గురు అంగద్ దేవ్

వికీపీడియా నుండి
(గురు అంగద్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
గురు అంగద్
భాయ్ బాలా, భాయ్ మర్దానా, ఇతర సిక్కు గురువులతో గురు నానక్
భాయ్ బాలా, భాయ్ మర్దానా, ఇతర సిక్కు గురువులతో గురు నానక్
జననం
భాయ్ లెహ్నా

march 31, 1504 (1504-03-31)
మత్తె డి సరై, ముక్త్‌సర్, పంజాబ్, భారతదేశం
మరణంMarch 28, 1552 (1552-03-29) (aged 47)
ఖదుర్ సాహిబ్, భారతదేశం
ఇతర పేర్లురెండవ గురువు
క్రియాశీల సంవత్సరాలు1539–1552
సుపరిచితుడు/
సుపరిచితురాలు
గురుముఖి లిపిని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు
అంతకు ముందు వారుగురు నానక్
తరువాతివారుగురు అమర్ దాస్
జీవిత భాగస్వామిమాతా ఖివి
పిల్లలుబాబా దాసు, బాబా దత్తు, బీబీ అమ్రో, బీబీ ఆంఖి
తల్లిదండ్రులుమాతా సభరీ (దయా కౌర్), బాబా ఫెరుమల్

గురు అంగద్ (పంజాబీలో ਗੁਰੂ ਅੰਗਦ); 31 March 1504 – 28 March 1552) పదిమంది సిక్ఖు గురువుల్లో రెండవ వారు. 1504 మార్చి 31న నేటి పంజాబ్ రాష్ట్రంలోని ముక్త్‌సర్ జిల్లాలోని సరేనగ గ్రామంలో జన్మించారు. ఆయన హిందూ కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు లెహ్నా అనే పేరుతో ఆయన నామకరణం చేశారు. ఆయన తండ్రి ఫెరు మల్ చిన్న వర్తకుడు, తల్లి మాతా రామో (ఆమెనే మాతా సభిరాయ్, మనసా దేవీ, దియా కౌర్ అనీ అంటూంటారు). గురు అంగద్‌కు బాబా నారాయణ్ దాస్ ట్రెహన్ తాతయ్య.

1538లో సిక్ఖు గురువుగా తన వారసత్వాన్ని అందించేందుకు గురునానక్ తన శిష్యుడు లెహ్నాని ఎంచుకున్నారు.[1] ఈ సందర్భంగా లెహ్నా పేరును అంగద్‌గా మార్చి, గురు అంగద్‌ను చేశారు. అలా సిక్ఖులకు రెండవ గురువుగా చరిత్రకెక్కారు. తొలి సిక్ఖుగురువు ప్రారంభించిన పనులను కొనసాగించారు.

గురు అంగద్ మాతా ఖివీని 1520 జనవరిలో వివాహం చేసుకున్నారు. వారికి దాసు, దాటు అనే ఇద్దరు కుమారులు, అమ్రో, అనొఖి అనే కూతుళ్ళు జన్మించారు. బాబర్ సైన్యాలు దాడిచేస్తాయనే భయంతో మొత్తం కుటుంబమంతా వారి స్వగ్రామాన్ని విడిచిపెట్టి వలస వెళ్ళారు. సిక్ఖుల పవిత్ర స్థలమైన అమృత్‌సర్ నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో బియాస్ నది వద్ద ఖదుర్ సాహిబ్ గ్రామంలో వారు స్థిరపడ్డారు.

గురు నానక్ పట్ల భక్తి, సేవాతత్పరత

[మార్చు]

ఒకరోజు భాయ్ లెహ్నా తన పక్కింటివారు, గురునానక్ పట్ల భక్తికలవారు ఐన భాయ్ జోధా నోటివెంట గురు నానక్ చెప్పిన కవితాపాదాలు విన్నారు. ఆ గీతం లెహ్నా హృదయంలో నిలిచిపోవడం వల్ల ప్రతిఏటా వెళ్ళే పవిత్ర జ్వాలాముఖి ఆలయానికి వెళ్ళే బృందంలోని తోటివారిని కోరి గురు నానక్‌ వద్దకు వెళ్ళేందుకు కోరారు. ఈ ప్రతిపాదనను అందరూ వ్యతిరేకించారు. పైగా మార్గదర్శి, నాయకునిగా ఉన్న లెహ్నా బాధ్యతలను ఎవరూ స్వీకరించేందుకు ముందుకు రాకపోవడంతో, దొంగలమయమైన ఆ ప్రాంతంలో వారందరినీ అలా వదిలివెళ్ళలేకపోయాడు. గురునానక్ పదాలు, కీర్తనలు వాటిలోని ధర్మాలు అతని ఆలోచనలను వదిలిపెట్టలేదు. దాంతో ఒకరోజు రాత్రి ఎవరికీ చెప్పకుండా తన అశ్వాన్ని అధిరోహించి, గురునానక్‌ను కలిసేందుకు నేటి కర్తర్‌పూర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) కు బయలుదేరి వెళ్ళాడు. అక్కడ గురువు ఆజ్ఞలను అనుసరించి పొలాల్లో పనిచేస్తున్న పనిచేస్తున్న ఎందరో ప్రజలను చూశాడు. సాధారణమైన పనివాడిలా ఆ పొలాల్లో కష్టపడుతున్న గురు నానక్‌ను భాయ్ లెహ్నా గుర్తుపట్టలేకపోయాడు. గురు నానక్‌ను చూపించమని గురు నానక్‌నే అడిగాడు. Nanak agreed and took the saddle strings of the horse while Bhai Lehna sat upon the horse comfortably. After some time the Guru reached his home and told Bhai Lehna to sit down whilst he went to get the Guru; when the Guru returned, this time after freshening up, Bhai Lehna realized instantly what a huge mistake he had made. He had several thoughts going through his head about what a huge sin he had committed by making the Guru pull him and his horse home whilst he sat upon the horse comfortably. His face at once dropped and Guru smiled, he asked what is your name, Bhai replied 'Bhai Lehna'. The Guru then replied: 'don't worry when someone comes to take something they would come as you have' (as Lehna means to take something) 'if you give me the strings of your mind as you did with the horse saddles and let me direct you, you will be amazed... '

మూలాలు

[మార్చు]
  1. Shackle, Christopher; Mandair,, Arvind-Pal Singh (2005). Teachings of the Sikh Gurus: Selections from the Sikh Scriptures. United Kingdom: Routledge. pp. xiii–xiv. ISBN 0-415-26604-1.{{cite book}}: CS1 maint: extra punctuation (link)