జోలెపాళ్యం మంగమ్మ
![](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/a/a6/J_Mangamma.jpg/200px-J_Mangamma.jpg)
జోలెపాళ్యం మంగమ్మ ఆల్ ఇండియా రేడియోలో మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్‌గా ప్రసిద్ధురాలు.
జీవిత విశేషాలు
[మార్చు]ఈమె చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1925, సెప్టెంబరు 12న జన్మించింది. ఎం.ఎ., బి.ఎడ్ చదివింది. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టాను పొందింది. ఈమెకు తెలుగు, ఇంగ్లీషు, ఫ్రెంచ్, ఎస్పరాంటో, తమిళ, హిందీ భాషలలో ప్రావీణ్యం ఉంది. ఈమె ఆలిండియా రేడియో న్యూఢిల్లీలో 10 సంవత్సరాలు ఎడిటర్‌గా, న్యూస్ రీడర్‌గా పనిచేసింది. 1962 నుండి నేషనల్ ఆర్కీవ్స్, ఢిల్లీలో పరిశోధనలు చేసింది. బోధనా రంగంలో సుమారు పాతిక సంవత్సరాల అనుభవం సంపాదించింది. ఈమె కేంద్ర సమాచారశాఖ, విదేశాంగశాఖలలో కీలకమైన పదవులను నిర్వహించింది. ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మొదలైన సంస్థలలో జీవిత సభ్యురాలు. ఇంకా ఈమె అనిబీసెంట్ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఉపాధ్యక్షురాలిగా, గాంధీ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవల్‌పమెంట్ అధ్యక్షురాలిగా, లోక్‌అదాలత్‌లో సభ్యురాలిగా వివిధ హోదాల్లో సేవలను అందించింది. ఈమె ఇంగ్లీషు, తెలుగు భాషలలో పలు పుస్తకాలను రచించింది. న్యూఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం, సిద్ధార్థ కళాపీఠం (విజయవాడ) విశిష్ట అవార్డు మొదలైన సత్కారాలను పొందింది. సరోజినీ నాయుడు అనుయాయిగా ఈమె పేరుగడించింది[1]. ఆంధ్రానైటింగేల్ అనే బిరుదును సంపాదించింది.
రచనలు
[మార్చు]తెలుగు
[మార్చు]- తెలుగులో అచ్చయిన తొలి పుస్తకాలు (1746-1856)
- ఆంధ్రదేశంలో క్రైస్తవ మిషనరీల సేవ
- ఇండియన్ పార్లమెంట్
- శ్రీ అరబిందో
- విప్లవవీరుడు అల్లూరిసీతారామరాజు
- అనిబీసెంట్
ఇంగ్లీషు
[మార్చు]- ప్రింటింగ్ ఇండియా
- అల్లూరి సీతారామరాజు
- లాస్ట్ పాలెగార్ ఎన్‌కౌంటర్ విత్ ది బ్రిటిష్ ఇన్ ది సీడెడ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 1846-1847
- ది రేట్ స్కూల్స్ ఆఫ్ గోదావరి
మరణం
[మార్చు]ఈమె మదనపల్లెలోని తన స్వగృహంలో 2017, ఫిబ్రవరి 1వ తేదీన తన 92వ యేట వృద్ధాప్య సమస్యలతో మరణించింది[2].
మూలాలు
[మార్చు]- ↑ "వరల్డ్ హెరిటేజ్ ఎన్‌సైక్లోపీడియాలో MADANAPALLI అనే వ్యాసం నుండి". Archived from the original on 2017-02-06. Retrieved 2017-02-01.
- ↑ "తొలి తెలుగు మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ కన్నుమూత". Archived from the original on 2017-02-02. Retrieved 2017-02-02.
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- 1925 జననాలు
- 2017 మరణాలు
- ఆంగ్ల రచయితలు
- తెలుగు రచయిత్రులు
- రేడియో ప్రముఖులు
- చిత్తూరు జిల్లా ఆకాశవాణి ఉద్యోగులు
- చిత్తూరు జిల్లా రచయిత్రులు
- తెలుగువారిలో ఇంగ్లీషు రచయితలు