Jump to content

ఓదాంతపురి

వికీపీడియా నుండి
(ఒదంతపురి నుండి దారిమార్పు చెందింది)
బీహార్ షరీఫ్‌లోని హిరణ్య పర్వత్ పైన ఉన్న పురాతనప బౌద్ధ మఠాల శిధిలాల చిత్రం.

ఓదాంతపురి ప్రాచీన బౌద్ధ మహావిహారం. ఇది ప్రస్తుత బీహారులో ఉంది. సా.శ. 8 వ శతాబ్దంలో పాల చక్రవర్తి మొదటి గోపాలుడు దీన్ని స్థాపించాడు.[1] ఇది మగధ సామ్రాజ్యంలో ఉండేది. నలందా విశ్వవిద్యాలయం తరువాత ఇదే భారతదేశం లోని అత్యంత ప్రాచీన మహావిహారం. విక్రమశిలకు చెందిన ఆచార్య గంగాజీ ఈ విహారంలో విద్యార్థి. టిబెటన్ గ్రంథాల ప్రకారం ఓదాంతపురి పంచానన అనే నది ఒడ్డున హిరణ్య ప్రభాత్ అనే పర్వతం పైన ఉంది. ఇక్కడ 12,000 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ బౌద్ధ గ్రంథాలే కాక బ్రాహ్మణ విద్య కూడా నేర్పేవారు. ఈ విద్యాలయంలోని గ్రంథాలయం ప్రఖ్యాతి గాంచింది.

పాల చక్రవర్తుల కాలంలో అనేక విహారాలను నెలకొల్పారు. టిబెట్ గ్రంథాల ప్రకారం ఐదు గొప్ప మహావిహారాలుండేవి. అవి: విక్రమశిల, నలందా (అప్పతికి దాని ప్రశస్తి కొంత తగ్గింది), సోమపుర మహావిహారం, ఓదాంతపురి, జగద్దాల.[2] ఈ ఐదూ ఒక నెట్‌వర్కుగా ఉండేవి; "అవన్నీ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేవి", "వాటి మధ్య ఒక సమంవయం ఉండేది." పండితులు ఈ విద్యాలయాల్లో తమతమ స్థానాల నుండి పైకి ఎదుగుతూ ఉండేవారు. .[3]

సా.శ. 1193 లో మహమ్మద్ బిన్ బఖ్తియార్ ఖల్జీ నలందాతో పాటు ఓదాంతపురిని కూడా నాశనం చేసాడు. ఇచ్చటి భిక్షువులను విద్యార్థులనూ చంపి, గ్రంథాలయాన్ని నాశనము జేసాడు.

ప్రస్తుత కాలంలో ఓదాంతపురి నలందా జిల్లా ముఖ్య పట్టణమైన బీహార్ షరీఫ్ లో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. p. 34. ISBN 978-9-38060-734-4.
  2. Vajrayogini: Her Visualization, Rituals, and Forms by Elizabeth English. Wisdom Publications. ISBN 0-86171-329-X pg 15
  3. Buddhist Monks And Monasteries Of India: Their History And Contribution To Indian Culture. by Sukumar Dutt, George Allen and Unwin Ltd, London 1962. pg 352-3