తెలుగు ప్రేమ ప్రచారక్
![]() | |
సంపాదకులు | వి.రామబ్రహ్మం |
---|---|
వర్గాలు | ధార్మికపత్రిక |
తరచుదనం | మాసపత్రిక (1932 ఆగస్ట్ నుండి 1934 వరకు) వారపత్రిక (1934 నుండి 1937 వరకు) |
మొదటి సంచిక | ఆగస్టు 1, 1932 |
సంస్థ | ది ఆంధ్రా సత్సంగ్ అసోసియేషన్ |
దేశం | ![]() |
భాష | తెలుగు |
తెలుగు ప్రేమ ప్రచారక్ భీమవరం నుండి వెలువడిన తెలుగు పత్రిక. ఆంధ్ర సత్సంగ సంఘం తరఫున ఈ పత్రిక నెలకొకతూరి ప్రకటితమయ్యింది. మొదటి సంచిక 1932 ఆగస్టు నెలలో ప్రచురణ పొందింది. వి.రామబ్రహ్మము ఈ పత్రికకు సంపాదకుడు. 1934లో వారపత్రికగా రూపాంతరం చెందింది.
విశేషాలు
[మార్చు]ఆంధ్ర సత్సంగ్ అసోసియేషన్ తరఫున భీమవరం నుండి ఈ పారమార్థిక పత్రిక వెలువడింది. వి.రామబ్రహ్మం ఈ పత్రికకు సంపాదకులు. డి.బుచ్చినారాయణమూర్తి ఈ పత్రిక ముద్రాపకుడు. కళానిధి ముద్రణాలయంలో ముద్రించబడింది. దయాల్బాగ్‌లోని రాధాసామి సత్సంగ సభ ప్రచారానికి సంబంధించిన విషయాలు ఈ పత్రికలో ఉన్నాయి. ఈ పత్రికలో వార్తలు - విశేషములు, యదార్థ ప్రకాష్, ప్రేమవిలాస్, ప్రేమపత్ర, అమృతలేఖ మొదలైన అనువాద రచనలు, సాహెబ్జీ మహరాజ్ వారి అమృత వచనములు మొదలైన శీర్షికలతో పాటు స్థానిక కోర్టు ప్రకటనలు ఉన్నాయి. ఈ పత్రిక ధర విడి సంచిక 1 అణా 6 పైసలు, వార్షిక చందా 3 రూపాయల 12 అణాలుగా పేర్కొన్నారు. ఈ పత్రిక 4 సంవత్సరాలకు పైగా నడిచింది[1].
రచనలు
[మార్చు]ఈ పత్రికలో ప్రచురితమైన కొన్ని వ్యాసాలు:
- సత్యమగు సత్సంగము వలన కలుగు లాభమేమి?
- భక్తిమార్గము : తపస్సు
- భక్తి స్వభావము
- వాస్తవమగు మతమొక్కటియే
- మానవసేవ జేయుటకు ముందంజ వేయుడు
అభిప్రాయం
[మార్చు]"చిత్తమునకు సంస్కారమును, హృదయమునకు ఉత్తేజమును కలిగించు వ్యాసములతో ఒప్పారుతూ ఈ పత్రిక ఆంధ్ర మహాజనుల ఆదరణకు పాత్రమైన"దని ఆండ్ర శేషగిరిరావు సంపాదకత్వంలోని ఆంధ్రభూమి మాసపత్రిక ప్రశంసించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ ప్రెస్ అకాడమీ ఆర్కీవ్స్‌లో తెలుగు ప్రేమ ప్రచారక్ పత్రిక ప్రతి[permanent dead link]
- ↑ ఆండ్ర శేషగిరిరావు (1 June 1933). "ఆంధ్రభూమి పుస్తకపీఠము". ఆంధ్రభూమి. 1 (2): 429. Retrieved 27 February 2025.