Jump to content

కె. వి. కృష్ణకుమారి

వికీపీడియా నుండి
(కె.వి.కృష్ణకుమారి నుండి దారిమార్పు చెందింది)
డాక్టర్ కె.వి. కృష్ణ కుమారి
సత్య సాయి బాబా తో కె.వి.కృష్ణకుమారి
జననంకృష్ణ కుమారి
India తెనాలి, గుంటూరు
నివాస ప్రాంతంహైదరాబాద్, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణక్క
వృత్తిడాక్టర్
రచయిత్రి
మతంహిందూ
తండ్రిడాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు
తల్లిసత్యవతి

కె. వి. కృష్ణకుమారి తెలుగు రచయిత్రి, సాహితీవేత్త, గైనకాలజిస్టు.[1] ఆమె కృష్ణక్కగా సుప్రసిద్ధురాలు. ఆమె తన తండ్రి గారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎన్నో సేవలని ఎంతో మందికి అందిస్తున్నది.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆమె తెనాలిలో కాజా వెంకట జగన్నాథరావు, సత్యవతి దంపతులకు జన్మించింది. కృష్ణక్కకు ముగ్గురు తమ్ముళ్ళు నలుగురు చెల్లెళ్ళు అందరు ఉన్నత స్థానములో సెటిల్ అయ్యారు. కృష్ణక్క ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యవరకు తెనాలి లోనే అభ్యసించింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను (ఎం.బి.బి.ఎస్) అభ్యసించింది. ఆమె హైదరాబాదులో నివాసం ఉంటున్నది. ఆమె వృత్తి మెడికల్ ప్రాక్టీషనర్ అయినా ప్రవృత్తి మాత్రం రచనా వ్యాసంగమే. ఆమె 'రమ్యకథా కవయిత్రి' గా పేరు పొందినది. ఆమె తన పది సంవత్సరాల వయసులో 'భలే పెళ్ళి' నాటకంతో రచనా వ్యాసాంగం ప్రారంభించింది.మానసిక స్థైర్యం కోల్పో యిన వారికి కృష్ణక్క సలహాలు, సూచనలు ఎందరికో మార్గదర్శనమయ్యాయి.[2]

రచనా వ్యాసాంగం

[మార్చు]

కృష్ణకుమారి తన పదేళ్ళ వయసులో తెనాలి బ్రాంచి హైస్కూల్లో చదువుతున్న సమయంలో విద్యార్థుల ప్రదర్శన కోసం 'భలే పెళ్ళి' నాటకం రాసింది. 1970 ప్రాంతంలో ప్రముఖ మాసపత్రిక ‘మహిళ’ తిరుపతి నుండి వెలువడేది. రాయలసీమ సేవా సమితి సెక్రెటరీ డా. మునిరత్నం నాయుడుగారు, పద్మారత్నంగారూ, ఆ పత్రికకు సారథ్యం వహించేవారు. ఆ పత్రికలో యద్దనపూడి సులోచనారాణితో కలసి పోటాపోటీగా సీరియల్స్‌ వ్రాసేదామె. ‘కృష్ణక్క సలహాలు’ అనే శీర్షిక ద్వారా పాఠకులకు ఆమెను పరిచయం చేసింది ఆ పత్రికే.[3] దాదాపు నలభై సంవత్సరాల పాటుగా వివిధ ప్రముఖ పత్రికలలో, ‘కృష్ణక్క సలహాలు’ శీర్షికను నిర్వహిస్తూ కృష్ణక్కగా లక్షలాది మంది హృదయాలలో స్దిరస్థానం సొంతం చేసుకున్నదామె.

