Jump to content

టీఎస్ ఐపాస్

వికీపీడియా నుండి
(టీఎస్ ఐపాస్‌ నుండి దారిమార్పు చెందింది)
టీఎస్ ఐపాస్‌
మేక్ ఇన్ తెలంగాణ లోగో
Dateజూన్ 12, 2015
Locationతెలంగాణ, భారతదేశం
Organised byముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం
Participantsప్రపంచవ్యాప్త వ్యాపార సంస్థలు
Websiteటీఎస్ ఐపాస్‌ అధికారిక వెబ్ సైట్

టీఎస్ ఐపాస్‌ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్/తెలంగాణ రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం)ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించింది. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులు ఆకర్షించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టింది. 2020 డిసెంబరు నాటికి తెలంగాణ రాష్ట్రంలో 13,804 కంపెనీలు దాదాపు రూ.2.24 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. ఈ అన్ని కంపెనీలలో దాదాపు 14.48 లక్షల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కలిపించబడ్డాయి.[1]

ప్రారంభం

[మార్చు]

తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్) ను 2015, జూన్ 12న హైదరాబాద్ లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆవిష్కరించారు. వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులు హాజరైన సదస్సులో మేక్ ఇన్ తెలంగాణ పేరిట రూపొందించిన ప్రత్యేక లోగో, ఇన్ఫోసిస్ సహకారంతో అభివృద్ధి చేసిన టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌ తోపాటు సోలార్ పవర్ పాలసీని కూడా ఆవిష్కరించారు.[2]

ఈ కార్య‌క్ర‌మానికి 2,500 మంది పారిశ్రామిక వేత్త‌లు, టాప్ 250 కంపెనీల ప్ర‌తినిధులు, అమెరికా, బ్రిటన్, టర్కీ, మలేషియాకు చెందిన రాయబారులు, బ్యాకర్లు, బీహెచ్‌ఈఎల్, మిథాని, బీడీఎల్, ఆర్థిక సంస్థల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ఏవీ ప్ర‌జెంటేష‌న్ ద్వారా హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌త్యేక‌త‌లు, మేక్ ఇన్ తెలంగాణ వంటి త‌దిత‌ర అంశాల‌ను వ‌చ్చిన అతిధుల‌కు వివ‌రించారు.

పరిశ్రమల ఏర్పాటు విధానం

[మార్చు]

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానంతో పరిశ్రమలకు వందశాతం కరప్షన్‌ ఫ్రీతో అనుమతులు ఇస్తారు. దీనికోసం టీఎస్ ఐపాస్ రూపకల్పనలో పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం 1.60 లక్షల ఎకరాల భూమిని సిద్ధం చేసి, పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్‌ను ప్రభుత్వమే సమకూర్చుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌ లైన్‌ లోనే దరఖాస్తులు స్వీకరించి, సీఎం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఛేజింగ్‌ సెల్ ద్వారా పరిశ్రమలకు అనుమతులపై మానిటరింగ్ నిర్వహించి, అనుమతుల కోసం కాలయాపన లేకుండా ప్లగ్ అండ్ ప్లే పద్ధతిన పారిశ్రామిక వాడల ఏర్పాటుచేసి, అయా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతినిస్తారు.[3]

రాష్ట్రంలోని హోటల్, రిసార్ట్‌లు, పర్యాటకం ఈవెంట్‌లు, ఇతర కార్యకలాపాల ఏర్పాటుకు వివిధ లైసెన్స్‌లు, క్లియరెన్స్‌ల జారీకి వేగవంతమైన ప్రాసెసింగ్‌ను సులభతరం చేయడంకోసం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టీఎస్ ఐపాస్ సేవను ప్రవేశపెట్టింది. దీనిద్వారా దరఖాస్తుదారులు ఆన్‌లైన్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా టీఎస్ ఐపాస్ పోర్టల్‌లో అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శాఖ దరఖాస్తును క్లియర్ చేయడంలో విఫలమైతే, ఆలస్యానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. 30 రోజుల తర్వాత, దరఖాస్తు ఆమోదించబడినట్లు పరిగణించబడుతుంది.[4]

నూతన పారిశ్రామిక విధానంలో ముఖ్యాంశాలు

[మార్చు]
  • సంస్థ స్థాపన, నిర్వహణ కోసం 23 విభాగాలు అందించిన సుమారు 40 రకాల ఆమోదాలు టీఎస్ ఐపాస్ పరిధిలోకి వస్తాయి.
  • పరిశ్రమల ఏర్పాటుకు లక్ష 60వేల ఎకరాల భూమి ఏర్పాటు
  • పరిశ్రమల వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి నియామకం
  • దరఖాస్తుదారులు సరైన పత్రాలను సమర్పించడానికి, ఆమోదాల ఆలస్యాన్ని నివారించడానికి ప్రతి దరఖాస్తును రాష్ట్ర, జిల్లా స్థాయిలో పరిశీలన
  • అన్ని పరిశ్రమలకు 24 గంటల విద్యుత్‌ సరఫరా
  • పరిశ్రమల ఏర్ఫాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ, రెండు వారాల్లోగా అనుమతుల జారీ
  • ముఖ్యమంత్రి కార్యాలయంలోనే ఛేజింగ్‌ సెల్‌
  • భూమి, నీరు, విద్యుత్‌, రహదారుల లాంటి మౌలిక సదుపాయాలతో రాష్టవ్య్రాప్తంగా విస్తరించిన 6 పారిశ్రామిక వాడలు, 28 సెజ్‌లు
  • తెలంగాణ డ్రింకింగ్‌ వాటర్‌ సఫ్లై ప్రాక్టుల నుంచి పరిశ్రమలకు 10శాతం నీటిని సరఫరా చేయడం[3]
  • ఏదైనా క్లియరెన్స్ పొందడంలో ఆలస్యం కావడానికి గల కారణాలను దరఖాస్తుదారుడు విచారించవచ్చు, దానికి బాధ్యులైన కార్యాలయానికి జరిమానా విధించవచ్చు.

