కేసరి (మరాఠీ వార్తాపత్రిక)
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
![]() | |
![]() | |
రకం | దినపత్రిక |
---|---|
రూపం తీరు | ప్రింట్, ఆన్‌లైన్ |
యాజమాన్యం | కేసరి మరాఠా ట్రస్ట్ |
వ్యవస్థాపకులు | బాల గంగాధర్ తిలక్ |
ప్రచురణకర్త | కేసరి మరాఠా ట్రస్ట్ |
స్థాపించినది | 4 January 1881 |
రాజకీయత మొగ్గు | సెంటర్-రైట్ రాజకీయాలు |
భాష | మరాఠీ |


కేసరి అనేది ఒక మరాఠీ వార్తాపత్రిక. 1881, జనవరి 4న భారత స్వాతంత్ర్య ఉద్యమ ప్రముఖ నాయకుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఈ పత్రికను స్థాపించాడు. ఈ వార్తాపత్రిక భారత జాతీయ స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతినిధిగా ఉపయోగించబడింది. కేసరి మరాఠా ట్రస్ట్, తిలక్ వారసులు దీనిని ప్రచురిస్తున్నారు.[1][2][3]
బాల గంగాధర్ తిలక్ తన రెండు వార్తాపత్రికలు కేసరిని మరాఠీలో, మహరత్తా (కేసరి-మరాఠా ట్రస్ట్ ద్వారా నడపబడుతోంది)[4] ఆంగ్లంలో కేసరి వాడ, నారాయణ్ పేట, పూణే నుండి నడిపేవారు. ఈ వార్తాపత్రికలను మొదట చిప్లుంకర్, అగార్కర్, తిలక్ సహకారంతో ప్రారంభించారు.
ప్రారంభ సంవత్సరాలు, సంపాదకులు, రచయితలు
[మార్చు]కేసరి సంపాదకులలో అగార్కర్ (దాని మొదటి సంపాదకుడు), చిప్లుంకర్, తిలక్ వంటి అనేక మంది స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్తలు/సంస్కర్తలు ఉన్నారు. 1887లో అగార్కర్ కేసరిని విడిచిపెట్టి తన సొంత వార్తాపత్రిక సుధారక్ (ది రిఫార్మర్)ను ప్రారంభించాడు, ఆ తర్వాత తిలక్ ఆ పత్రికను స్వయంగా నిర్వహించడం కొనసాగించాడు. తిలక్ సన్నిహితుడైన నరసింహ చింతమన్ కేల్కర్ 1897, 1908లో తిలక్ జైలు పాలైనప్పుడు రెండుసార్లు సంపాదకుడిగా పనిచేశాడు.[5]
1897 కేసరి ప్రాసిక్యూషన్
[మార్చు]1897 కేసరి ప్రాసిక్యూషన్ ముగిసిన తర్వాత స్వామి వివేకానంద నుండి తనకు అందిన లేఖ అనేక ఇతర లేఖలతో పాటు నాశనం చేయబడి ఉంటుందని బాల గంగాధర్ తిలక్ పేర్కొన్నాడు[6]
ప్రస్తుతం
[మార్చు]లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ముని మనవడు దీపక్ తిలక్ సంపాదకత్వంలో ది డైలీ కేసరి అనే ఆన్‌లైన్ మరాఠీ పత్రిక ప్రచురించబడుతూనే ఉంది.[7]
కేసరి వాడా, తిలక్ మ్యూజియం
[మార్చు]ఈ వాడాను మొదట గైక్వాడ్వాడ అని పిలిచేవారు,[8] బరోడా సంస్థానం మహారాజు సాయాజీరావు గైక్వాడ్ III యాజమాన్యంలో ఉండేది. దీనిని 1905 లో మహారాజు తిలక్ కు సరసమైన ధరకు అమ్మేశాడు.[9][10] తిలక్ వార్తాపత్రికను ప్రచురించిన అసలు వాడా (ఆవరణ/భవనం కోసం మరాఠీ ) ఇప్పటికీ కేసరి కార్యాలయాలను కలిగి ఉంది. కేసరి కార్యాలయాలతో పాటు, ప్రాంగణంలో తిలక్ మ్యూజియం, కేసరి-మరాఠా లైబ్రరీ ఉన్నాయి. ఇవి తిలక్ జ్ఞాపకాలతో సహా ఆయన వ్రాసే డెస్క్, అనేక అసలు పత్రాలు, 1907 లో స్టట్‌గార్ట్‌లో మేడమ్ కామా ఆవిష్కరించిన మొదటి భారత జాతీయ జెండాను కలిగి ఉన్నాయి.[11] గణపతి పండుగ సమయంలో, వాడాను పెద్ద సంఖ్యలో ప్రజలు సందర్శిస్తారు.[12][13]
మూలాలు
[మార్చు]- ↑ "About the Vice Chancellor - Deepak J.Tilak". tmv.edu.in. Tilak Maharashtra Vidyapeeth. Archived from the original on 25 June 2014. Retrieved 17 June 2014.
- ↑ "Retracing the legend of Gangadhar Tilak at Kesariwada". hfghbbitagesites.wordpress.com. Blog - Indian Heritage Sites. 11 September 2013. Retrieved 17 June 2014.
- ↑ Inamdar, Siddhesh (4 January 2010). "Tendency to dumb down journalism disturbing: N. Ram". The Hindu. Pune. Retrieved 7 January 2013.
- ↑ Mone (Tilak), Mrs. Geetali Hrishikesh. "The Role of Free Circulation in Optimum Newspaper Development - Ph.D. thesis submission". shodhganga.inflibnet.ac.in. Preface - Shodhganga. Archived from the original on 20 June 2014. Retrieved 17 June 2014.
- ↑ (1947). "Sri Narasimha Chintaman "Alias" Tatyasaheb Kelkar".
- ↑ "Reminiscences of Swami Vivekananda". www.ramakrishnavivekananda.info.
- ↑ "Know your city - Pune". Indian Express. Retrieved 17 June 2014.
- ↑ "Gaikwad Wada Photo on Maharashra Government Website". Maharashtra.gov.in. 22 April 2017.
- ↑ HoVB (2017-04-22). "Gaekwad Wada at Pune". History of Vadodara - Baroda. Retrieved 2021-04-08.
- ↑ Bal Gangadhar Tilak (1908). Full & Authentic Report of the Tilak Trial: (1908.) Being the Only Authorised Verbatim Account of the Whole Proceedings with Introduction and Character Sketch of Bal Gangadhar Tilak Together with Press Opinion. Printed at the Indu-Prakash steam Press. p. 17.
- ↑ Pal, Sanchari (24 September 2016). "Remembering Madam Bhikaji Cama, the Brave Lady to First Hoist India's Flag on Foreign Soil". A better India. Retrieved 28 June 2018.
- ↑ "Kesari Wada". maharashtratourism.net. Maharashtra Tourism. Retrieved 17 June 2014.
- ↑ "Kesari Wada". punesite.com. Pune Site. Archived from the original on 28 June 2018. Retrieved 17 June 2014.
{{cite web}}
: CS1 maint: unfit URL (link)