సమాజ హితమే తన హితంగా భావించే కృష్ణకుమారి ఐదు దశాబ్దాలకు పైగా రచయిత్రిగా చిరస్మరణీయమైన గ్రంథాలు వెలువరించింది. నవలా రచయిత్రిగానే కాకుండా జీవిత కథలను అందించడంలో కూడా ఆమె సిద్ధహస్తురాలు. డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకు ఆత్మీయురాలు, కుటుంబ సభ్యురాలు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ కృష్ణకుమారి రాసిన “మనిషిలో మనీషి” అన్న గ్రంథం ఇప్పటికీ బహుళ ప్రజాదరణ పొందింది. అలాగే పుట్టపర్తి సాయిబాబా మీద రాసినటువంటి “అద్వైతామృత వర్షిణి” అన్న గ్రంథం కూడా భక్తులు అమితంగా ఇష్టపడతారు.[4]

ఇప్పటిదాకా వైద్యరంగంలో తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్ లోను, గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను, హైదరాబాద్ కింగ్ కోటి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లోను ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించి పదవీ విరమణ చేసారు. ఆధ్యాత్మిక పరంగా, ఆదేశాత్మకంగా 60కి పైగా నవలలు వ్రాసింది. “సహిత జావిత వజ్రోత్సవ” వేడుకలను అభిమానులు జరుపుకున్నారు. భగవాన్ సత్యసాయి బాబా కృష్ణక్క త్యాగ నిరతికి మెచ్చి “ఓంకార” పతకమున్నసువర్ణమాలను స్వయంగా మెడలో అలంకరించారు. అతని ఆదేశాలనుసారం అద్వైతామృత వర్షిణి, ‘భద్రాకళ్యాణం’ ప్రబంధ గ్రంథం వ్రాసింది.

"ఆరోగ్యప్రదాయి శ్రీ సత్యసాయి" అనే ఆధ్యాత్మిక శీర్షిక దాదాపు 40 నెలలపాటు ధారావాహికముగా సనాతన సారథిలో వెలువడింది. ఇది గ్రంథ రూపములో రాబోతుంది. అలాగే శ్రీవాణి ఆధ్యాత్మిక మాసపత్రికలో "భగవాన్ ఉవాచ" అనే ఆధ్యాత్మిక శీర్షిక ఎన్నో సంవత్సరాలు వెలువడింది.

రాజకీయ నేపథ్యం ఆమెకు దేశభక్త కొండా వెంకటప్పయ్య పంతులుగారు, మాజీ రాష్ట్రపతి వి. వి. గిరి వి.వి.గిరి రక్త సంభంధీకులైన దగ్గర బంధువులు. మెడిసిన్ లో, కుటుంబపరంగా, కొండా వెంకటప్పయ్య గారి మెరిట్, స్కాలర్షిప్ ను అందుకున్నది. మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు గారు కృష్ణకుమారి కుటుంబానికి అత్యంత ఆత్మీయులు. భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి గారి అభిమాన పుత్రికగా, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి ఇంటి ఆడపడుచుగా సుప్రసిద్దురాలు.

రచనలు

[మార్చు]
  • కర్మయోగి [5]
  • భద్రాకళ్యాణం [6]
  • మనిషిలో మనీషి డాక్టర్ అక్కినేని[7]
  • మంచుపూలు
  • శ్రీ కృష్ణామృతం
  • సశేషం[8]

