కాలం
స్వరూపం
(కాలమానాలు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
కాలమానం లేదా కాలం, అనగా సమయాన్ని కొలుచుటకు లేదా వ్యక్తపరచుటకు ఉపయోగించే పదం.
సాధారణ కాలమానాలు
[మార్చు]ఆరోహణ క్రమంలో సాధారణ కాలమానాలు
- సెకను అతి చిన్న ప్రమాణం
- నిమిషం = 60 సెకనులు
- గంట = 60 నిమిషాలు
- రోజు = 24 గంటలు
- వారం = 7 రోజులు
- పక్షం = 15 రోజులు
- నెల = 30 రోజులు
- సంవత్సరం = 12 నెలలు
- 10 సంవత్సరాలు = దశాబ్ధం
- 25 సంవత్సరాలు = రజత వర్షం
- 40 సంవత్సరాలు = కెంపు వర్షం
- 50 సంవత్సరాలు = స్వర్ణ వర్షం
- 60 సంవత్సరాలు = వజ్ర వర్షం
- 75 సంవత్సరాలు = అమృత వర్షం
- 100 సంవత్సరాలు = శత వర్షం లేదా శతాబ్దం
- 1000 సంవత్సరాలు = సహస్రాబ్ధి
తెలుగు కాలమానం
[మార్చు]- క్రాంతి = 1 సెకనులో 34,000వ వంతు
- తృటి = 1 సెకెనులో 300వ వంతు
- తృటి = 1 లవం లేదా లేశం
- 2 లవాలు = 1 క్షణం
- 30 క్షణాలు = 1 విపలం
- 60 విపలాలు = 1 పలం
- 60 పలంలు = 1 ఘడియ/చడి (24 నిమిషాలు)
- 2.0 చడులు/ఘడియలు
- 2.5 చడులు = 1 హోర
- 24 హోరలు = 1 దినం
- రెప్పపాటు అతి చిన్న ప్రమాణం
- విఘడియ = 6 రెప్పపాట్లు
- ఘడియ = 60 విఘడియలు
- గంట = 2 1/2 ఘడియలు
- ఝాము = 3 గంటలు లేదా 7 1/2 ఘడియలు
- రోజు = 8 ఝాములు లేదా 24 గంటలు
- వారం = 7 రోజులు
- పక్షం = 15 రోజులు
- మండలం = 40 రోజులు
- నెల = 2 పక్షంలు లేదా 30 రోజులు
- ఋతువు = 2 నెలలు
- కాలం = 4 నెలలు
- ఆయనం = 3 ఋతువులు లేదా 6 నెలలు
- సంవత్సరం = 2 ఆయనాలు
- పుష్కరం = 12 సంవత్సరాలు