Jump to content

ఓపెన్ సోర్సు సాఫ్ట్​వేర్

వికీపీడియా నుండి
(ఓపెన్ సోర్సు నుండి దారిమార్పు చెందింది)
ఇది ఓపెన్ సోర్సు యొక్క లోగో

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు అనేది కాపీహక్కుల గల వ్యక్తి తను రూపొందించిన సాఫ్టువేరు యొక్క కోడును చదువుటకు, మార్చుటకు, ఏ అవసరాలకైనా, ఎవరితోనైనా పంచుకునే అవకాశాన్ని కల్పించే లైసెన్సుతో కూడిన కంప్యూటరు సాఫ్ట్వేరు. ఓపెన్ సోర్సు సాఫ్ట్వేర్ సాధారణంగా బహిరంగంగా, పరస్పర సహకారంతో అభివృద్ధి చేయబడుతుంది. ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరునకు ప్రసిద్ధిగాంచిన ఒక ఉదాహరణ లినక్స్. మైక్రోసాఫ్ట్ విండోసు నిర్వాహక వ్యవస్థ లేదా మ్యాక్ / మెకింటొష్ నిర్వాహక వ్యవస్థల వలె కాకుండా లినక్స్ సోర్సు కోడు ప్రజలకు బాహాటంగా లభించడమే కాక ఉచితంగా లభిస్తుంది. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా దీనిని ఉచితంగా దింపుకోవచ్చు, మార్పులు చేర్పులు చేయవచ్చు, తిరిగి పంచిపెట్టవచ్చు.[1]

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరుగా ఉన్న నిర్వాహక వ్యవస్థలు

[మార్చు]

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు లో ఏ ఆపరేటింగు సిస్టము సులభంగా ఉంటుంది

[మార్చు]
ఉబుంటు

సులువుగా వాడటం కోసం నిర్వహణ విధులకొరకు సుడో ఆదేశంతో సాధారణ వాడుకరి చేయకలిగే వీలుంది. స్థాపన మాధ్యమం నుండి హార్డుడిస్క్ లో స్థాపించవచ్చు. కంప్యూటర్ ని తిరిగి ప్రారంభించనవసరంలేదు. అశక్తులైనవారికి సౌకర్యాలు, అంతర్జాతీయంగా వాడటం దీనిలో ప్రాముఖ్యతకలిగివున్నది. యు టి ఎఫ్-8 అక్షరపు ఎన్కోడింగు 5.04 విడుదలతో అప్రమేయంగా వాడబడుతున్నది. దీనివలన అన్ని భాషల వారు వాడటం కుదురుతుంది. దీనితోపాటు కార్యాలయ పనుల కొరకు అనువర్తనం లిబ్రెఆఫీస్, అంతర్జాల విహరిణి ఫైర్‌ఫాక్స్, త్వరిత వార్తావాహినిపిడ్జిన్, చిత్రాలను మార్పుచేయు అనువర్తనముగింప్, రకరకాలైన ఆటలు సుడోకు, చదరంగం సాఫ్ట్వేర్ దొరకుతాయి. అవసరంలేని నెట్ వర్క్ పోర్టులు మూసి వుంటాయు కాబట్టి, కంప్యూటర్ ని రక్షణ పెరుగుతుంది. 11.04 విడుదలలో తెలుగు, కన్నడ భాషలతో సహా 10 భారతదేశ భాషలలో బూట్ నుండే తోడ్పాటు వుండటంతో, ఇంగ్లీషు అంతగా రాని వారు కూడా సులభంగా కంప్యూటర్ వాడవచ్చు.

దేవోప్స్

[మార్చు]

దేవోప్స్ (" అభివృద్ధి ", " ఆపరేషన్స్ " యొక్క ఒక క్లిప్పెడ్ సమ్మేళనం ) సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అభ్యాసం అనేది ఏకీకృత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ (డెవ్), సాఫ్ట్వేర్ ఆపరేషన్ (ఆప్స్) లక్ష్యంగా ఉంది. దేవోప్స్ ఉద్యమం యొక్క ప్రధాన లక్షణం ఏకీకరణ, పరీక్షలు, విస్తరణ, అవస్థాపన నిర్వహణకు సంబంధించిన సాఫ్ట్వేర్ నిర్మాణం యొక్క అన్ని దశల్లో స్వయంచాలకంగా, పర్యవేక్షణను సమర్ధించడం.[1]

ఓపెన్ సోర్సు సాఫ్ట్వేరు పైన ఉన్న ఇంగ్లీషు పత్రిక

[మార్చు]

[2] Archived 2018-04-07 at the Wayback Machine[3]

మూలాలు

[మార్చు]
  1. https://www.svrtechnologies.com/devops-training Archived 2019-01-22 at the Wayback Machine దేవోప్స్ గురించిన మరింత సమాచారం తెలుసుకోండి