పురస్కారాలు

[మార్చు]
  1. 1974 తెనాలి శారదా కళా పీఠంలో అంతర్జాతీయ మహిళా సంవర్గములో వివిధ సాహితీ సంస్థల చే “రమ్య కధా కవయిత్రి” “అభ్యుదయ నవలా రచయిత్రి “బిరుదులు ప్రధానం
  2. 1975 లో మహా కవి శ్రీ శ్రీ తో అంతర్జాతీయ రచయితల సదస్సుకు ఆహ్వానం అందుకున్నారు
  3. 1983 లో తానా వారిచే అమెరికాకు ఆహ్వానం.వాషింగ్టన్ లో మస్కులర్ డిస్త్రోఫీ అన్న అంశము పై వైద్యపరముగా పేపర్ సమర్పించటం
  4. 1983 లో సాహితీ జీవిత రజోతోత్సవ సందర్బముగా హైదరాబాద్ త్యాగరాయ గానసభ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుచే ఘనసత్కారం
  5. 1983 లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆచార్యుల చేతుల మీదుగా పూర్వ విద్యార్దినిగా ప్రతిభా పురస్కార ప్రధానం
  6. 1983 లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి ద్వారా కాలేజ్ ఆఫ్ జనెరల్ ప్రాక్టిషనర్ గా ఎంపిక
  7. 1983 లో రాయల్ సొసైటీ ఆఫ్ హెల్త్ (లండన్) వీరి ద్వారా ఫెలోషిప్ స్వీకారం
  8. 1989 లో శ్రీనాధ పీఠం గుంటూరు వారి ఆహ్వానం పండితోత్తములతో సత్కారం
  9. 1992 లో ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి గారిచే అంతర్జాతీయ తెలుగు రచయితల సంస్థల తరపున రవీంద్రభారతి హైదరాబాద్ లో సన్మానం
  10. 1992 లో వైద్యరంగ పరముగా ఉమన్ ఆఫ్ దిఇయర్ ప్రతిష్టాత్మక అవార్డు హరిహర కళాభవన్ లో ప్రదానం
  11. 1992 లో దుర్గాబాయ్ దేశ్ ముఖ్ అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు చేతుల మీద అందుకున్నారు
  12. 1993 లో ఇందిరాగాంధీ జాతీయ పురస్కారం
  13. 1993 లో సాహితీ వైద్య శిరోమణి పురస్కారం పిసిసి అధ్యక్షులు శ్రీ మజ్జి తులసీదాస్ గారి చేతుల మీదుగా ఇందిరా ప్రియదర్శిని హాల్ లో అందుకున్నారు
  14. 1993 లో శ్రీ మతి మాదిరెడ్డి సులోచన పేరిట ఉత్తమ రచయిత్రి అవార్డు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే భారతీయ విద్యాభవన్( హైదరాబాద్ లో) అందుకున్నారు
  15. 1994 లో "మహాత్మాగాంధీ జాతీయ పురస్కారం రవీంద్ర భారతి హైదరాబాద్ లో
  16. 1995 లో "గ్లోరి ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విజయశ్రీ అవార్డు"ను ఇంటర్ నేషనల్ ఫ్రెండ్ షిప్ సొసైటీ ఆఫ్ ఇండియా (న్యూ ఢిల్లీ) వారి ఆధ్వర్యములో శ్రీమతి షీలాకౌల్ శ్రీ వసంతసాధే ద్వారా స్వీకారం
  17. 1995 లో గ్లోరి ఆఫ్ ఇండియా అంతర్జాతీయ పురస్కారం"సందర్బముగా రవీంద్రభారతిలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు,ఆరోగ్య శాఖా మంత్రి శ్రీ ఎ.మాధవరెడ్డి చే ఘనసత్కారం
  18. 1997 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బముగా గాంధీభవన్ లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు శ్రీ రోశయ్య, శ్రీ శ్రీపాదరావులచే సన్మానం
  19. 1997 లో విశ్వవిజ్ఞాన ఆధ్యాత్మిక పీటం ( భీమవరం ) వారి ఆధ్వర్యములో డాక్టర్ ఉమర్ ఆలేశా సాహితీ సమితి వారి చే ఘన సత్కారం
  20. 1997 లొ భరతముని పురస్కారం భరత ముని ఆర్ట్స్ అకాడమి (మదనపల్లి) వారి చే
  21. 1998 లో నెహ్రు నికేతన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (తెనాలి) వారి చే తెనాలి నూరేళ్ళ రంగస్థలి గ్రంధావిష్కరణ సందర్బముగా సత్కారం