గుర్తింపులు

[మార్చు]
  • తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్-ఐపాస్ దేశంలోనే అత్యుత్తమమైనదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్మన్ సీకే రంగనాథన్ అన్నాడు.[5]

ఫలితాలు

[మార్చు]

టీఎస్ ఐపాస్‌ ప్రారంభించిన 15 నెలల కాలంలో రాష్ట్రానికి 44,539 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఈ విధానం కింద ఎనిమిది విడతల్లో 2533 పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులనిచ్చింది. ఈ పరిశ్రమ 1.60 లక్షల మందికి ఉపాధి లభించనుంది.[6] 2018 నాటికి టీఎస్ ఐపాస్ కింద 8,419 పరిశ్రమలకు అనుమతులు జారీ చేయగా, 8.58 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.[7]

2022 మే నెల వరకు టీఎస్‌ఐపాస్‌ ద్వారా 19వేల కేసులను పరిష్కరించబడ్డాయి. 35 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల (భారత కరెన్సీలో సుమారు రూ. 2.71లక్షల కోట్ల) పెట్టుబడులు రాగా, 16 లక్షల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించబడింది.[8]

అవార్డులు

[మార్చు]

పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల సంఖ్య ఆధారంగా అత్యుత్తమ పురోగతి కనబర్చిన జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించి 2019, డిపెంబరు 4న అవార్డులు అందజేయబడ్డాయి. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో రాష్ట్ర పరిశ్రమలు, కామర్స్‌ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్‌ ఐపాస్‌ ఐదవ వార్షికోత్సవ వేడుకల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌, రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి సి.హెచ్. మల్లారెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ తదితరులు అవార్డులను ప్రదానం చేశారు.

  1. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా: 6,083 అనుమతుల కోసం 3,124 మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకోగా, 5,068 దరఖాస్తులకు అనుమతులు ఇచ్చారు. కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లాలో రూ.23,290 కోట్ల పెట్టుబడులతో దాదాపు 2,983 కొత్త పరిశ్రమలు ఏర్పాటై రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.[9]
  2. మహబూబాబాదు జిల్లా: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 241 మంది చేసుకోగా 223 మందికి 456 కోట్ల రూపాయలతో పెట్టుబడితో పరిశ్రమలు స్థాపనకు మంజూరు చేసి 92.58 శాతంతో 2136 మందికి ఉపాధి కల్పించి మహబూబాద్ జిల్లా రెండో స్థానం కైవసం చేసుకున్నది.
  3. రంగారెడ్డి జిల్లా: ఈ జిల్లా మూడోస్థానంలో నిలిచింది.[10]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "TS-iPASS advantage for industries". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-12-03. Archived from the original on 2020-12-03. Retrieved 2021-11-23.
  2. సాక్షి. "తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ". Retrieved 21 December 2016.
  3. 3.0 3.1 సూర్య. "అవినీతి రహిత పాలన". Retrieved 21 December 2016.[permanent dead link]
  4. India, The Hans (2020-12-13). "TS tourism sector in for a boost". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2020-12-12. Retrieved 2021-11-23.
  5. "TS-iPass one of the best in country: CII". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-10-27. Archived from the original on 2021-10-27. Retrieved 2021-11-23.
  6. నమస్తే తెలంగాణ, TELANGANA NEWS. "టీఎస్ ఐపాస్ సరికొత్త రికార్డు." www.namasthetelangaana.com. Archived from the original on 19 October 2016. Retrieved 21 December 2016.
  7. "టీఎస్‌ ఐపాస్‌‌తో 8.58 లక్షల ఉద్యోగాలు". Samayam Telugu. 2019-02-22. Archived from the original on 2021-05-21. Retrieved 2021-11-23.
  8. telugu, NT News (2022-05-31). "శభాష్‌.. ఐపాస్‌". Namasthe Telangana. Archived from the original on 2022-05-31. Retrieved 2022-05-31.
  9. India, The Hans (2019-12-05). "Collector MV Reddy receives iPass award from KTR". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.
  10. "టీఎస్‌–ఐపాస్‌ పురస్కారం అందుకున్న ఇన్‌చార్జి కలెక్టర్‌". Sakshi. 2019-12-05. Archived from the original on 2020-11-25. Retrieved 2021-11-23.