Jump to content

క్లాస్‌మేట్స్

వికీపీడియా నుండి
(క్లాస్ మేట్స్ నుండి దారిమార్పు చెందింది)
క్లాస్‌మేట్స్‌
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం విజయ భాస్కర్
నిర్మాణం రవికిశోర్‌
కథ జేమ్స్ ఆల్బర్ట్
చిత్రానువాదం విజయ భాస్కర్‌
తారాగణం సుమంత్‌,సదా, కమలినీ ముఖర్జీ, శర్వానంద్‌, సునీల్‌, రవివర్మ, తనికెళ్ల భరణి, గిరిబాబు, వేమూరి సత్యనారాయణ, సుధ
సంగీతం కోటి
సంభాషణలు అబ్బూరి రవి
ఛాయాగ్రహణం అనుమోలు హరి
కళ పేకేటి రంగా
కూర్పు శ్రీకర్ ప్రసాద్
నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్‌
విడుదల తేదీ 20 ఏప్రిల్, 2007
భాష తెలుగు

క్లాస్ మేట్స్ 2007 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమా.

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

ఒకే కాలేజీలో... ఓ బ్యాచ్‌ విద్యార్థులంతా పదేళ్ల తర్వాత మళ్లీ కలుసుకుంటారు. రవికుమార్‌ (సుమంత్‌), రాజేశ్వరి (సదా) ఆ బృందంలో ఉంటారు. అప్పటి క్లాస్‌మేట్స్‌ కాలేజీ రోజుల్లోకి వెళ్లి... నాటి చిలిపి పనులు... ఎన్నికల హంగామా... సరదాగా రాసుకున్న ప్రేమ లేఖలు... ప్రిన్సిపాల్‌ హెచ్చరికలూ... ఒక్కోటీ గుర్తు చేసుకుంటారు. కాలేజీ గడప దాటేశాక వామపక్ష భావాలతో ఉన్న విద్యార్థి కాస్తా వ్యాపారవేత్తగా స్థిరపడటం... ఓ యువకుడు రాజకీయ నాయకుడిగా మారడం... జరుగుతుంది. వాళ్లంతా కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఓ రహస్యం బయటపడుతుంది.

పాటలు

[మార్చు]
  • గుండె చాటుగా ఇన్ని నాల్లుగా , వేదాల హేమ చంద్ర
  • భూగోళంతో బంతాట ఆడాలంటుంది మన పాదం, వేదాల హేమ చంద్ర, సందీప్ కౌసల్య
  • నరనరాల్లో ఉత్సాహం ఉరకలే యువతరం, టిప్పు
  • మౌనమెందుకు మాటాడవెందుకు దూరమెందుకు దరిచేరవెందుకు, మల్లికార్జున్, అంజనా సౌమ్య
  • గుండె చాటుగా , (ఫిమేల్ వాయిస్), చిత్ర, అంబడిపూడి .