  22. 1999 లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నుండి అఖండ దివ్యాశీస్సులతో బాటు పసిడి దండ బహుకరణ స్వామి తో ప్రత్యక్షముగా 45 నిమిషాలు సంభాషించే అరుదైన అదృష్టం
  23. 2000 నవంబర్ లో భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్యాశీస్సులతో “భద్రాకళ్యాణం” ప్రభంధ గ్రంథ రచనకు శ్రీకారం (2018 సంవత్సరం నాటికి 39 వ ముద్రణలోకి అడుగుపెట్టబోతుంది, ఇది సాహితీ చరిత్రలో అరుదు అపూర్వం ఇదంతా స్వామి దివ్యానుగ్రహ ఫలితమే)
  24. 2000 డిసెంబరులో స్వరలయ వేదిక (తెనాలి) వారి వార్షికోత్సవం సందర్భముగా ఘన సత్కారం
  25. 2001 ఆగస్టులో ప్రతిష్ఠాత్మక మథర్ ధేరిస్సా సాహితీవైద్య – సేవా పరంగా మిలీనియం సేవా పురస్కారం ప్రధానం (హెల్త్ కేర్ ఇంటర్ నేషనల్ వారి సహకారముతో )
  26. 2001 ఆగస్టులో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ దుర్గి (కృష్ణా జిల్లా) సిల్వర్ జుబ్లీ సెలబ్రెషన్స్ సందర్భముగా సన్మానం
  27. 2003 ఫిబ్రవరిలో నంది అవార్డ్స్ జ్యూరీ సభ్యురాలిగా ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడుచే సన్మానం
  28. 2003 మార్చిలో ఆంధ్ర ప్రదేశ్ నాన్ గెజిటెడ్ మహిళా సంస్థల తరపున సత్కారం
  29. 2004 జూలైలో ప్రతిష్ఠాత్మక “దుర్గాబాయి దేశ్ ముఖ్” అవార్డు శ్రీమతి వి.ఎస్. రమాదేవి (మాజీ గవర్నర్ కర్ణాటక) నుండి స్వీకారం
  30. 2004 సెప్టెంబరులో టి. ఎస్.ఆర్. అవార్డు రవీంద్ర భారతిలో ప్రదానం
  31. 2005 జనవరిలో శ్రీ సత్య సాయి సమాజ సేవా కేంద్రం తెనాలి వారి చే సత్కారం
  32. 2005 జనవరిలో ప్రతిభావంతురాలైన పూర్వ విద్యార్థినిగా తెనాలి ఏ.ఎస్.ఆర్. కాలేజ్ నిర్వాహకుల చే ఫౌండర్స్ డే సందర్భముగా సత్కారం
  33. 2005 జూన్ లో శ్రీ సత్యసాయి సంస్థ విశాఖపట్నం శ్రీకాకుళం ఆధ్యాత్మిక ప్రసంగాలకై ఆహ్వానం, సత్కారం.
  34. 2005 జూన్ లో “భీమరధ శాంతి “ఉత్సవం సందర్బముగా విశాఖపట్నం (గాజు వాక) వారి చే ఆహ్వానం, సత్కారం
  35. 2005జూన్ లో “భారత మహిళా శక్తి” ఆవిర్భావ సందర్భముగా ఆహ్వానం శ్రీమతి హరిప్రియారంగరాజన్ శ్రీ జయ ప్రకాష్ నారాయణ్ (లోక్ సత్తా) చే పురస్కార ప్రదానం
  36. 2005 ఆగస్టులో ప్రతిష్ఠాత్మకమైన “శ్రీ దివాకర్ల వెంకటావధాని అవార్డు” శ్రీ త్యాగ రాయ గాన సభలో శ్రీ దివాకర్ల జన్మదిన సందర్భముగా బహుకరణ
  37. 2005 సెప్టెంబరు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు 82 వ జన్మదిన సందర్భంగా డాక్టర్ అక్కినేని చే “అక్కినేని అవార్డు” బహుకరణ
  38. 2006 జనవరిలో భద్రా కళ్యాణం ప్రబంధ గ్రంథం స్ఫూర్తితో ఆస్ట్రేలియా లోని శ్రీ సత్య సాయి స్పిరిట్యువల్ సెంటర్స్ వారిచే ఆస్ట్రేలియాకు ఆహ్వానం. సిడ్నీ, మెల్బోర్నీ లలోని దాదాపు 72 కేంద్రాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు, ఉపన్యాసాలు, పురస్కారాలు
  39. 2006 ఏప్రిల్ ఆస్ట్రేలియా ( సిడ్నీ ) లో నిర్వహించబడిన ఉగాది ఉత్సవాలలో ముఖ్య అతిథిగా ఆహ్వానం, పురస్కార ప్రధానం
  40. 2007 జనవరి 19 -శ్రీ విజయ దుర్గా పీటం ( వెదురుపాక) పీటాధిపతుల వారిచే “శ్రీ విజయ దుర్గా విశిష్ట మహిళా పురస్కారం”
