ఘటికాచల మహాత్మ్యము
ఘటికాచల మహాత్మ్యము తెనాలి రామలింగడు రచించిన ప్రబంధ కావ్యము. ఇది మూడు ఆశ్వాసాల ప్రబంధము. ఈ గ్రంథములో మొత్తము 475 గద్య పద్యాలు ఉన్నాయి. బహుశా ఇది తెనాలి చివరి రచన అయి ఉండవచ్చు. ఈ కావ్యాన్ని రామకృష్ణుడు మహారాష్ట్రీయుడైన ఖండోజీకి అంకితమిచ్చాడు. ఘటికాచలము నేటి తమిళనాడులో ఉన్న చోళంగి పురము (షోలింగూరు). ఇది 108 దివ్య తిరుపతులలో ఒక్కటి. ఇక్కడి దైవము లక్ష్మీ నరసింహస్వామి.
కథ
[మార్చు]- మొదటి ఆశ్వాసం
అయోధ్యకు ప్రభువగు ధవళాంగుడు శాపముచే కిరాత రూపమును పొంది వశిష్ఠ మహర్షిని దర్శించుకొని శాపవిముక్తుడయ్యెను.
- రెండవ ఆశ్వాసం
హరిశర్మ అను బ్రాహ్మణుడు, తరళయను పరిచారికను కామింపగా ఒక పుత్రుడు జన్మించెను. అతడు కౌండిన్యుని సేవించి, విష్ణుమంత్రమును ఉపదేశముగా పొంది ఘటికాచలమున ఘోర తపస్సు చేసి తరువాత జన్మలో బ్రహ్మ కుమారునిగా జన్మించి నారదునిగా ప్రసిద్ధి చెందెను.
- మూడవ ఆశ్వాసం
సప్తఋషులు శతశృంగమున విష్ణువును గూర్చి తపస్సు చేయగా ఇంద్రుడు తపోభంగమునకు విఫలయత్నం చేసెను. సప్త ఋషులతో అశరీరవాణి ఘటికాచలమునకు పోయినచో తపస్సు సఫలమౌనని పలికెను. సప్తర్షులు పుణ్యక్షేత్ర దర్శణము చేయుచు జగన్నాథము, శ్రీకాకుళము, కృష్ణా తీరము, శేష శైలము, కాంచీపురం దర్శించి ఘటికాచలము చేరి తపస్సు చేసిరి. వారికి నరసింహుడు ఉగ్రరూపమున ప్రత్యక్షమయ్యెను. వారిని వరములు కోరుకోమనగా జీవులకు భక్తి, జ్ఞాన, వైరాగ్యములనొసగు శక్తిని ఘటికాచలమునకు కలిగించమని కోరారు.
బయటి లింకులు
[మార్చు]మూలములు
[మార్చు]- తెనాలి రామకృష్ణకవి - ఆచార్య ఎక్కిరాల కృష్ణమాచార్య (ప్రచురణ: వరల్డ్ టీచర్స్ ట్రస్ట్, 1975) పేజీ.8,9