డీజే టిల్లు
డీజే టిల్లు | |
---|---|
దర్శకత్వం | విమల్‌కృష్ణ |
నిర్మాత | సూర్యదేవర నాగవంశీ |
తారాగణం | సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ |
ఛాయాగ్రహణం | సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థ | సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ |
విడుదల తేదీ | 2022 ఫిబ్రవరి 11 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
డీజే టిల్లు (ఆంగ్లం: DJ Tillu) 2022లో తెలుగులో విడుదలయిన ప్రేమకథ సినిమా.[1] పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు విమల్‌కృష్ణ దర్శకత్వం వహించాడు. సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి, ప్రిన్స్ సిసిల్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రా శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 14 జనవరి 2022న[2],[3] [4] విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడి[5]ఫిబ్రవరి 11న విడుదలైంది.[6] డీజే టిల్లు మార్చి 4 నుండి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[7]
కథ
[మార్చు]బాల గంగాధర్ తిలక్ ( సిద్దు జొన్నలగడ్డ) అలియాస్ డీజే టిల్లు మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు. తన తండ్రి కష్టపడి సంపాదించిన డబ్బులు పోగొట్టి చివరికి డీజే అవతారమెత్తి చుట్టూ పక్కల జరిగే చిన్న చిన్న ఫంక్షన్స్ లో డీజే వాయిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఒకసారి అనుకోకుండా క్లబ్‌లో రాధిక(నేహా శెట్టి)తో ప్రేమలో పడతాడు. అప్పటిదాకా సరదాగా, సాఫీగా సాగిపోయిన టిల్లు జీవితం రాధిక రాకతో ఊహించని మలుపులు తిరిగి ఒక హత్య కేసులో రాధికతో పాటు టిల్లు ఇరుక్కుంటాడు. ఆ హత్య చేయబడిన వ్యక్తి ఎవరు? అతనికి, రాధికకి మధ్య సంబంధం ఏంటి? ఈ హత్య కేసు నుంచి టిల్లు ఎలా బయటపడ్డాడు? అనేది మిగతా సినిమా కథ.[8][9]
నటీనటులు
[మార్చు]- సిద్ధు జొన్నలగడ్డ
- నేహా శెట్టి
- ప్రిన్స్ సిసిల్
- బ్రహ్మాజీ
- ప్రగతి
- ఐరేని మురళీధర్ గౌడ్
- ఫిష్ వెంకట్
- ప్రగతి
- కిరీటి దామరాజు
పాటల జాబితా
[మార్చు]- టిల్లు అన్నా డీ జే పెడితే , రామ్ మిరియాల , రచన: కాసర్ల శ్యామ్.
- పటాసు పిల్లా , అనిరుద్ రవిచందర్ , రచన: కిట్టు విస్సా ప్రగడ.
- నువ్వలా ,(మేల్ వాయిస్) సిద్దూ , రచన: రవికాంత్ పేరేపు .
- నువ్వలా (లేడీ వాయిస్) యామిని ఘంటసాల, రచన: రవికాంత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్
- నిర్మాత: సూర్యదేవర నాగవంశీ
- కథ: విమల్‌కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ
- స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విమల్‌కృష్ణ
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- నేపథ్య సంగీతం: తమన్
- సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు
- మాటలు: సిద్ధు జొన్నలగడ్డ
- ఎడిటర్: నవీన్ నూలి
- సహా నిర్మాత: ధీరజ్ మొగిలినేని
- ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కోళ్ల
మూలాలు
[మార్చు]- ↑ నమస్తే తెలంగాణ (1 January 2022). "డీజే టిల్లు ప్రేమకథ". Archived from the original on 2 జనవరి 2022. Retrieved 4 January 2022.
- ↑ NTV (1 January 2022). "'భీమ్లా నాయక్' కాదు వస్తోంది 'డిజె టిల్లు'!". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
- ↑ Sakshi (2 January 2022). "సంక్రాంతి బరిలో 'డిజె టిల్లు'". Archived from the original on 4 జనవరి 2022. Retrieved 4 January 2022.
- ↑ Andhrajyothy (10 January 2022). "సంక్రాంతి బరి నుండి తప్పుకున్న మరో చిత్రం". Archived from the original on 10 జనవరి 2022. Retrieved 10 January 2022.
- ↑ NTV (10 January 2022). "కరోనాతో వెనక్కి తగ్గిన 'డిజె టిల్లు'!". Archived from the original on 16 జనవరి 2022. Retrieved 16 January 2022.
- ↑ Sakshi (8 February 2022). "ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే కొత్త చిత్రాలివే." Archived from the original on 11 February 2022. Retrieved 13 February 2022.
- ↑ Eenadu (27 February 2022). "ఓటీటీలో'డీజే టిల్లు'.. స్ట్రీమింగ్ ఆ రోజు నుంచే". EENADU. Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.
- ↑ Eenadu (12 February 2022). "రివ్యూ: డీజే టిల్లు". Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
- ↑ V6 Velugu (12 February 2022). "రివ్యూ: డిజె టిల్లు" (in ఇంగ్లీష్). Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)