Jump to content

గడ్డం నర్సింహారెడ్డి

వికీపీడియా నుండి
(జి.నరసింహారెడ్డి నుండి దారిమార్పు చెందింది)
గడ్డం నరసింహారెడ్డి
గడ్డం నర్సింహారెడ్డి


పార్లమెంట్ సభ్యుడు, 7వ లోక్‌సభ
పదవీ కాలం
జనవరి 1980 – డిసెంబరు 1984
ముందు గడ్డం నరసింహారెడ్డి
తరువాత సి.మాధవరెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాదు

పార్లమెంట్ సభ్యుడు, 6వ లోక్‌సభ
పదవీ కాలం
మార్చి 1977 – ఆగస్టు 1979
ముందు పొద్దుటూరి గంగారెడ్డి
తరువాత గడ్డం నరసింహారెడ్డి
నియోజకవర్గం ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1936-04-14)1936 ఏప్రిల్ 14
జక్రాన్‌పల్లె, నిజామాబాదు జిల్లా, తెలంగాణ
మరణం 2014 మార్చి 15(2014-03-15) (వయసు 77)
హైదరాబాదు
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ (ఐ)
తల్లిదండ్రులు గంగారెడ్డి
జీవిత భాగస్వామి చందన
బంధువులు జి. గంగారెడ్డి
సంతానం ముగ్గురు కుమారులు, ఒక కూతురు
పూర్వ విద్యార్థి నౌరోస్జీ వాడియా కళాశాల & నిజాం కళాశాల
వృత్తి వ్యవసాయదారుడు, వ్యాపారవేత్త & రాజకీయ నాయకుడు

గడ్డం నరసింహారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెసు తరపున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి 1977-1980, 1980-84లలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2][3][4]

జననం, విద్య

[మార్చు]

నరపింహారెడ్డి 1936 ఏప్రిల్ 14న తెలంగాణ రాష్ట్రం నిజామాబాదు జిల్లా లోని జక్రాన్‌పల్లెలో జన్మించాడు. తండ్రి పేరు గంగారెడ్డి.[5] నరసింహారెడ్డి విద్యాభ్యాసం పూణేలోని ఎస్.ఎస్.పి.ఎం పాఠశాల, వాడియా కళాశాల, హైదరాబాదులోని నిజాం కళాశాలలలో జరిగింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

నరసింహారెడ్డికి 1957, ఫిబ్రవరి 09న చందనతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. ఈయన పెద్ద కుమారుడు అరవింద్‌రెడ్డి తండ్రి రాజకీయ వారసునిగా 2002 రాజకీయాల్లో ప్రవేశించి తెరాస పార్టీ తరఫున మంచిర్యాల నుండి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. మిగిలిన ఇద్దరు కుమారులు, గంగారెడ్డి, అచ్యుత్‌రెడ్డి వ్యాపారం రంగంలో స్థిరపడ్డారు. ఈయన కూతురు అనురాధ.

రాజకీయ జీవితం

[మార్చు]

నరసింహారెడ్డి 1961-1971 వరకు మంచిర్యాల పురపాలక సంఘం ఛైర్మన్ గా పనిచేశాడు. ఆ తరువాత 1970 నుండి 1976 వరకు అదిలాబాదు జిల్లా పరిషత్ అధ్యక్షునిగా పనిచేశాడు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న ఐదేళ్లలో విద్యాలయాల అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. మంచిర్యాలలోని జిల్లా పరిషత్ బాలుర, బాలికల పాఠశాల భవనాలు ఆయన హయాంలోనే నిర్మించబడ్డాయి. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి పట్టణ నడిబొడ్డులోని విలువైన సొంత స్థలాన్ని ఇచ్చి తన తండ్రి గంగారెడ్డి స్మారక ఆస్పత్రిగా నామకరణం చేశారు.

1977లో కాంగ్రెసు పార్టీ తరఫున ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికై 6వ, 7వ లోక్‌సభలో ఆదిలాబాదుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ సమయంలోనే పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ సభ్యునిగా వ్యవహరించాడు.

క్రమసంఖ్య నుండి వరకు స్థానం వివరాలు
01 1977 1979 సభ్యుడు, 6వ లోక్‌సభ పార్టీని కాంగ్రెస్ అని పిలిచేవారు
02 1980 1984 సభ్యుడు, 7వ లోక్‌సభ పార్టీ పేరును కాంగ్రెస్ (ఐ) గా మార్చారు.

ఇతరములు

[మార్చు]
  • వృత్తి రీత్యా వ్యవసాయదారుడు, వ్యాపారవేత్త.[6] కొన్నాళ్ళు తునికాకు కాంట్రాక్టర్‌గా కూడా పనిచేశాడు. నరసింహారెడ్డి సికింద్రాబాద్ క్లబ్, సికింద్రాబాద్, ఫుట్ బాల్ క్లబ్, హైదరాబాద్ లలో సభ్యుడిగా ఉన్నాడు.
  • 1970లో నేత్ర శిబిరాన్ని నిర్వహించాడు.
  • మంచిర్యాల, బెల్లంపల్లి గ్రామాలలో కళాశాల, ఆస్పత్రుల భవనాలు కోసం విరాళాలు సేకరించాడు.
  • పార్లమెంటు సభ్యునిగా మలేసియా, సింగపూర్, థాయిలాండ్, జపాన్ మొదలైన దేశాలు పర్యటించాడు.

మరణం

[మార్చు]

నరసింహారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ 2014, మార్చి 15న హైదరాబాదులోని స్వగృహంలో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 April 2020. Retrieved 18 April 2020.
  2. "Member Profile". Lok Sabha website. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 21 January 2014.
  3. "Election Results 1977" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
  4. "Election Results 1980" (PDF). Election Commission of India. Retrieved 21 January 2014.
  5. "లోక్‌సభ జాలగూడు". Archived from the original on 2014-02-02. Retrieved 2014-01-25.
  6. "Member Profile". Lok Sabha website. Archived from the original on 2 ఫిబ్రవరి 2014. Retrieved 21 January 2014.