు