ఢిల్లీ డేర్ డెవిల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ | |||
Delhi Capitals Logo.png | |||
సారధి: | శ్రేయాస్ అయ్యర్ | ||
---|---|---|---|
కోచ్: | రికీ పాంటింగ్ | ||
అధ్యక్షుడు: | పార్థ్ జిందల్ | ||
నగరం: | ఢిల్లీ | ||
స్థాపన: | 2008 ఢిల్లీ డేర్ డెవిల్స్ | ||
స్వంత మైదానం: | అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూ ఢిల్లీ (Capacity: 41,820) | ||
యజమాని: | జిఎమ్ఆర్ గ్రూప్(50%) జెఎస్డబ్ల్యూ గ్రూప్ (50%)[1] |
||
అధికారిక అంతర్జాలం: | delhicapitals.in |
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపిఎల్ క్రికెట్ లీగ్‌లో ఢిల్లీ నగరానికి ప్రాతినిధ్యం వహించే జట్టు. 2008 లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా స్థాపించిన ఈ ఫ్రాంచైజీకి జిఎంఆర్ గ్రూప్, జెఎస్డబ్ల్యు గ్రూప్ లు సంయుక్తంగా స్వంతదార్లు . న్యూ ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ స్టేడియం ఈ జట్టుకు సొంత మైదానం .
IPL ఫైనల్స్ లోకి ఎప్పుడూ వెళ్ళని ఏకైక జట్టు ఢిల్లీ క్యాపిటల్స్.[2] ఏడు సంవత్సరాలలో మొదటిసారి 2019 లో ఐపిఎల్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. [3] జట్టుకు అత్యధిక పరుగులు చేసింది వీరేందర్ సెహ్వాగ్, ఎక్కువ వికెట్లు సాధించింది అమిత్ మిశ్రా.
ఫ్రాంచైజ్ చరిత్ర
[మార్చు]ఐపిఎల్ క్రికెట్ లీగ్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బిసిసిఐ) నిర్వహిస్తుంది. దీనికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) మద్దతు ఉంది. ప్రారంభ టోర్నమెంట్ ఏప్రిల్-2008 జూన్ లో జరిగింది. దీనిలో టోర్నమెంట్లో పాల్గొన్న ఎనిమిది జట్ల జాబితాను బిసిసిఐ ఖరారు చేసింది. ఈ ఎనిమిది జట్లు ఎనిమిది వేర్వేరు నగరాలకు ప్రాతినిధ్యం వహించాయి. వాటిలో ఢిల్లీ ఒకటి. 2008 ఫిబ్రవరి 20 న ముంబైలో జట్ల వేలం నిర్వహించారు. ఢిల్లీ జట్టును జిఎంఆర్ గ్రూప్ US $84 మిలియన్లకు కొనుగోలు చేసింది. [4]
2018 మార్చి లో, జిఎంఆర్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ లో 50% వాటాను జెఎస్డబ్ల్యు సంస్థకు ₹ 550 కోట్లకు విక్రయించింది. [5]
2018 డిసెంబరు లో, జట్టు తన పేరును ఢిల్లీ డేర్ డెవిల్స్ నుండి ఢిల్లీ క్యాపిటల్స్ గా మార్చుకుంది. [6] జట్టు పేరును మార్చడం వెనుక ఉన్న హేతువు గురించి మాట్లాడుతూ, సహ యజమాని, చైర్మన్ పార్థ్ జిందాల్, "ఢిల్లీ దేశానికి శక్తి కేంద్రం, ఇది రాజధాని, అందుకే మా జట్టు పేరు ఢిల్లీ క్యాపిటల్స్" అని అన్నారు. [7] సహ యజమాని కిరణ్ కుమార్ గ్రంథి మాట్లాడుతూ, "కొత్త పేరు ఢిల్లీ యొక్క గుర్తింపును సూచిస్తుంది. ఆ నగరం వలెనే, మేము కూడా అన్నింటా కేంద్రంగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాము." [8]
ఐపిఎల్ సీజన్లు, స్థానాలు
[మార్చు]వివిధ సీజన్లలో ఢిల్లీ జట్టు పొందిన స్థానాలు ఇలా ఉన్నాయొ
సంవత్సరం | లీగ్ టేబుల్ స్టాండింగ్ | తుది స్థానం |
---|---|---|
2008 | 8 లో 4 వ స్థానం | సెమీఫైనలిస్టులు (4 వ) |
2009 | 8 లో 1 వ స్థానం | సెమీఫైనలిస్టులు (3 వ) |
2010 | 8 లో 5 వ | 5 వ |
2011 | 10 లో 10 వ | 10 వ |
2012 | 9 లో 1 వ స్థానం | ప్లేఆఫ్‌లు (3 వ) |
2013 | 9 లో 9 వ | 9 వ |
2014 | 8 లో 8 వ | 8 వ |
2015 | 8 లో 7 వ | 7 వ |
2016 | 8 లో 6 వ | 6 వ |
2017 | 8 లో 6 వ | 6 వ |
2018 | 8 లో 8 వ | 8 వ |
2019 | 8 లో 3 వ | ప్లేఆఫ్‌లు (3 వ) |
గణాంకాలు
[మార్చు]గెలుపోటముల రికార్డు