  41. 2007 మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా తెలుగు మహిళా విభాగం వారి చే శ్రీ నారా చంద్రబాబునాయుడు ఆధ్వర్యములో ఎన్. టి .ఆర్ .ట్రస్ట్ భవన్ లో “విశిష్ట మహిళా” పురస్కారం
  42. 2007 మార్చి 10 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భముగా” జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా “మహిళా విభాగం వారిచే పురస్కార ప్రధానం
  43. 2007 మార్చ్ 20 “భారతీయ సంస్కృతి పరిరక్షణ” సమాఖ్య వారిచే జి. నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ ఆడిటోరియంలో సర్వ జిత్ నామ సంవత్సర ఉగాది పురస్కారం
  44. 2007 జూలై 28 “అబినందన” సాంస్కృతిక సేవా సంస్థల వారి చే శ్రీ త్యాగరాయ గాన సభ (హైదరాబాద్ ) లో ఉగాది విశిష్ట మహిళా పురస్కార ప్రధానం
  45. 2007 జూలై 22 “చేతన” పత్రిక ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో సాహితీసేవలకు విశిష్ట గౌరవ సత్కారం
  46. 2007 సెప్టెంబరు 20- రచనా రంగములో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భములో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి చే “సాహితీ స్వర్ణోత్సవ పురస్కారం “
  47. 2008 ఏప్రిల్ 7 – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారిచే ముఖ్య మంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా విశిష్ట రచయిత్రిగా సర్వధారి ఉగాది పురస్కారం
  48. 2008 ఏప్రిల్ 16 –ఫ్రెండ్స్ వెల్ ఫేర్ అసోసియేషన్ వారి చే సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో బెస్ట్ డాక్టర్ అవార్డు ప్రధానం
  49. 2008 ఏప్రిల్ లో అన్నమాచార్య భవన్ లో ఉత్తమ మహిళా పురస్కారం
  50. 2009 ఏప్రిల్ 1 కమలాకర్ లలిత కళాభారతి వారిచే ఉగాది పురస్కారం
  51. 2009 ఏప్రిల్ 19 ఆంధ్ర సారస్వతి సమితి మచిలీపట్టణం వారిచే విశిష్ట ప్రతిభా పురస్కారం
  52. 2009 మే 9 ప్రజారాజ్యం పార్టీ వారిచే విశిష్ట మహిళా పురస్కారం
  53. 2010 సెప్టెంబరు 20 డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ప్రతిష్ఠాకరమైన “అక్కినేని”పురస్కారం “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు, స్వర్ణ కoకణ” బహుకరణ
  54. 2011 మార్చి 8 తేదీ న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా ధార్మిక సంస్థల ఆధ్వర్యంలోను సన్మానం
  55. 2011 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భముగా రాగరాగిణి సాంస్కృతి సంస్థ వారిచే త్యాగరాజ గానసభలో పురస్కార ప్రదానోత్సవం
  56. 2012 మార్చి 8 అంతర్జాతీయ మహిళా సంవత్సర సందర్భముగా కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్టణం ) వారిచే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ సాహితీ పురస్కారం
  57. 2013 శ్రీ కళా సుధా తెలుగు అసోసియేషన్ చెన్నై వారిచే మ్యూజిక్ అకాడెమీ ఆడిటోరియంలో మహిళా రత్న పురస్కార ప్రదానం
  58. 2013 సెప్టెంబరులో ప్రతిష్ఠాకరమైన జీవిత సాఫల్య పురస్కారం డాక్టర్ అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు
  59. 2013 “నిష్కలంక రాజ నీతిజ్ఞుడు నీలం” గ్రంథాన్ని రచించిన సందర్భముగా ఆయన శతజయంతి ఉత్సవ సభలో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్, ముఖ్య మంత్రి గార్ల చేత ఘన సన్మానం
