Jump to content

సాము

వికీపీడియా నుండి
(గరిడి నుండి దారిమార్పు చెందింది)
టేకు కర్ర ఉపయోగించి కర్రసాము చేస్తున్న ఒక వ్యక్తి

కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని కాలంలో కాలి నడకన ప్రయాణించే బాటసారులను దోపిడీ దొంగలు దోచుకొనేవారు. దొంగతనాలను నివారించటానికి, క్రూర మృగాల నుండి తమను తాము కాపాడుకోవటానికి అప్పట్లో కర్రసాముని వినియోగించేవారు. ఇలా రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది.

భాషా విశేషాలు

[మార్చు]

గరిడి [ gariḍi ] or గరిడీ gariḍi. తెలుగు n. Fencing, sword play. సాము. A dancing school, a fencing school. సాముకూటము. గరడీల సాము, or గరిడీవిద్య sword play, gymnastics. A place చోటు. Nearness. సమీపము, చెంత. గరిడిముచ్చు a rogue who pretends to be a good man. మంచివానివలె దగ్గిర నుండి సమయము చూచి దొంగిలించే దొంగ. (కళా. ii.)

ఉత్సవాలలో, జాతరలలో కర్ర సాము లేదా సాము గారడీ ఆత్మ రక్షణకై వినియోగించబడే ఒక పురాతనమైన కళ. పూర్వం గ్రామ సంరక్షణార్థం యువకులకి ఈ కళలో శిక్షణ ఇచ్చేవారు రక్షణా సాధనంగా కనుగొనబడిన ఈ కళ తర్వాత ఆ అవసరం లేకపోవటంతో ఇది కళగానే మిగిలిపోయింది ఆ కలను యువత ముందుకు తీసుకొచ్చి వందల మందికి శిక్షణ ఇస్తూ అందులో ఎన్నో కొత్త మెలకువలను నేర్పిస్తున్న అడబాల మణికంఠ కు అభివందనం

పెళ్ళి ఊరేగింపులకి, పండుగలకి, ఉత్సవాలకి కర్రసాము ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పెళ్ళి ఊరేగింపు లలో బహుమార్గ కూడళ్ళు రాగానే అనుభవజ్నులైన వారు ముందుకు వచ్చి అందరి దృష్టి ఆకర్షించేలా గారడీ చేసేవారు. విజయనగరం జిల్లాలో ఇంకనూ ఈ కళ అభ్యసించబడుతోంది. వ్యక్తిగత ప్రతిభను కనబర్చే ప్రక్రియతో గారడీ ప్రారంభం అవుతుంది. ఉత్తరాంధ్రలో వీటికి నేపథ్యంగా తషా, బిగులు లని వాడతారు.

చేసే విధానం

[మార్చు]

ఒక యోధుడు వచ్చి పలు ఇతర యోధులతో తలపడుతున్నట్లు అభినయం చేస్తూ కర్రను మధ్యలో పట్టుకుని వివిధ దిక్కులలో తిప్పుతాడు. ఒక్కోసారి ఇతర యోధులు కూడా తమ ప్రతిభను కనబరుస్తారు. ఆత్మ రక్షణే కాక శత్రువులను ఎలా కట్టడి చెయ్యాలో కూడా ఇందులో చూపుతుంటారు.

ఉపయోగాలు

[మార్చు]

దీనిని ఆరోగ్యపరంగా అభ్యసించేవారూ ఉన్నారు. మదుమేహం అదుపులో ఉండేటందుకు దీనిని మంచి వ్యాయామంగా చెపుతారు.

మూలాలు

[మార్చు]

సాముగారడి పరిచయం

"https://te.wikipedia.org/w/index.php?title=సాము&oldid=3892864" నుండి వెలికితీశారు