తుంగ నది

వికీపీడియా నుండి
(తుంగనది నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
తుంగ నది
తీర్థహళ్ళి వద్ద తుంగ నది
స్థానం
దేశంభారత దేశం
రాష్ట్రంకర్ణాటక
భౌతిక లక్షణాలు
మూలంగంగ మూల
 • స్థానంచిక్కమగళూరు జిల్లా, కర్ణాటక
సముద్రాన్ని చేరే ప్రదేశంతుంగభద్ర
 • స్థానం
కూడ్లి, భద్రావతి, కర్ణాటక
పొడవు147 కి.మీ. (91 మై.)approx.

తుంగ నది కర్ణాటక రాష్ట్రంలోని పవిత్ర నది. ఇది గంగమూల వద్ద పడమటి కనుమల లోని వరాహ పర్వతంపై పుట్టి చిక్క మగళూరు, షిమోగా జిల్లాల గుండా ప్రవహిస్తుంది. దీని పొడవు సుమారు 147 కిలోమీటర్లు. ఈ నది కూడ్లి వద్ద భద్ర నదితో కలుస్తుంది. అక్కడనుండి దీనిని తుంగభద్ర అని పిలుస్తారు. తరువాత తూర్పుగా ప్రవహించి ఆంధ్ర ప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నది నీరు స్వచ్ఛంగా తాగేందుకు మధురంగా ఉంటుందని చెబుతూ "గంగా స్నానం తుంగా పానం" అనే సామెత ఉంది.

గజనూరు వద్ద ఈ నదిపై ఒక ఆనకట్ట ఉంది. ఇది తుంగభద్ర నదిలో సంగమించాక, ఆ నదిపై హోస్పేట వద్ద ఒక పెద్ద ఆనకట్ట ఉంది.

పవిత్ర ప్రదేశాలు

[మార్చు]
గర్భిణీ[permanent dead link] కప్పకు కాపలాగా ఉన్న పాము - తుంగ నది ఒడ్డున శృంగేరి వద్ద శిల్పం

శృంగేరి వద్ద తుంగ నది ఒడ్డున చాలా దేవాలయాలున్నాయి. వానిలో శారదా పీఠం, విద్యాశంకరాలయం ప్రముఖమైనవి.

"https://te.wikipedia.org/w/index.php?title=తుంగ_నది&oldid=2970858" నుండి వెలికితీశారు