  60. 2013 డా. నీలం జయంతి ముగింపు సభలో నిరుపమాన త్యాగధనుడు నీలం గ్రంథావిష్కరణ సభలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా పురస్కారం
  61. 2013 సి. నారాయణరెడ్డి గారి నుండి సాహితీ సేవలకు సుశీల నారాయణరెడ్డి పురస్కారం
  62. 2013 మూడవ ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విజయవాడలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ చో సాహితీ పురస్కారం
  63. 2015 మార్చి శ్రీవాణి ఆధ్యాత్మిక మాస పత్రిక 30 వ వార్షికోత్సవం సందర్భముగామచిలీపట్నంలో విశిష్ట సాహితీ పురస్కారం
  64. 2015 వంశీ ఇంటర్ నేషనల్ వారిచే త్యాగరాయ గానసభలో రామరాజు లక్ష్మీ నరసయ్య పురస్కార ప్రదానం
  65. 2015 కమలాకర్ లలిత కళాభారతి ఆధ్వర్యములో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ (హైదరాబాద్) లో జీవిత సాఫల్య పురస్కార ప్రదానం
  66. 2015 గాయత్రి ధార్మిక సేవా ఆధ్యాత్మిక సంస్థ వారిచే – “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సందర్భముగా ఆత్మీయ పురస్కార ప్రదానం
  67. 2015 చిక్కడపల్లి జట్కర్ భవన్ సభా ప్రాంగణంలో “నా ఆధ్యాత్మిక అనుభవాలు” ప్రవచన సభలో అభినందన పురస్కారం
  68. 2015 ఆంధ్రనాటక కళాసమితి (విజయవాడ) స్వర్ణోత్సవ సందర్భముగా ఘంటసాల సంగీత ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో శ్రీమతి మాగంటి అంజని స్మారక పురస్కర ప్రదానం
  69. 2015 శ్రీ లలితా కల్చరల్ అసోసియేషన్ వారి ద్వారాకీ శే గన్నవరపు సీతారామం స్మారక పురస్కారం –డాక్టర్ కే.వి. రమణాచారి గారిచే త్యాగరాయ గాన సభలో అందుకున్నారు
  70. 2016 యువకళావాహిని ఆధ్వర్యంలో 5 గ్రంథాల ఆవిష్కరణ మహోత్సవం, పురస్కార ప్రదానోత్సవం శ్రీ మండలి బుద్ధప్రసాద్ జస్టిస్ రామలిగేశ్వరరావు, కే.వి.రమణాచారి చేతుల మీదుగా – వేదిక శ్రీ త్యాగరాయ గానసభ
  71. 2016 అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భముగా అభినందన సాహితీ సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో శ్రీమతి మాదిరాజు వరలక్ష్మి స్మారకసాహితీ పురస్కారం- వేదిక త్యాగరాజ గానసభ
  72. 2016 సర్వార్ధ సంక్షేమ సమితి అధ్వర్యంలో శ్రీ పి.వి.నరసింహరావు జయంతిని పురస్కరించుకొని శ్రీ త్యాగరాయ గానసభలో పురస్కార ప్రదానం “ఆధ్యాత్మిక అనిమేహి” బిరుదు ప్రదానం. శాసన మండలి సభ్యులు శ్రీ చక్రపాణి శ్రీ పి.వి. ఆర్.కే. ప్రసాద్, శ్రీ కే.వి. రమణాచారి గార్ల చేతుల మీదుగా జరిగింది.
  73. 2017 సృజనా సాహితీ సేవా సంస్థ చే ప్రసాద్ ల్యాబ్ హైదరాబాద్ లో “లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు” పురస్కార ప్రదానం
  74. 2018 ఏప్రిల్ 9 డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవి సాహితీ పురస్కారం యువ కళావాహిని ఆధ్వర్యంలో - వేదిక త్యాగరాయ గానసభ
  75. 2018 జనవరి 28 తెలుగు సాహిత్య మహోత్సవం సందర్భముగా తెనాలి రామకృష్ణకవి ఆడిటోరియం ( తెనాలి) లో విశిష్ట సాహిత్య పురస్కారం
  76. 2018 కళారత్న పురస్కారాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకుంది.[9]