[మార్చు]సంవత్సరం | ఆడినవి | గెలుపు | ఈటమి | టైడ్ | ఫలితం తేలనివి | గెలుపు % | స్వంత మైదానంలోగెలుపు % | బయట గెలుపు % | తటస్థ మైదానంలో గెలుపు % | స్థానం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
IPL 2008 | 15 | 7 | 7 | - | 1 | 50% | 4/7 (1 NR) = 66.7% | 3/7= 42.86% | 0/1=0% | Semifinalists |
IPL 2009 | 15 | 10 | 5 | - | - | 66.67% | - | - | 10/15= 66.67% | , Semifinalists |
IPL 2010 | 14 | 7 | 7 | - | - | 50% | 3/7= 42.9% | 4/7= 57.1% | - | League stage |
IPL 2011 | 14 | 4 | 9 | - | 1 | 30.77% | 1/7 (1 NR) = 16.7% | 3/7= 42.9% | - | League stage |
IPL 2012 | 18 | 11 | 7 | - | - | 61.11% | 5/8= 62.5% | 6/9= 66.67% | 0/1=0% | League Stage Table Toppers, Playoffs |
IPL 2013 | 16 | 3 | 13 | - | - | 18.75% | 3/8= 37.5% | 0/8= 0% | - | League Stage |
IPL 2014 | 14 | 2 | 12 | - | - | 14.28% | 0/5= 0% | 0/4= 0% | 2/5=40% | League Stage |
IPL 2015 | 14 | 5 | 8 | - | 1 | 35.70% | 3/7= 42.9% | 2/7 (1 NR) = 33.3% | - | League Stage |
IPL 2016 | 14 | 7 | 7 | - | - | 50% | 4/7 =57.1 % | 3/7= 42.9% | - | League Stage |
IPL 2017 | 14 | 6 | 8 | - | - | 42.85% | 4/7 =57.1 % | 2/7= 28.6% | - | League Stage |
IPL 2018 | 14 | 5 | 9 | - | - | 35.71% | 4/7 =57.1 % | 1/7 =14.3 % | - | League stage |
IPL 2019 | 15 | 10 | 5 | - | - | 64.27% | 4/7 = 57.14% | 5/7 = 71.43% | - | Semifinalist |
Overall | 176 | 76 | 96 | - | 3 | 43.93% | 33/73 (2 NR) =45.21 % | 25/74 (1 NR) = 33.78% | 12/22= 54.54% |
|
ముఖాముఖి
[మార్చు]జట్లు | మ్యాచ్‌లు | గెలుపు | కోల్పోయిన | ఫలితం లేదు | % గెలుపు |
---|---|---|---|---|---|
చెన్నై సూపర్ కింగ్స్ | 19 | 6 | 13 | - | 31,57 |
డెక్కన్ ఛార్జర్స్ / సన్‌రైజర్స్ హైదరాబాద్ | 25 | 12 | 13 | - | 48.00 |
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ | 24 | 10 | 14 | - | 41,66 |
కొచ్చి టస్కర్స్ కేరళ | 2 | 1 | 1 | - | 50.00 |
కోల్‌కతా నైట్ రైడర్స్ | 23 | 10 | 13 | - | 41,30 |
ముంబై ఇండియన్స్ | 24 | 12 | 12 | - | 50.00 |
పూణే వారియర్స్ ఇండియా / రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్ | 9 | 4 | 4 | 1 | 44,44 |
రాజస్థాన్ రాయల్స్ | 19 | 8 | 11 | - | 42,10 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 23 | 8 | 14 | 1 | 38,36 |
గుజరాత్ లయన్స్ | 4 | 3 | 1 | - | 75,00 |
మూలాలు
[మార్చు]- ↑ "We have pressed reboot button after coming as equal owners in Delhi Capitals: Parth Jindal". The Economic Times. 14 March 2019. Retrieved 25 December 2019.
- ↑ "IPL 2019: Young captain, young squad, chance for Delhi Capitals (DC) to break title jinx". 14 February 2019.
- ↑ "Twitter reacts after we qualify for the Playoffs after 7 years!". 30 April 2019.
- ↑ "IPL announces franchise owners". 24 January 2008. Retrieved 7 August 2019.
- ↑ "JSW Sports buys 50% stake in Delhi Daredevils". 9 March 2018. Retrieved 9 March 2018.
- ↑ "Delhi Daredevils renamed as Delhi Capitals". 4 December 2018.
- ↑ "Delhi Capitals IPL 2019: Retained, Released Players and Team News". 5 December 2018. Archived from the original on 6 డిసెంబరు 2018. Retrieved 27 జూన్ 2020.
- ↑ PTI (4 December 2018). "Delhi Daredevils is now Delhi Capitals". The Hindu. Retrieved 23 December 2018.