Jump to content

తహశీల్దార్

వికీపీడియా నుండి
(తహసీల్దారు నుండి దారిమార్పు చెందింది)
తహసీల్దార్‌ కార్యాలయం (వర్ధన్నపేట).

తాలూకా (మండలం) భూమి, దానిపై వసూలు చేయవలసిన పన్నులుద్వారా సంక్రమించే ఆదాయాన్ని పర్వేక్షించే నిర్వహణాధికారిని తహసీల్దార్ అంటారు. ఈ వ్యవస్థ భారతదేశంలో స్వాతంత్ర్యం రాక ముందు పూర్వకాలం నుండి అమలులో ఉంది.తహసీల్దార్ విధులు నిర్వహించే కార్యాలయాన్నితహసీల్దార్ కార్యాలయం లేదా తాలూకా కార్యాలయం అంటారు. ఇతని పర్వేక్షణలో కొన్ని గ్రామాలు ఉంటాయి.వాటిని రెవెన్యూ గ్రామాలు అంటారు.భూ ఆదాయానికి సంబంధించి తహసీల్ నుంచి పన్నులు పొందే బాధ్యత వారిపై ఉంది.ఇది జిల్లా పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది. తహసీల్దార్‌ను సంబంధిత తాలూకా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని కూడా అంటారు.రెవెన్యూ విభాగంలో, డిప్యూటీ కలెక్టర్ (డిప్యూటీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని కూడా పిలుస్తారు), ఒక తహశీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారి నియంత్రణలో విధులు నిర్వహిస్తారు.జిల్లా స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ జిల్లా రెవెన్యూ ఆఫీసర్ అజమాయిషీలో పనిచేస్తుంది. అతన్ని అదనపు జిల్లా కలెక్టర్ అని కూడా పిలుస్తారు.జిల్లాలోని అన్ని విభాగాలు నిర్వహణపై జిల్లా కలెక్టర్ నియంత్రణ కలిగిఉంటాడు.[1][2]

మండల రెవెన్యూ కార్యాలయం, (ఇటిక్యాల మండలం)

మండల రెవెన్యూ అధికారి, ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1985 లో మండల వ్యవస్థ ఏర్పడింది. పూర్వం ఉన్న తాలూకాలను చీల్చిమండలాలను ఏర్పాటు చేశారు. ఆ తాలూకాలకు ఉన్న తహసీల్ దార్ లే ఈ ఎమ్మార్వోలుగా నియమించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2007 లో ఈ ఎమ్మార్వో లను మళ్ళీ తహసీల్ దార్ లుగా మార్చింది. పేరు ఏదైనా వీరిద్దరూ విధులు, బాధ్యతలు, చేసే పనులు ఒకటే.కేవలం ఉద్యోగ హోదాలో మాత్రమే మార్పులు జరిగాయి.

తహసీల్దార్ అజమాయిషీలో సంబంధిత ప్రాంతాల భూమి రికార్డులు నిర్వహించబడతాయి.[3] భూమి హక్కు వివరాలు డిజిటల్ రూపంలోకి మార్చబడి అంతర్జాల ద్వారా అందుబాటులో ఉన్నాయి.[4][5].మండల రెవెన్యూ అధికారి, లేదా తహసీల్ దార్ పర్వేక్షణలో ఉన్న గ్రామాలను రెవెన్యూ గ్రామాలు అంటారు.

నిర్వచనం

[మార్చు]

తహసీల్దార్, తహసీలు అనే పదాలు మొఘల్ సామ్రాజ్య మూలానికి చెందింది. ఇది అరబిక్ నుండి ఉద్భవించిన ఇస్లామిక్ పరిపాలనాలో "తహసిల్", అంటే "ఆదాయాన్ని సంపాదించడం, "దార్" అంటే సేకరణ "దార్", పెర్షియన్ "ఒక స్థానాన్ని కలిగి ఉన్నవాడు", అంటే పన్ను వసూలు చేసేవాడనే అనే అర్థం.[6] బ్రిటీష్ పాలనలో తహశీల్దార్ పాత్ర కొనసాగింది. తరువాత బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం పొందిన తరువాత పాకిస్తాన్, భారతదేశంలో ఈ వ్యవస్థను సాగించాయి.భారతదేశంలో ఇప్పటికీ అమలులో ఉంది. ఒక తహసీల్దార్ డిప్యూటీని నాయబ్ తహశీల్దార్ అంటాారు.

మండల రెవెన్యూ అధికారి

[మార్చు]

1985 నుండి 2007 మధ్య కాలంలో వీరిని మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) లుగా వ్యవహరించేవారు. వీరికి గ్రామ స్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారి సహాయపడతారు.

ఇవి చూడండి

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
  1. "Collectorate | Visakhapatnam District, Government of Andhra Pradesh | India". Retrieved 2020-08-26.
  2. "District Administration | Chennai District | India". Retrieved 2020-08-26.
  3. "ఏమీ పదాలు.. విచిత్రంగా ఉన్నాయే!". 2019-08-08. Archived from the original on 2019-08-14.
  4. "meebhoomi (Andhra Pradesh) website". 2019.
  5. "Dharani Land status(Telangana) website". 2019.
  6. "What does Tehsildar mean?". www.definitions.net. Retrieved 2020-08-26.

వెలుపలి లంకెలు

[మార్చు]