పదవులు

[మార్చు]

కృష్ణక్క గారి పదవులు

  1. వైద్యుల లోని సృజనాత్మక శక్తినీ లలిత కళల తాలూకు ప్రతిభాపాటవాలనువెలికి తీసే నేపథ్యంలోఏర్పడిన “స్పందన” సాంస్కృతిక సంస్థలకి వ్యవస్థాపక అధ్యక్షులు (1985)
  2. ఆంధ్రప్రదేశ్ మహిలాభ్యుదయ సమితి అధ్యక్షురాలిగా ఎంపిక (1991)
  3. ప్రతిష్ఠాత్మక సాహితీ సాంస్కృతిక మహిళా సంస్థ “అభినందన “కు అధ్యక్షురాలిగా ఎకగ్రీవముగా ఎన్నిక (1992)
  4. విశ్వభారతి అకాడమీ సర్ సి.వి. రామన్ ఎడ్యుకేషనల్ అవార్డు కమిటీకి చైర్ పర్సన్ గా ఎంపిక (1995)
  5. శ్రీ సాయి సేవా సొసైటీ స్వచ్ఛంద ధార్మిక సంస్థలకి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా నియామకం (1995)
  6. ”డాక్టర్ కాజా వెంకట జగన్నాధరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భావం చైర్ పర్సన్”గా ఏకగ్రీవముగా ఎన్నిక (1995)
  7. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే “నంది అవార్డు కమిటీ సభ్యురాలి”గా ( 1994-1995 ) నియామకం
  8. ఇంట్రాడ్ సునేత్ర అంధుల పాఠశాలలకు చైర్మన్ గా ఏకగ్రీవముగా ఎన్నిక (1999 august)

వనరులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Dr. K.V. Krishna Kumari in Nallakunta, Hyderabad : General Physicians, clinic : Health Search - Healcon.com". healcon.com. Retrieved 2018-06-10.
  2. "సేవే లక్ష్యంగా కృష్ణక్క సాహితీ సేద్యం, వైద్యం".
  3. "ఆమె వాక్యాల్లో చంద్రుని చల్లదనం".[permanent dead link]
  4. "సమాజసేవలో డాక్టర్ కే.వి.కృష్ణకుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-06. Archived from the original on 2018-10-09. Retrieved 2018-06-10.
  5. "Karmayogi,K V Krishna Kumari - online Telugu Books". www.logili.com. Retrieved 2018-06-10.
  6. Prof. V. Viswanadham, Bhadra Kalyanam by Dr. K. V. Krishna Kumari - reading by Prof. V. Viswanadham Part-1, retrieved 2018-06-10
  7. "Manishilo Maneeshi Doctor Akkineni - మనిషిలో మనీషి డాక్టర్‌ అక్కినేని". Archived from the original on 2020-05-23. Retrieved 2018-06-10.
  8. "Sasesham - సశేషం".[permanent dead link]
  9. ""కళారత్న" అవార్డు మరచిపోలేని అనుభవం : డాక్టర్ కేవీ కృష్ణ కుమారి - Navya Media Telugu news Portal". Navya Media Telugu news Portal. 2018-03-22. Retrieved 2018-06-10.[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]