Jump to content

తెల్ల జిల్లేడు

వికీపీడియా నుండి
(తెల్లజిల్లేడు నుండి దారిమార్పు చెందింది)
తెల్ల జిల్లేడు మొక్క

తెల్ల జిల్లేడు (Calotropis procera), పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబానికి చెందిన మొక్క. ఇవి ఉత్తర ఆఫ్రికా, పశ్చిమ, దక్షిణ ఆసియా, ఇండోచైనా ప్రాంతాలలో కనిపిస్తాయి. దీనిని హెబ్రూ భాషలో "సోడమ్ ఏపిల్" (Apple of Sodom) అంటారు. సంస్కృతంలో అలార్క లేదా శ్వేతార్క అంటారు.[1] ఈ మొక్కలోని విషంతో ఆయుర్వేదంలో మందులు తయారు చేస్తారు. హిందూ మతంలో ఈ చెట్టు వేరును పవిత్రంగా భావించి పూజ చేస్తారు.

దీర్ఘకాలిక ఆస్తమా దగ్గుటకు

[మార్చు]

తెల్ల జిల్లేడు పువ్వులు పూర్తిగా ఎండబెట్టి, మొత్తం 15 గ్రాముల బరువున్న పౌడర్‌గా తయారుచేయాలి, 100 గ్రాముల బెల్లం (తెలుగులో బెల్లాం) తో 10 గ్రాముల వాం (తెలుగులో) పొడితో కలపాలి. 5 గ్రాముల మాత్రలు తయారుచేసి ఎండబెట్టాలి.రోజుకు ఒక మాత్ర లేదా రెండు తప్పనిసరిగా 40 రోజులు నీరు లేదా ఆవు పాలతో తీసుకోవాలి. తరువాత దీర్ఘకాలిక ఆస్తమా నయమవుతుంది. ఇది ఎల్చుారి వారి పుస్తకాలలో, ఆయుర్వేదంలోని ఇతర పుస్తకాలలో వ్రాయబడింది.

హిందూమతంలో తెల్లజిల్లేడు ప్రాశస్త్యం

[మార్చు]

తెల్ల జిల్లేడు వేళ్ళ మీద గణపతి నివసిస్తాడని హిందువుల విశ్వాసం. ఈ వేళ్ళు కొన్ని సార్లు ఆకృతిలో సైతం గణేశుని పోలి ఉంటాయి. ఈ విధంగా ఉన్న వేళ్ళను స్వయంభూ శ్వేతార్క గణపతి అని వ్యవహరిస్తారు.[2]

మూలాలు

[మార్చు]
  1. Field guide on Medicinal Plants, Forest department of Andhra Pradesh, 1999.
  2. "తెల్ల జిల్లేడు విశిష్టత". TeluguOne Devotional (in english). 2020-02-29. Retrieved 2020-02-29.{{cite web}}: CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.