కాలీఫ్లవరు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కాలీఫ్లవరు |
---|
Species |
బ్రసికా ఒలెరాసియా |
Cultivar group |
Botrytis Group |
Origin |
(తెలియదు) |
Cultivar Group members |
చాలా ఉన్నాయి. |
Nutritional value per 100 గ్రా. (3.5 oz) | |
---|---|
శక్తి | 103 కి.J (25 kcal) |
5 g | |
చక్కెరలు | 2.4 g |
పీచు పదార్థం | 2.5 g |
0 g | |
2 g | |
విటమిన్లు | Quantity %DV† |
థయామిన్ (B1) | 5% 0.057 mg |
రైబోఫ్లావిన్ (B2) | 5% 0.063 mg |
నియాసిన్ (B3) | 4% 0.53 mg |
పాంటోథెనిక్ ఆమ్లం (B5) | 13% 0.65 mg |
విటమిన్ బి6 | 17% 0.22 mg |
ఫోలేట్ (B9) | 14% 57 μg |
విటమిన్ సి | 55% 46 mg |
ఖనిజములు | Quantity %DV† |
కాల్షియం | 2% 22 mg |
ఇనుము | 3% 0.44 mg |
మెగ్నీషియం | 4% 15 mg |
ఫాస్ఫరస్ | 6% 44 mg |
పొటాషియం | 6% 300 mg |
జింక్ | 3% 0.28 mg |
| |
†Percentages are roughly approximated using US recommendations for adults. Source: USDA Nutrient Database |
కాలీఫ్లవరు (cauliflower) ని తెలుగులో కోస పువ్వు లేదా క్యాబేజి పువ్వు అని అంటారు అనీ, మట్టకోసు అనీ అంటారు. కాలీఫ్లవరు, బ్రొక్కొలి (broccoli) రెండూ బ్రాసికేసి (Brassicaceae) కుటుంబం (family) మొక్కల నుండి లభించే కూరగాయలు; కాలీఫ్లవరు పువ్వులు తెల్లగా ఉంటాయి, బ్రాకలీ పువ్వులు ఆకుపచ్చగా ఉంటాయి. కాలీఫ్లవర్ ని బ్రసికా ఒలెరాసియా (Brassica oleracea) అంటారు. కాలీఫ్లవరు ఏటేటా పెరిగే మొక్క (annual). విత్తనాలు వేసి పెంచుతారు. తెల్లగా ఉన్న పువ్వు భాగాన్నే తింటారు; కాండాన్నీ, చుట్టూ ఉన్న ఆకుపచ్చని రెమ్మలనీ తినరు. పోషక పదార్ధాలు దండిగా ఉన్న కూరగాయ ఇది. దీనిని పచ్చిగాను, ఉడకబెట్టుకుని, ఊరుగాయ రూపంలోనూ తింటారు. కేబేజీ, కాలీఫ్లవరు ఒకే కుటుంబం కాకపోయినా ఒక జాతి మొక్కలే.
కాలీఫ్లవరు ఎల్లప్పుడూ తెల్లగా ఉండాలన్న నియమం ఏమీ లేదు. కొన్ని సంకర జాతి పువ్వులు నారింజ రంగు లోనూ, కొన్ని బచ్చలిపండు రంగులోనూ కూడా దొరుకుతున్నాయి. ఈ రంగు ఫువ్వులలో తెల్ల వాటిలో కంటే పోషక పదార్ధాలు 25 శాతం ఎక్కువ ఉన్నాయిట. ఆంథోసయనిన్ (anthocyanin) అనే రసాయనం బచ్చలి రంగు కాలీఫ్లవరుకీ, ఎర్ర కేబేజీకీ, ఎర్ర ద్రాక్ష సారా ఆ రంగుని ఇస్తుంది. ఈ రసాయనం ఏంటీఆక్సిడెంటు (antioxident) కోవకి చెందటం వలన ఇది శరీరానికి మంచి చేస్తుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
కాలీఫ్లవరులో కర్బనోదకాలు (carbohydrates) లేదా పిండి పదార్ధాలు (starches) తక్కువ కనుక బంగాళాదుంప తినటానికి వీలులేని సమయాలలో దాని స్థానే దీనిని తినవచ్చు.
సూచనలు
[మార్చు]- వీటిలో ఎక్కువగా తెల్లటి పురుగులు ఉంటాయి. ఫంగస్ లేని గట్టి క్యాలిఫ్లవరు చూసి కొనవలెను. క్యాలిఫ్లవరు విరిగిపోయి ఉంటే పండినదని అర్దము, పండినవి రుచిగా ఉండవు